EPAPER

KCR Oath : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు..

KCR Oath : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు..
Latest Political news in Telangana

KCR Oath updates(Latest political news telangana):


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తన ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ చేత ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కేసీఆర్‌ అసెంబ్లీ వద్దకు రాగానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,నేతలు స్వాగతం చెప్పారు. అసెంబ్లీకి గులాబీ రాక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకి భారీగా తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష కార్యాలయంలోనూ కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు.


అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. గజ్వేల్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. బాత్ రూమ్ లో జారిపడటంతో గాయపడ్డారు. ఆయన తుంటి ఎముకకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ కారణం వల్లే కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. వైద్యుల సూచనతో కేసీఆర్‌ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడటంతో అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే శాసనసభ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

మరోవైపు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు హాజరు కాలేదు. అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×