EPAPER

Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం

Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం

cm revanth reddy indravelli sabha


Indravelli Sabha(Political news in telangana): సీఎం రేవంత్‌రెడ్డి పొలిటికల్‌ సెంటిమెంట్‌ ప్లేస్‌ అయిన ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పగ్గాలు చేతపట్టాక మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ నిర్వహించారు. ఆ సభ విజయవంతం కావడం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్‌ టూర్‌ రేవంత్‌కు కలిసొచ్చింది. అందుకే ఇదే సెంటిమెంట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వెళ్లునున్నారు రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలలో రెండింటిని ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఇంద్రవెల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుని కొమురం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ పునర్ నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచే పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించడంతోపాటు.. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీ పథకాలను ప్రారంభిస్తారు. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, గృహజ్యోతి పథకం పేరుతో 200ల యూనిట్ల ఉచిత్‌ విద్యుత్‌ అందిస్తామని ఎలక్షన్‌ టైమ్ లో చెప్పిన మాటను నిలబెట్టుకోనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. నాగోబా ఆలయం, సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రేవంత్‌ టూర్‌ను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్‌ శ్రేణులు జనసమీకరణపై ఫోకస్‌ పెట్టారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×