EPAPER

Jasprit Bumrah : అన్నిటికన్నా జట్టు విజయం సాధించినప్పుడే ఆనందం: బుమ్రా

Jasprit Bumrah : అన్నిటికన్నా జట్టు విజయం సాధించినప్పుడే ఆనందం: బుమ్రా

Jasprit Bumrah: ఒకొక్క క్రికెటర్ తమ కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. అలాగే ఎన్నో మైలురాళ్లు చేరుకుంటూ ఉంటారు. అలాగే ప్రతీది వారికి స్పెషల్ అని చెప్పాలి. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు మాత్రం జస్ప్రీత్ బుమ్రాదేనని చెప్పాలి. కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి, ఇంగ్లాండ్ జట్టు నడ్డి విరిచాడు.  అంతేకాదు అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడయ్యాడు.


కొందరు అభిమానులు బుమ్రాను ఇంత గొప్ప ప్రదర్శనను ఎవరికి అంకితం ఇస్తారని ప్రశ్నించారు. మ్యాచ్ లో ఎఫెక్టివ్ గా ఆడినప్పుడు సంతోషంగానే ఉంటుంది. కాకపోతే మనం పెట్టిన ఎఫర్టు వల్ల టీమ్ ఇండియా విజయం సాధిస్తే, దానికి ఒక అర్థం ఉంటుందని అన్నాడు. లేదంటే ఎంత గొప్ప స్పెల్ వేసినా ఉపయోగం లేదని అన్నాడు. అది వ్యక్తిగతంగా, నావరకు మాత్రమే నాకు ఆనందాన్నిస్తుందని అన్నాడు.

మనస్ఫూర్తిగా ఆనందించాలంటే, మాత్రం ఎవరికైనా జట్టు విజయమే కీలకమని అన్నాడు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా…ఈ స్పెల్ ను మాత్రం నా కుమారుడికే అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. తను కూడా నాతోనే ట్రావెల్ చేస్తున్నాడని అన్నాడు. ఇది నాకెంతో స్పెషల్ అని అన్నాడు. ఈ వీడియోని బీసీసీఐ నెట్ లో అప్ లోడ్ చేసింది.


టెస్టుల్లో నా వందో వికెట్ ఒలిపోప్ నుంచే వచ్చిందని అన్నాడు. 2021 ఓవల్ లో తనని అవుట్ చేశానని అన్నాడు. అలాగే మొదటి టెస్టులో 196 పరుగులు చేసిన పోప్ మీద కాన్ సంట్రేషన్ ఎక్కువ చేశామని అన్నాడు. ఎందుకంటే తను క్రీజులో కుదురుకునేలోపే అవుట్ చేయాలని భావించామని అన్నాడు.

ఈసారి పోప్ కి బౌలింగ్ చేసేటప్పుడు మొదట లెంగ్త్ బాల్ వేద్దామని అనుకున్నా, కానీ చివర్లో మనసు మార్చుకుని యార్కర్ వేశానని అన్నాడు. ఆ బాల్ స్వింగ్ కావడంతో పోప్ కూడా డిఫెండ్ చేయలేకపోయాడని, అవుట్ అయ్యాడని అన్నాడు. అలాగే బెన్ స్టోక్ వికెట్ తీయడానికి ప్రత్యేకమైన వ్యూహం ఏమీ రచించలేదని అన్నాడు.

మొదట అవుట్ స్వింగ్ కోసం ప్రయత్నించాను. కానీ బాల్ సంధించిన తర్వాత అది స్వింగ్ అవలేదు. నేరుగా వికెట్ల మీదకు వెళ్లిందని అన్నాడు. వీళ్లిద్దరినీ కూడా ఒక బాల్ వేద్దామని ఒక బాల్ వేయడం వల్ల వికెట్లు దక్కాయని తెలిపాడు. అన్నింటికన్నా మిన్నగా టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతానని అన్నాడు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×