EPAPER

Gold ATM : గోల్డ్‌ ఏటీఎం.. మన హైదరాబాద్‌లోనే !

Gold ATM : గోల్డ్‌ ఏటీఎం.. మన హైదరాబాద్‌లోనే !

Gold ATM : కార్డు పెడితే నీళ్లొచ్చే వాటర్‌ ఏటీఎం తెలుసు.. డబ్బులొచ్చే ఏటీఎం గురించీ తెలుసు.. కానీ.. ఈ గోల్డ్‌ ఏటీఎం ఏంటి? అనుకుంటున్నారా? గతంలో విదేశాల్లో మొదలైన ఈ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు మనదేశంలోనూ అడుగుపెట్టింది. అంతేకాదు.. ఈ క్లిష్టమైన యంత్రం, దాని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది కూడా తెలుగు యువకుడే. అతడే ‘ఓపెన్‌ క్యూబ్స్‌’ వ్యవస్థాపకుడు పి.వినోద్‌.


వినోద్ ప్రస్థానం ఇదీ..
వినోద్ జన్మస్థలం ఏపీలోని అనకాపల్లి. వీరి కుటుంబం కొన్నాళ్లు వ్యాపారం కోసం బెంగళూరులో ఉంది. స్కూలు విద్యార్థిగా వేసవి సెలవుల్లో సరదాగా వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో చేరి.. పదోతరగతి నాటికి దానిపై పట్టు సాధించాడు. నాటినుంచి సొంతఖర్చుల కోసం వెబ్‌సైట్‌లు డిజైన్ చేయటం మొదలుపెట్టాడు. ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి సొంత ప్రాజెక్టులతో పాటు స్నేహితులకు సలహాలు ఇస్తూ, అధ్యాపకులకు అకడమిక్‌ ప్రాజెక్టులు చేసేవాడు. ఎంబీఏ తర్వాత కొన్నాళ్లు ఒక టెలికాం కంపెనీలో భాగస్వామిగా చేరి, ఆపై విశాఖలో బీమా కంపెనీలో మూడున్నరేళ్లు పనిచేసి మార్కెటింగ్‌, సేల్స్‌‌పై పట్టు సాధించాడు.

రెండో అడుగు
2017లో హైదరాబాద్‌ చేరి ఉద్యోగం చేస్తూనే స్టార్టప్‌ల మీద దృష్టి పెట్టాడు. ముందుగా వినికిడి శక్తి లేనివారికి తేలిగ్గా సమాచారం అందించే ఒక కమ్యూనికేషన్‌ పరికరాన్ని రూపొందించి, పేటెంట్ పట్టేశాడు. ఈ క్రమంలో ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో ‘ఓపెన్‌ క్యూబ్స్‌’ అనే స్టార్టప్ పెట్టాడు. కొత్తలో పెద్దగా ప్రాజెక్టులేవీ రాలేదు. ఆ టైంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, టెలిగ్రామ్‌లాంటి ‘ఎన్‌హెచ్‌ 7’ అనే యాప్‌ను రూపొందించాడు. ఫీచర్లు బాగుండటం, వాడటం తేలిక కావడంతో.. 2 నెలల్లోనే 18 లక్షల మంది యూజర్లు రావటం, అతి కష్టం మీద రూ.2 కోట్ల నిధుల సేకరణ చేపట్టాడు. యాప్‌ సక్సెస్ తర్వాత వినోద్ సింగపూర్‌లోనూ కార్యాలయం తెరిచాడు.


కరోనా కష్టకాలం
అంతా బాగుందనుకుంటుండగానే కరోనా వచ్చిపడటం, ఆఫీసు పని ఆగిపోయింది. ఆఫీసులు, యాప్‌ల నిర్వహణకే రూ.20లక్షలు ఖర్చు రావటంతో తప్పని పరిస్థితుల్లో.. ఆ యాప్‌ని ఒక అమెరికా కంపెనీకి లాభానికి అమ్మేశాడు. తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ కోసం చేసిన ‘ఆజాదీ’ యాప్‌ సక్సెస్ కావటంతో ‘గోల్డ్‌ సిక్కా’ సంస్థ ‘మాకు ఓ గోల్డ్ ఏటీఎమ్’ చేయమంటూ పిలిచింది. సిబ్బందితో కలిసి సొంత సాఫ్ట్‌వేర్ రూపొందించి, 3 నెలల్లో వారు కోరిన గోల్డ్‌ ఏటీఎం తయారు చేశాడు. ఇందులో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని డ్రా చేసుకోవచ్చు. విదేశాల్లోని గోల్డ్ ఏటీఎంల తయారీ కంటే 30% తక్కువ ఖర్చుతో దీనిని రూపొందించటం విశేషం.

దేశంలోనే తొలిసారిగా వచ్చిన ఈ ఏటీఎం హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ఉంది. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ ధరల ప్రకారం ఇక్కడా 4 సెకన్లకోసారి బంగారం ధర మారుతుంది. ప్రస్తుతం వినోద్ ఔషధాల ఏటీఎం తయారీలో బిజీగా ఉన్నాడు. అలాగే గతంలో పైరసీని అరికట్టే జామర్‌ని తయారు చేశాడు. దీన్ని సినిమా థియేటర్‌లో అమర్చితే పైరసీ చేయటం అసాధ్యం. అలాగే పైరసీ చేసినా అది ఎక్కడ, ఎప్పుడు చేశారనేది వాటర్ మార్క్ ద్వారా తెలిసిపోతుంది.

Tags

Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×