EPAPER

AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. ఆ క్రమంలో ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. స్టార్టింగ్‌లో ఆ పార్టీలో కొంత హడావుడి కనిపించినప్పటికీ.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీలో చేరిన అరకొర నేతలే పక్క చూపులు చూసున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో అసలు అక్కడ బీఆర్ఎస్ ఉందా? లేదా? అన్నట్లు తయారైంది పరిస్థితి.

AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. ఆ క్రమంలో ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. స్టార్టింగ్‌లో ఆ పార్టీలో కొంత హడావుడి కనిపించినప్పటికీ.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీలో చేరిన అరకొర నేతలే పక్క చూపులు చూసున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో అసలు అక్కడ బీఆర్ఎస్ ఉందా? లేదా? అన్నట్లు తయారైంది పరిస్థితి.


జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో గులాబీపార్టీ పేరుని బీఆర్ఎస్‌గా మార్చి .. అప్పట్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. అందులో భాగంగా ఏపీకి బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. గుంటూరు వాసి అయిన చంద్రశేఖర్ తన 21 ఏళ్ల ఐఏఎస్ కెరీర్‌ను వదులుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీచేసిన తోట చంద్రశేఖర్ ఓడిపోయాడు. తర్వాత 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా గెలుపుగుర్రం ఎక్కలేకపోయారు. దాంతో గత ఎన్నికల నాటికి జనసేన కండువా కప్పుకుని.. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినా లక్ దక్కలేదు.. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు ఏపీలో జనాదరణ దక్కకపోవడంతో.. మళ్లీ దిక్కులు చూస్తున్న చంద్రశేఖర్‌కు బీఆర్ఎస్ ఆశాకిరణంలా కనిపించడంతో గులాబీ కండువా కప్పేసుకున్నారు.


బీఆర్ఎస్‌లో తోట చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. తనతో పాటు ఇంకొందరు నేతల చేరిక కోసం హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్‌లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు.

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన తోట.. తనను అధ్యక్షుడిగా ప్రకటించగానే.. గత ఏడాది మేలో గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో కారు పార్టీ షెడ్డుకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో .. గులాబీ నేతల జాతీయ అజెండాకి బ్రేకులు పడ్డట్లు కనిపిస్తున్నాయి. వలసల ఎఫెక్ట్‌తో సొంత రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ ముఖ్యులు.

ఇంట గెలవలేని పార్టీ రచ్చకెక్కి మాత్రం ఏం చేయగలుగుతుందిలే.. అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్న ఏపీ బీఆర్ఎస్‌లో ఉన్న ఒకటి అరా నేతలు.. పక్క చూపులు చూస్తున్నారంట.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బీఆర్ఎస్ ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి కనిపించపోతుండటంతో.. రాష్ట్రంలో ఆ పార్టీకి నేతలే కాదు కనీసం జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా కనిపించకుండా పోతున్నారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యాపారాలు హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నాయి. బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో.. తన ఆస్తులకు ఢోకా లేకుండా చేసుకోవడానికే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో.. ఆయన కారు దిగడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆయన జనసేనతో టచ్‌లోకి వెళ్లారంట.. టీడీపీ, జనసేనల పొత్తు ఖాయమవ్వడంతో ఈ సారి ఎక్కడైనా సీటు దక్కించుకుని గెలవాలని ఆశపడుతున్నారంట.

ఇక తోట చంద్రశేఖర్‌తో పాటు ఏపీ నుంచి బీఆర్ఎస్‌లో జాయిన్ అయిన మరో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు .. ఆయన హైదరాబాద్ వెళ్లి గులాబీకండువా కప్పుకున్న తర్వాత ఒకటిరెండు రోజులు కాస్తంత హడావుడి చేశారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడటం కాదుకదా.. అసలు కనిపించడమే మానేశారు.. పరిస్థితి లేదు.. ప్రస్తుతం ఆయన కూడా వైసీపీ తలుపులు తడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.. ఇక ఏపీ బీఆర్‌ఎస్‌లో వారిద్దరు తప్ప చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు.. వాళ్లు కూడా తమ దారి తాము చూసుకుంటే.. నడిపే వారు లేక గులాబీ కారు షెడ్డుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×