EPAPER

IND Vs ENG 2nd Test Live: బుమ్రా సిక్సర్.. ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇండియాకు భారీ లీడ్..

IND Vs ENG 2nd Test Live: బుమ్రా సిక్సర్.. ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇండియాకు భారీ లీడ్..

India Vs England 2nd Test Live Updates : రెండో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన టీమిండియా ఇటు బౌలింగ్ లోనూ సత్తాచాటింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత్ బౌలర్లు నిలువరించారు. ముఖ్యంగా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చెలరేగాడు.


ఇంగ్లాండ్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. జో రూట్ (5) వికెట్ తో ఖాతాను ప్రారంభిన బుమ్రా ఆతర్వాత తొలిటెస్టులో అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని దూరం చేసిన ఓలీ పోప్ (23) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. జానీ బెయిర్ స్టో (25), బెన్ స్టోక్స్ (47) , టాప్ హర్టీలీ (21), అండర్సన్ (6) ను పెవిలియన్ కు పంపాడు. వికెట్ల సిక్సర్ తో ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేశాడు.

మరోవైపు స్పిన్నర్ కులదీప్ యాదవ్ వలకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చిక్కారు. బెన్ డెక్కెట్ (21), కీపర్ బెన్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6) ను కులదీప్ అవుట్ చేశాడు.


ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రాలేని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 234 పరుగుల వద్ద 9 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు అండర్సన్, షోయబ్ బషీర్ నిలబడ్డారు. చివరి వికెట్ గా అండర్సన్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 143 పరుగుల భారీ లీడ్ లభించింది.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను భారత్ ప్రారంభించింది. 5 ఓవర్ల మాత్రమే సాగింది. రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. మొత్తం లీడ్ 171 పరుగులకు చేరింది.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×