EPAPER

Minister Roja : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదనుకున్న వైసీపీ.. కొత్త అభ్యర్ధి ఎంపికకు పెద్ద కసరత్తే చేస్తోంది. వైసీపీ పెద్దలు సమర్ధుడైన అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి వరకు ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో చాలా మంది పేర్లే ఫోకస్ అవుతున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒంగోలు సీన్‌లోకి వచ్చేశారు. ఈ మంత్రి గారికి నగరిలో పరిస్థితులు అనుకూలంగా లేవని.. అందుకే ఒంగోలు షిష్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు.

Minister Roja  : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదనుకున్న వైసీపీ.. కొత్త అభ్యర్ధి ఎంపికకు పెద్ద కసరత్తే చేస్తోంది. వైసీపీ పెద్దలు సమర్ధుడైన అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి వరకు ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో చాలా మంది పేర్లే ఫోకస్ అవుతున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒంగోలు సీన్‌లోకి వచ్చేశారు. ఈ మంత్రి గారికి నగరిలో పరిస్థితులు అనుకూలంగా లేవని.. అందుకే ఒంగోలు షిష్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు.


ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పడంతో తెరమీదకు అనేక పేర్లు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా నగిరి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజాను ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నేతల ముందు.. ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రతిపాదన పెట్టారంటున్నారు.

మొదట్లో మాగుంట ప్లేస్‌లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరు గట్టిగా వినిపించింది. ఒంగోలు ఎంపీ స్థానానికి వైసీపీ పెద్దలు చెవిరెడ్డి ప్రతిపాదించారంట. ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి చెవిరెడ్డి సిద్దమై.. స్వయంగా వెళ్లి బాలినేనితో మంతనాలు సాగించినా ప్రయోజనం లేకుండా పోయిందంట. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా జిల్లా నేతలంతా చెవిరెడ్డి పేరును వ్యతిరేకించడంతో ఒంగోలు విషయంలో ఆయన పేరు ఫేడౌట్ అయిపోయింది.


వైసీపీ ఒక ఫ్యామిలీ ఒక టికెట్ ఫార్ములా ఫాలో అవుతోందన్న ప్రచారం ఉంది.. దానిపై విజయసాయిరెడ్డి, సజ్జలతో బాలినేని మాట్లాడారంట.. మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలకు ఆ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు .. తనకు కూడా ఇవ్వాలని.. తనకు ఒంగోలు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు.. తన కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారంటున్నారు. తనకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉందంటున్న బాలినేని .. తన కొడుక్కి టికెట్ ఇస్తే ఏడు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు తీసుకుంటానని ఇప్పటికే సీఎం జగన్‌కు కూడా చెప్పినట్లు తెలుస్తోంది .. అయితే వైసీపీ అధ్యక్షుడు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేదంట .

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి బాలినేని, జిల్లా మంత్రి సురేష్‌లతో పాటు ఇతర నేతల ముందు నగిరి ఎమ్మెల్యే రోజా పేరు ప్రతిపాదించారంట.. అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఆమె విషయంలో సుముఖత వ్యక్తం చేయలేదంటున్నారు .. జిల్లాలో ఇప్పటికే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావులకు ఎక్కడా టికెట్ కేటాయించలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి కొత్త నేతల్ని తెచ్చుకుంటే..లోకల్ నేతలతో కొత్త తలనొప్పులు ఎదురవుతాయని బాలినేని అంటున్నారంట.

పార్టీ కోసం పనిచేసిన జిల్లాలో నాయకులు ఉన్నారని.. లోకల్ నేతలు ఎన్నికల బరిలో ఉంటే ఆ ప్రభావం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గలపై పనిచేస్తుందని బాలినేనితో పాటు , మంత్రి సురేష్ మిగతా నేతలు విజయసాయిరెడ్డికి చెప్పారంట.. మంత్రి రోజా వల్ల ఒంగోలు పార్లమెంటుకు కొత్తగా వచ్చేది ఒరిగేది ఏమి ఉండదని స్ఫష్టం చేశారంట. అయితే ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరిలో ఉన్న తనకు అంత దూరంలో ఉన్న ఒంగోలు పోవాల్సిన అవసరం లేదంటున్నారు.

స్థానిక నేతలు అయితే జిల్లా ప్రజలతో అనుబంధం ఉంటుందని గెలుపుకు ఈజీ అవుతుందని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.. వైసీపీ పెద్దలు మాత్రం ఒంగోలు ఎంపీ అభ్యర్ధి విషయంలో రోజుకో పేరు తెరమీదకు తెస్తుండటంతో.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. మొత్తమ్మీద మాగుంటను కాదనుకున్న ఎఫెక్ట్ వైసీపీలో గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×