EPAPER

Jasprit Bumrah : రికార్డులు పట్టించుకుంటే.. ఒత్తిడి పెరుగుతుంది..

Jasprit Bumrah : రికార్డులు పట్టించుకుంటే.. ఒత్తిడి పెరుగుతుంది..
Jasprit bumrah stats

Jasprit bumrah stats (sports news today):


విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు టీమ్ ఇండియాకు మరోసారి ఆధిపత్యం లభించింది. 6 వికెట్లు తీసిన బుమ్రా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అలాగే 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. అత్యంత వేగంగా వికెట్లు తీసిన తొలి బౌలర్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో బుమ్రా మాట్లాడాడు.

ఇంగ్లాండ్ బ్యాటర్లపై వ్యూహాత్మకంగా ఎలా బౌలింగ్ చేశాడో, తన ప్లాన్ ఎలా వర్కవుట్ అయ్యింది వివరించాడు. ఎవరికైనా సరే  రివార్డ్స్ అందుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది.  నేను అందుకు అతీతుడినేమీ కాదు.  ఈ 6 వికెట్ల ప్రదర్శన కారణంగా మనసెంతో ఉత్సాహంగా ఉంది.


కాకపోతే ఈ రికార్డ్స్ ను తలకి ఎక్కించుకోకూడదని అన్నాడు. నిజానికి నేను, ఈ రికార్డ్స్ ని పట్టించుకోను. ఒకవేళ వాటికోసం ఆడితే, అనవసర  ఒత్తిడి ఉంటుంది. అప్పుడది మన ఆటపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. అందుకనే వాటికి దూరంగా ఉంటానని తెలిపాడు. రివార్డ్ వచ్చిందా? ఓకే.. అంతవరకే, మళ్లీ మరుసటి రోజు మామూలుగానే ఉంటాను. నా పనేదో నేను చేసుకువెళతాను. ప్రతి మ్యాచ్ లో వందకి, రెండు వందల శాతం కష్టపడతాను. అయితే అన్నివేళలా ఫలితం రాదని అన్నాడు.

కానీ ఈసారి ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో నేను ప్రత్యేకమైన వ్యూహాలతో వెళ్లాను. ముఖ్యంగా ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లు సంధించాను. వీటితో పాటు అతిముఖ్యమైన రివర్స్ స్వింగ్ లు, యార్కర్లు కూడా సంధించాను. అవి వర్కవుట్ అయి, వికెట్లను తీసుకువచ్చాయని అన్నాడు.

బ్యాటర్లు నానుంచి ఇన్ స్వింగ్ లు ఆశిస్తున్నారని గ్రహించాను. అందుకనే వారికి ఒకటి అదివేసి, మరొకటి రివర్స్ స్వింగ్ వేసేవాడినని అన్నాడు. తర్వాత యార్కర్లు సంధించానని అన్నాడు. ఇలా ఓవర్ ఓవర్ కి వినూత్నంగా ప్రయత్నించడం వల్ల వికెట్లు లభించాయని అన్నాడు.

భారత దేశంలో పిచ్ లపై రాణించాలంటే రివర్స్ స్వింగ్ రావాలని అన్నాడు. వాటితోనే బ్యాటర్లను బోల్తా కొట్టించానని తెలిపాడు. నా చిన్నతనం నుంచి ప్రపంచంలోని ప్రముఖ బౌలర్ల యాక్షన్, వారు బ్యాటర్లను అవుట్ చేసే తీరు, బాల్ డెలివరీ అయిన తర్వాత జరిగే మ్యాజిక్  వీటన్నింటిని చూస్తూ పెరిగాను.

రాత్రీ పగలు సాధన చేశానని తెలిపాడు. కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుందని నమ్మేవారిలో నేను మొదటి వరుసలో ఉంటానని తెలిపాడు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×