EPAPER

L.K. Advani : ఆయన్ను అరెస్టు చేసిన గంటకే కేంద్ర ప్రభుత్వం పడిపోయింది ..!

L.K. Advani : ఆయన్ను అరెస్టు చేసిన గంటకే కేంద్ర ప్రభుత్వం పడిపోయింది ..!
L.K. Advani

L.K. Advani : అది 1990వ సంవత్సరం. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోన్న కాలమది. ఎట్టి పరిస్థితిలోనూ అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని కట్టి తీరాలని అద్వానీ నాయకత్వంలోని బీజేపీ తీర్మానించింది.


అయోధ్య ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతును కూడగట్టేందుకు సోమనాథ్ నుంచి అయోధ్యకు అద్వానీ రథయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 25న మొదలైన ఈ యాత్ర అదే నెల 30న అయోధ్యకు చేరుకోవలసి ఉంది. అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నారు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ మద్దతు మీద ఆధారపడి నాటి వీపీ సింగ్ ప్రభుత్వం నడుస్తోంది.

మరోవైపు.. అక్టోబరు 22న అద్వానీ రథయాత్ర సమస్తీపూర్‌కు చేరుకుంది. మరో వారంలో రథయాత్ర ఉత్తరప్రదేశ్‌‌లోని అయోధ్యకు చేరుకోనుంది. ఆ సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. అద్వానీ రథయాత్ర యూపీ బోర్డర్‌లోకి రాగానే అరెస్టు చేయాలని ఆయన భావించారు. కానీ.. అప్పటికి 7 నెలల క్రితమే బిహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన లాలూ ప్రసాద్ యాదవ్(42) అరచేతిలోకి వచ్చిన ఆ బంగారు అవకాశాన్ని తన మిత్రుడైన ములాయం సింగ్ యాదవ్ కోసం వదులుకోవటానికి ఇష్టపడలేదు.


దీంతో అక్టోబరు 22న ఉదయం 11 గంటలయ్యే సరికి పోలీసు ఉన్నతాధికారులందరినీ ఆయన పట్నాలోని అన్నే రోడ్‌లోని తన అధికార నివాసానికి రావాలని లాలూ పురమాయించారు. అరగంటలోనే తెల్లని అంబాసిడర్ కార్లు ఒకదాని వెనక ఒకటి రావటం, అధికారులంతా మీటింగ్ హాల్లోకి రావటం జరిగి పోయాయి.

అధికారులంతా రాగానే, సీఎంగారు వచ్చి కూర్చుంటూనే.. ‘మీరు అద్వానీని అరెస్టు చేయగలరా?’ అని నాటి డీఐజీ రామేశ్వర్ ఓరాన్‌ను అడిగారు. దానికి ఆయన ‘మాకు మేజిస్ట్రేట్ అనుమతి కూడా కావాలి’ అనటంతో వెంటనే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలందాయి. ఇక పనిలోకి దిగటానికి అధికారులంతా బయలు దేరి వెళ్లబోతుంటే.. సీఎం లాలూ యాదవ్ ‘ ఓరాన్ సాహెబ్, ఆయనను అరెస్టు చేస్తే జనం మిమ్మల్ని రాళ్లతో కొడతారు జాగ్రత్త’ అని చమత్కారంగా అడిగారు. ఆయన చిరునవ్వుతో ముందుకు సాగిపోయారు.

ఇక.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే.. అక్టోబరు 22న ధన్‌బాద్, రాంచీ, హజారీబాగ్, నవాడా మీదుగా రథయాత్ర పట్నా వచ్చారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన నాటి సభకు 3 లక్షలమంది జనం వచ్చారు. మీటింగ్ తర్వాత అద్వానీ సమస్తిపూర్ చేరుకున్నారు. అక్కడ కూడా 50 వేలమంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రోజు జనం తాకిడి కారణంగా రాత్రి 10 గంటలకు ముగియాల్సిన సభ ఆలస్యంగా ముగియటంతో ఆయన అక్టోబరు 23 తెల్లవారుజామున 2.30 గంటలకు అక్కడే ఒక భవనంలో బసచేశారు.

రోజంతా ప్రయాణం, అలుపులేని రీతిలో ప్రసంగించిన అద్వానీ.. వెంటనే నిద్ర పోయారు. ఆయనతో బాటు వచ్చిన సుమారు పాతికవేల మంది కార్యకర్తలూ ఆ సమీపంలోనే అక్కడక్కడా విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ.. తెల్లవారు జామున 5 గంటలయ్యే సరికి ఆయన బస చేసిన ప్రాంగణంలోకి ప్రవేశించిన పోలీసులు ఆయన గది తలుపు కొట్టారు.

‘మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం’ అని డీఐజీ రామేశ్వర్ ఓరాన్‌ తాను వచ్చిన పనిని చెప్పారు. దానికి అద్వానీ ‘సరే. ఓ పావుగంట టైం ఇవ్వండి’ అన్నారు. ‘మీ వెంట ఎవరైనా ఒక మనిషి రావచ్చు’ అని కూడా ఓరాన్ అనగా, ఆయన ప్రమోద్ మహాజన్ పేరుచెప్పారు. వెంటనే అద్వానీ అప్పటికప్పుడు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది’ అని ఆ లేఖ రాసి దానిని అధికారులకు అప్పగించి, వెంటనే పట్నా నుంచి ఢిల్లీ ఫాక్స్ చేయాలని కోరారు.

ఆ పనికాగానే ప్రమోద్ మహాజన్‌తో కలిసి కారెక్కిన అద్వానీని, పటేల్ మైదాన్‌కు తీసుకుపోయిన పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో మసంజోర్ గెస్ట్‌హౌస్‌కు తీసుకుపోయారు. మరోవైపు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే.. తెల్లవారే సరికి కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2 డిసెంబర్ 1989న ప్రధానిగా ప్రమాణం చేసిన వీపీ సింగ్.. రాజీనామా చేయటంతో దేశం మరోమారు లోక్‌సభ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దటీజ్ అద్వానీ..

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×