EPAPER

Malla Reddy Shocking Comments : కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించలే.. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా..

Malla Reddy Shocking Comments : కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించలే.. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా..
Malla Reddy latest news

Malla Reddy Shocking Comments(Telangana politics):


మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదని తెలిపారు.

అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి? అని మల్లారెడ్డి అన్నారు. గతంలో రేవంత్ తాను టీడీపీలో ఉన్నా విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో సీఎంను కలుస్తానని చెప్పారు. చర్చకు తావు లేకుండా కలిసే ముందు సమాచారం ఇస్తానన్నారు.


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై మల్లారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. మల్కాజ్ గిరిఎంపీగా తను పోటీ చేయమని బీఆర్ఎస్ అధిష్టానం కోరుతోందని వెల్లడించారు. కానీ మల్కాజ్ గిరిఎంపీ టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని కోరానన్నారు.

2014 ఎన్నికల్లో మల్లారెడ్డి మల్కాజ్ గిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒక్కప్పుడు ఇద్దరూ నేతలు టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. 2018 లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లోనూ మల్లారెడ్డి మేడ్చల్ నుంచి మరోసారి విజయం సాధించారు.

రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో కి వెళ్లారు. హస్తం పార్టీ తరఫున 2019 ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచే ఎంపీగా గెలిచారు. ఇలా మల్లారెడ్డికి, రేవంత్ రెడ్డికి కొన్ని రాజకీయ అడుగులు ఒకే విధంగా సాగాయి. మల్లారెడ్డి బీఆర్ఎస్ వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డిపై అనేకసార్లు ఘూటు విమర్శలు చేశారు. సవాళ్లు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మల్లారెడ్డి మరింత ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డి స్వరం మారింది. నేరుగా రేవంత్ రెడ్డినే కలిసేందుకు ఆసక్తిచూపించడంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎంను రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎంతో భేటీకావడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు మల్లారెడ్డి అదేబాటలో ఉన్నారు. ఇలా ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు ఆసక్తి చూపించడం హాట్ టాపిక్ గా మారింది.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×