EPAPER

Dwarkamai Temple : విశేష పుణ్యదాయకం.. ద్వారకామాయి దర్శనం

Dwarkamai Temple : విశేష పుణ్యదాయకం.. ద్వారకామాయి దర్శనం
Dwarkamai Temple

Dwarkamai Temple : మహిమలతో కాదు.. మానవత్వంతో బతకాలన్న తత్వాన్ని తన భక్తులకు బోధించిన పరమ గురువు షిరిడీ సాయినాథుడు. ఆర్తిగా పిలిచిన తన భక్తుల మొరలను ఆలకించే దైవంగా పేరున్న సాయిబాబా మహారాష్ట్రలోని షిర్డీ గ్రామంలో కొలువై తన భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజూ వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి బాబా దర్శనానికి వస్తుంటారు. ఎన్నో విశేషాలున్న బాబా మందిరాన్ని, షిర్డీలోని బాబా జీవితంతో ముడిబడి ఉన్న అనేక ఇతర ప్రదేశాలనూ భక్తులు ఆర్తితో దర్శించుకుంటారు. ఆ ప్రదేశాలలో ముఖ్యమైనది ద్వారకామాయి మసీదు.


షిర్డీలో బాబా ద్వారకామాయి అనే మసీదులో ఉండేవారు. బాబా తొలినాళ్లలో షిరిడీ వచ్చే సమయానికి ఈ మసీదు శిథిలావస్థలో ఉండేది. గోడలు బీటలు వారి, ఇటుకలు, ఇసుక రాలుతుండేవి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బాబా ఇక్కడ ఒక ధునిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఒక రాయి మీద కూర్చొని బాబా స్నానం చేసేవారు.

ద్వారకామాయిలోకి అడుగుపెడుతూనే ఒక పెద్ద బాబా చిత్రపటం మనకు కనిపిస్తుంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా బొమ్మవేసి, ఆయన దానిని తాకిన తర్వాత తన ఇంటికి తీసుకుపోవాలని జయకర్ భావించి బాబా వద్దకు తీసుకుపోయాడట. కానీ ‘నేను వెళ్లిపోయాక ఇక్కడికి వచ్చే భక్తుల మంచీ చెడూ నీ చిత్ర పటంలో ఉండే నేను వింటాను. కాబట్టి దానిని ఇక్కడే ఉండనీ’ అన్నారట బాబా. నాటి నుంచి ఆ చిత్రం అక్కడే ఉంది.


ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేవి. వంటచేసే సమయంలోనూ బాబా అలాగే ఈ మసీదు గుంజకు ఆనుకుని కూర్చునేవారు. అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చి.. ‘ఇక ఇంటికి వెళుతున్నాం బాబా’ అని చెప్పి బాబా అనుమతి తీసుకుని షిరిడీ నుంచి బయలుదేరతారు.

ఈ ద్వారకామాయిలో ఒక గోధుమలు నింపిన బస్తా ఒకటి నేటికీ కనిపిస్తుంది. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు ఏటా తాను పండించిన కొన్ని గోధుమలను బాబాకు ఇచ్చి, మిగిలిన పంటతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. బాలాజీ కుమారుడు కూడా ఈ పద్ధతినే పాటించారట. దానికి గుర్తుగా నేటికీ ఓ గోధుమల బస్తాను అక్కడ ఉంచారు.

షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి నేటి సమాధి మందిరంలో ఉండగా, రెండవ తిరగలి.. ద్వారకామాయిలో కనిపిస్తుంది. దీనితోనే బాబా గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్నచోటనే బాబా నీటితో దీపాలను వెలిగించారు. ఈ మసీదులోనే ఒక కుండ కనిపిస్తుంది. ఆ కుండలో నీటినే బాబా వందల మందికి తాగటానికి ఇచ్చేవారట. ఎందరు నీరు తాగుతున్నా ఆ కుండలో నీరు అయిపోయేది కాదట. నేటికీ భక్తులు ఆ కుండలోని నీరు తాగుతారు.

ద్వారకామాయికి దక్షిణం వైపు రెండు పాదాలు కనిపిస్తాయి. రోజూ హారతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చుని, ధుని నుంచి విభూతి తీసి భక్తుల నుదుట పెట్టి ‘ మీకు అంతా మేలే జరుగుతుందిలే’ అనేవారు. 1886లో 3 రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలంగానూ ద్వారాకామాయి నిలుస్తోంది. నాటి ఘటనకు గుర్తుగా అక్కడ ఒక తాబేలు బొమ్మను ప్రతిష్టించారు.

రోజూ హారతి సమయంలో బాబా అమితంగా ప్రేమించే ‘శ్యాంసుందర్’ అనే గుర్రాన్ని శిష్యులు చక్కగా అలంకరించి ద్వారకామాయి ఎదురుగా నిలబెట్టేవారు. నేడు ద్వారకామాయిలో నిరంతరం వెలిగే ధునిని తన గురువుకు గుర్తుగా బాబా వెలిగించారు. దీనిలోని భస్మాన్ని ధరిస్తే అనారోగ్యాలు పోతాయి. బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఎక్కడి నుంచో వచ్చిన ఒక పులి ఇక్కడ సద్గతి పొందింది. 1969 దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్టించారు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు.

బాబా జీవితంలోని ఎన్నో కీలక ఘట్టాలకు ప్రధాన కేంద్రమైన ఈ పవిత్ర ద్వారకామాయిని మీరు షిరిడీ వెళ్లినప్పుడు తప్పక దర్శించండి. బాబా అనుగ్రహాన్ని పొందండి.

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×