EPAPER

Toilet Doors Gap : సినిమా హాల్, మాల్స్‌లో టాయిలెట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకు..?

Toilet Doors Gap : సినిమా హాల్, మాల్స్‌లో టాయిలెట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకు..?

Toilet Doors Gap: సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్ లేదా ఏదైనా పబ్లిక్ టాయిలెట్‌కి వెళితే.. ఒక విషయం గమనించొచ్చు మీరు. టాయిలెట్స్ డోర్ కింద భాగంలో కొంచెం గ్యాప్ ఉంటుంది. కానీ ఇంట్లో లేదా హోటల్ గదిలో అలా గ్యాప్ ఉండదు. ఈ తేడా ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఓ లాజిక్ ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సాధారణంగా ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ డోర్‌లు ఫుల్‌గా ఉంటాయి. కానీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, హాస్పిటల్‌లో ఉండే టాయిలెట్ డోర్లకు గ్యాప్ ఉంటుంది. ఇలా ఉండటానికి ప్రధాన కారణం క్లీన్ చేయడానికి సులభంగా ఉంటుంది.

టాయిలెట్ డోర్‌కు గ్యాప్ ఉండటం వల్ల నీళ్లు డోర్ మీద పడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. డోర్ కూడా త్వరగా పాడవ్వదు. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మీరు ఇది గమినించే ఉంటారు.


టాయిలెట్ డోర్‌కు గ్యాప్ ఉండటం వల్ల దుమ్మూ ధూళి త్వరగా బయటకు పోతుంది. అధిక చెడువాసనలు కూడా త్వరగా బయటకు పోతాయి. టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది.

టాయిలెట్ డోర్స్ కింది భాగంలో ఓపెన్‌గా ఉండటం వల్ల ఎవరైనా పొరపాటున టాయిలేట్ లోపల చిక్కుకుపోతే సులభంగా గుర్తించొచ్చు. లోపలకు వెళ్లిన వ్యక్తి ఎవరైనా శరీర సమస్య వచ్చి పడిపోయినా అది క్రింది నుంచి కనిపిస్తుంది. తలుపులు మూసి ఉంటే తెలుసుకోవడం కుదరదు.

ఇలా షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌కు వెళ్లిన వ్యక్తి టాయిలెట్ రూం వెళ్లిన తర్వాత ఏదైనా అనారోగ్య సమస్యతో కుప్పకూలినా త్వరగా వారిని గుర్తించి బయటకు తీసుకురావచ్చు.

షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, హాస్పిటల్ తదితర వాటిని పగలు, రాత్రి తేడా లేకుండా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల డోర్ దిగువ భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే టాయిలెట్ డోర్స్‌ని గ్యాప్ ఇచ్చి తయారు చేస్తారు.

Tags

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×