EPAPER

Guntur Kaaram OTT Release Date: ఓటీటీలోకి గుంటూరు కారం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

Guntur Kaaram OTT Release Date: ఓటీటీలోకి గుంటూరు కారం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?
guntur kaaram ott release

Mahesh Babu’s Guntur Kaaram OTT Release Locked:


మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ డైరక్టర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్‌ డ్రామా గుంటూరుకారం సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒకేసారి తెలుగుతో పాటు, మలయాళ, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ‘గుంటూరు కారం’ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో శ్రీలీల హిరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్ సమకూర్చారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జయరాం, రావు రమేశ్, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే..


వైరా వసుంధర (Ramya Krishna), రాయల్ సత్యం (Jayaram) కొడుకు వీరవెంకట రమణ అలియాస్ రమణ (Mahesh Babu). రమణ చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో.. గుంటూరులో ఉన్న తన మేనత్త బుజ్జి (Eshwari Rao) వద్ద పెరుగుతాడు. వసుంధర.. రాయల్ సత్యంతో విడిపోయాక మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకటస్వామి (Prakash Raj) అన్నీ తానే అయి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు.

అయితే.. వసుంధర రాజకీయ భవిష్యత్ కు ఆమె మొదటి పెళ్లి.. మొదటి భర్త, బిడ్డ అడ్డంకులు కాకూడదని భావించిన వెంకటస్వామి.. రమణతో ఒక అగ్రిమెంట్ పేపర్ పై సంతకాలు చేయించుకునేందుకు ప్రయత్నిస్తాడు. వసుంధరకు పుట్టిన రెండో కొడుకుని రాజకీయాల్లోకి వారసుడిగా తీసుకొచ్చే ప్రయత్నాలూ చేస్తాడు. తల్లిపై ఎంతో ప్రేమ ఉన్న రమణ.. వెంకటస్వామి అడిగిన అగ్రిమెంట్ కు ఒప్పుకుని సంతకం చేశాడా ?ఆ అగ్రిమెంట్ లో ఏముంది ? వసుంధర, రాయల్ సత్యం ఎందుకు విడిపోయారు ? అన్నదే మిగతా కథ.

భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగిన గుంటూరు కారం మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో మహేష్ క్యారెక్టర్, నటన, పాటలు, శ్రీలీల స్టెప్పులు ప్రేక్షకులను మెప్పించాయి. సినిమా చూస్తున్నంతసేపు ఏవేవో సినిమాలను మిక్స్ చేసి తీశారన్న భావన కలిగిందని కొందరు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. కథలో పట్టు లేకపోవడం, భావోద్వేగాలు కొరవడటం , రచనలో తివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×