EPAPER

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడాలి.. కార్యకర్తలకు సీఎం రేవంత్ పిలుపు..

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు.

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడాలి.. కార్యకర్తలకు సీఎం రేవంత్ పిలుపు..

CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు. 60రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ గాంధీ భవన్‌లో సమావేశమైంది.


మోదీ ప్రభుత్వం పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ వంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారన్నారు. ఇంత వరకు చిల్లి గవ్వ కూడా వేయలేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతులు పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయన్నారు. మోదీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని దయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022లోపు పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయాలని విమర్శించారు.


రాష్ట్రంలో కేసీఆర్‌ మాదిరిగానే కేంద్రంలో మోదీ భారీగా అప్పులు చేశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు.ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, సభ్యులు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×