EPAPER

suhas – Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లేటెస్ట్ కలెక్షన్స్.. సుహాస్‌ ఖాతాలో మరో హిట్టు

suhas – Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లేటెస్ట్ కలెక్షన్స్.. సుహాస్‌ ఖాతాలో మరో హిట్టు

suhas – Ambajipeta Marriage Band: టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఎంతో మంది జీవితాలను మార్చింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే నటుల్ని కూడా పెద్ద హీరోల్ని చేసింది. అయితే గత ఆరేడేళ్ల క్రితం ఒకలెక్క ఉండేది. పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. చిన్న సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్లను మార్చుకునేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని.. ఎంతటి చిన్న హీరోనైనా అభిమానిస్తారని ఇప్పుడు వస్తున్న సినిమాలే రుజువుచేశాయి.


ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ కూడా మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది. అయితే ఇలా ఎంతో మంది చిన్న హీరోలు మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నటుడు సుహాస్ కూడా ఇదే కోవకు చెందుతాడు.

కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుహాస్.. అంతకుముందు కొన్ని సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. అప్పుడు దక్కిని క్రేజ్ ఒక్క కలర్ ఫోటో చిత్రంతో ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు. ఈ సినిమా సుహాస్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆ తరువాత హిట్ చిత్రంలో విలన్‌గా నటించి.. మరింత క్రేజ్‌ను అందుకున్నాడు.


ఇక ఈ మధ్య వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇలా వరుస సినిమాలతో విజయాలు సాధించిన సుహాస్ తాజాగా మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

దుష్యంత్ డైరెక్షన్‌లో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ అనే సినిమాతో మరోసారి వైవిద్యమైన కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా కనబరుస్తోంది. చిన్న సినిమాగా రిలీజై భారీ హిట్ వైపు అడుగులు వేస్తోంది.

ఇందులో సుహాస్ నటన అద్భుతంగా ఉంది. అలాగే శరణ్య పాత్ర, శేఖర్ చంద్ర మ్యూజిక్, దుష్యంత్ డైరెక్షన్ ప్రతీ ఒక్క అంశం సినిమాను హిట్టు దిశగా నడిపించాయి. ఈ సినిమాకు శుక్రవారం, శనివారం కలెక్షన్స్ మొత్తం చూస్తే.. దాదాపు రూ.5.16 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కూడా ఈ వసూళ్లకు సంబంధించి అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ రెండు రోజుల్లోనే ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఈ వారం విజేతగా నిలిచేందుకు ముందుకు వరుసలో ఉంది ఈ సినిమా. అంతేకాకుండా ఈవారం ఏకంగా 10 చిన్న సినిమాలు విడుదలు కాగా.. ఈ సినిమాకి మినహా మరే సినిమాకి కూడా మినిమం టాక్ రాలేదు. దీంతో మంచి కంటెంట్‌ ఉంటే ఎంతటి చిన్న హీరో సినిమా అయినా హిట్ అవుతుందని మరోసారి రుజువు చేసింది ఈ చిత్రం.

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×