EPAPER

Jaggayyapeta Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. జగ్గయ్యపేటలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది ?

Jaggayyapeta Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. జగ్గయ్యపేటలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది ?

Jaggayyapeta Assembly Constituency : ఆంధ్రా హాట్ పాలిటిక్స్ లో జగ్గయ్యపేటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ఓటర్లలో చాలా చైతన్యం ఉంటుంది. పరిస్థితుల ఆధారంగా ఇక్కడి జనం ఎన్నికల్లో తీర్పు ఇస్తుంటారు. ఈ సెగ్మెంట్ కు సిమెంట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరుంది. కృష్ణా జిల్లాలోని ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో ఇది ప్రధానమైంది. 10 సిమెంట్ తయారీ ఫ్యాక్టరీలు జగ్గయ్యపేట చుట్టూనే ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి తీర్పు ఇచ్చేందుకు జగ్గయ్యపేట జనం రెడీ అయ్యారు. అయితే విజయవాడ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. అటు జగ్గయ్యపేట వైసీపీ, టీడీపీలోనూ పొలిటికల్ సీన్ మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

సామినేని ఉదయభాను VS శ్రీరాం రాజగోపాల్


2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరు నడిచింది. ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుతోంది. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభాను 50 శాతం ఓట్లు సాధించి గెలిచారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం రాజగోపాల్ 47 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉదయభానుకు పనికి వచ్చింది. సొంత ఇమేజ్ తో జగ్గయ్యపేటలో విక్టరీ కొట్టారు సామినేని. అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్ అంతగా అభివృద్ధి చెందలేకపోయిందన్న టాక్ తో ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో జగ్గయ్యపేట సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

సామినేని ఉదయభాను (YCP) ప్లస్ పాయింట్స్

సెగ్మెంట్ లో సీనియర్ నేతగా గుర్తింపు
ఫ్రెండ్లీ నేచర్ కారణంగా జనంలో మంచి ఇమేజ్
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం
ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం
పార్టీ క్యాడర్ లో పాజిటివ్ ఇమేజ్

సామినేని ఉదయభాను మైనస్ పాయింట్స్

వర్షాకాలంలో మున్నేరు లింగాల బ్రిడ్జ్ ఓవర్ ఫ్లో అవుతుండడం సమస్య
టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించకపోవడం
జగ్గయ్యపేట, ఆటోనగర్ పరిధిలో కెమికల్ పొల్యూషన్
పెనుగంచిప్రోలులో సరైన రోడ్లు లేకపోవడం

వాసిరెడ్డి పద్మ (YCP) ప్లస్ పాయింట్స్

జగ్గయ్యపేటతో ఎక్కువ అనుబంధం, స్థానికుల్లో మంచి పేరు
కమ్మ, ఎస్సీ సామాజికవర్గాల ఓట్లపై ఆశలు
టిక్కెట్ వస్తే జగ్గయ్యపేటలో తొలి మహిళా అభ్యర్థిగా రికార్డు
జగ్గయ్యపేటలో పురుషుల కంటే స్త్రీల ఓట్లు ఎక్కువగా ఉండడం

వాసిరెడ్డి పద్మ మైనస్ పాయింట్స్

ఆర్థికంగా బలంగా ఉంటేనే ఈ సెగ్మెంట్ లో ప్రత్యర్థికి పోటీ ఇచ్చే పరిస్థితులు
సెగ్మెంట్ లో పార్టీ క్యాడర్, లీడర్ షిప్ కు దూరం
పోటీ చేస్తే సొంత పార్టీ క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ ఇస్తారన్న డౌట్లు
జగ్గయ్యపేటకు నాన్ లోకల్ కావడం

శ్రీరాం రాజగోపాల్ (TDP)ప్లస్ పాయింట్స్

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం
సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకోవడం
పేదల మెడికల్ బిల్లులు, కాలేజీ ఫీజుల చెల్లింపులు

శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మైనస్ పాయింట్స్

టిక్కెట్ కోసం నెట్టెం రఘురాం నుంచి పోటీ
శ్రీరాం హయాంలో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం

నెట్టం రఘురాం (TDP) ప్లస్ పాయింట్స్

జగ్గయ్యపేటలో కీలక నేతగా గుర్తింపు
కమ్మ సామాజికవర్గం నేత కావడం
టీడీపీ కీలక నేతల సపోర్ట్ ఉండడం

ఇక వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

సామినేని ఉదయభాను VS శ్రీరాం రాజగోపాల్

ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి ఉదయభాను, టీడీపీ నుంచి శ్రీరాం రాజగోపాల్ అలియాస్ శ్రీరాం తాతయ్య పోటీలో ఉంటే.. టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థికి 47 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 49 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి శ్రీరాం తాతయ్యకు కనిపిస్తోంది. అలాగే టీడీపీ టిక్కెట్ కోసం పోటీలో ఉన్న నెట్టం రఘురాం.. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకునే పరిస్థితి ఉండడంతో ఓట్లు చీలిపోకుండా శ్రీరాం తాతయ్యకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీవైపు పడేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. చంద్రబాబు అరెస్ట్ సింపథీ కూడా ఈ సెగ్మెంట్ లో బలంగా పని చేసేలా కనిపిస్తోంది.

ఇక వైసీపీ అభ్యర్థి తన క్లీన్ ఇమేజ్ తో పాటే.. చేసిన అభివృద్ధి, జగన్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఉదయభాను వైసీపీలో జగ్గయ్యపేటలో సీనియర్ లీడర్‌. ఇటీవల మంత్రి పదవి ఆశించారాయన. కానీ ఉదయభానుకు కాకుండా జూనియర్ అయిన జోగు రమేశ్‌కు ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు. ఉదయభానును మార్చొచ్చంటూ ప్రచారం కూడా వైసీపీలో జరిగింది. ఇంతవరకూ వైసీపీ నుంచి ప్రకటన అయితే రాలేదు. దీంతో ఫైనల్ గా ఆయననే దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ కూడా జగ్గయ్యపేటలో యాక్టివ్ గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సామినేని ఉదయభాను VS నెట్టం రఘురాం

ఇక మరో సినారియోలో వైసీపీ నుంచి ఉదయభాను, టీడీపీ నుంచి నెట్టం రఘురాం టిక్కెట్ దక్కించుకుని పోటీలో ఉంటే.. వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థికి 47 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థి నెట్టం రఘురాంకు 46 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి నెట్టం రఘురాం వెనుకబడడానికి కారణం.. శ్రీరాం రాజగోపాల్ టిక్కెట్ దక్కకపోతే సపోర్ట్ ఇవ్వడం కష్టమే అంటున్నారు. అదే సమయంలో శ్రీరాంకు నెట్టం రఘురాం టిక్కెట్ రాకపోయినా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగ్గయ్యపేట టీడీపీలో ఇదో కీలక అంశంగా కనిపిస్తోంది.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×