EPAPER

Chandigarh Mayor Polls | చంఢీగడ్ మేయర్ ఎన్నికలు.. ‘అంతా మోసం.. ఇది దేశద్రోహం’!

Chandigarh Mayor Polls | చంఢీగడ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికలలో బిజేపీ విజయం సాధించినట్లు మంగళవారం ఎన్నికల అధికారి ప్రకటించారు.

Chandigarh Mayor Polls | చంఢీగడ్ మేయర్ ఎన్నికలు.. ‘అంతా మోసం.. ఇది దేశద్రోహం’!

Chandigarh Mayor Polls | చంఢీగడ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికలలో బిజేపీ విజయం సాధించినట్లు మంగళవారం ఎన్నికల అధికారి ప్రకటించారు.


అయితే ఎన్నికల అధికారి పట్ట పగలు అందరూ చూస్తుండగా.. మోసపూరితంగా వ్యవహరించారని అరవింద్ కేజ్రేవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. చంఢీగడ్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. వీటిలో 16 ఓట్లు బిజేపీ సొంతం చేసుకోగా.. మిగతా 20 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌ దక్కించుకున్నారు.

కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన 8 ఓట్లను చెల్లబాటు కాదని ఎన్నికల అధికారి నిర్ణయిస్తూ.. 16 ఓట్లు దక్కించుకున్న బిజేపీ అభ్యర్థి మనోజ్‌ సోన్కర్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీనిపై ఆప్ అధ్యక్షుడు స్పందిస్తూ.. బిజేపీ అవినీతికి ఇది సాక్ష్యమని.. కేవలం ఒక నగర మేయర్ ఎన్నికల కోసం బిజేపీ నాయకులు ఇంత దిగజారితే ఇక దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికలకు ఎంత దిగజారుతారో ఆలోచించుకోవాలో అని అన్నారు. బిజేపీ దేశాన్ని మరో ఉత్తర కొరియాలాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


ఎన్నికల అధికారి బిజేపీ మైనారిటీ సెల్ సభ్యుడని.. అందుకే పక్షపాతంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఆప్ నాయకులలో రాఘవ్ చడ్డా మాట్లాడుతూ.. చండీగఢ్ ఫలితాల్లో పట్టపగలు మోసం జరిగిందని.. ఇదొక దేశ ద్రోహ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 8 ఓట్లు ఎందుకు చెల్లబాటు కాదో ఎన్నికల ఏజెంట్ కానీ.. డెప్యూటీ కమిషనర్ కానీ తమకు ఆధారాలు చూపలేదని.. ఇది కళ్ల ముందు జరిగిన అన్యాయమని ఆయన అన్నారు.

చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిగా పోటీ చేశాయి. మేయర్ సీటుపై ఆప్ పోటీచేస్తే.. డిప్యూటీ మేయర్ సీటుకి కాంగ్రెస్ పోటీ చేసింది. రెండు పార్టీలకు కలిపి 20 ఓట్లు ఉండడంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బిజేపీ గెలుపొందిందని ఎన్నికల అధికారి మసీహ్ ప్రకటించారు.

Chandigarh Mayor Polls, Arvind Kejriwal, foul play, BJP, Raghav Chaddha,

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×