EPAPER

Vemireddy : నెల్లూరు పాలిటిక్స్.. వేమిరెడ్డి హవా నడుస్తోందా..?

Vemireddy : నెల్లూరు జిల్లా రాజకీయాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా.. సీఎం జగన్ తొలి మంత్రి వర్గంలో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌యాదవ్‌ను నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పంపడం దాదాపు ఖాయమైందంటున్నారు .. మరి జగన్ ఆయన్ని అక్కడకు పంపుతారో లేదో కాని. ఇప్పటికే నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీకి సిద్దమైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును కూడా రిజర్వ్ చేసుకున్నారంట.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ను వ్యతిరేకిస్తున్న వేమిరెడ్డి.. ఆ స్థానం నుంచి తన భార్య ప్రశాంతిరెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నారంట.. కుటుంబంలో ఒకరికే సీటు అంటున్న వైసీపీ వేమిరెడ్డి విషయంలో సడలింపు ఇచ్చిందన్న ప్రచారం కూడా మొదలైంది.

నెల్లూరు జిల్లా వైసీపీలో.. ముఖ్యంగా నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హవానే నడుస్తోందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోది.. అటు వైసీపీలోను, తెలుగుదేశంలోను వేమిరెడ్డి గురించే జరుగుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పొలిటికల్ సర్కిల్స్‌లో వేమిరెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతున్నారు.. రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్దమయ్యారు.. అయితే ఆయన ఆ లోక్‌సభ సీటు పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్ధులను మార్చాలని పట్టుబట్టారు.

మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ యాదవ్‌ను తప్పించాలని ఆయన పార్టీ పెద్దలపై తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చారంట. 2019 లో అనిల్ గెలుపుకి అన్ని విధాలా స‌హ‌క‌రించిన వేమిరెడ్డికి అనిల్ కి మ‌ధ్య ఇప్పుడు గ్యాప్ పెరిగింది.. వివిధ కార‌ణాల‌తో వేమిరెడ్డితో అనిల్ విభేదించారు. అదీకాక అనిల్‌కి వైసీపీ జిల్లా ముఖ్య నేత‌లైన మంత్రి కాకాణి వంటి వారితో పొసగడం లేదు. అనీల్ వైఖరి కారణంగానే అందరితో విభేదాలు తలెత్తాయని.. అది పార్టీని ఇబ్బంది పెడుతుందంటున్న వేమిరెడ్డి.. ఆయన్ని సిటీ నుంచి పంపించడానికి చక్రం తిప్పారంట.

వీపీఆర్ మైనింగ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన వేమిరెడ్డి మాటను కాదనలేని వైసీపీ పెద్దలు.. అనీల్ విషయంలో డెసిషన్ తీసుకుని.. ఆయనకు కూడా చెప్పారంటున్నారు.. అనిల్ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా వెళ్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. గూడూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో పాల్గొన్నారు.. అక్కడ అనిల్ మాట్లాడుతూ.. రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పని చేశాను.. మూడోసారి ఎంపీగా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని ఆఫ్ ద రికార్డుగా చెప్పారంట .. దాంతో అనిల్ షిఫ్టింగ్‌పై క్లారిటీ వచ్చినట్లైంది.

మరోవైపు నెల్లూరు సిటీ టికెట్ కోసం పావులు కదపడం మెదలుపెట్టారంట వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. తన భార్య ప్రశాంతి రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారంటాయన.. ఇప్పటికే ఆ విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారంట.. వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చి.. ఒప్పించిన వైసీపీ పెద్దలు.. ఇప్పుడాయన భార్యకు టికెట్ విషయంలో కాదనలేని స్థితిలో ఉన్నారంట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికిపదవులు ఇచ్చేది లేదని గతంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి.. అయితే ఆ రూల్‌కి వేమిరెడ్డి విషయంలో రిలాక్సేషన్ ఇవ్వడం ఖాయమంటున్నారు.

నెల్లూరు జిల్లాలో పార్టీకి ఆర్థికంగా అన్ని విధాలా అండగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగారు కాబట్టి .. ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు .. అదే జరిగితే ఇంటా బయటా విమర్శలు తప్పవన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేటకు మార్చడం దాదాపుగా ఖాయం అవడంతో.. గతంలో సిటీ నుంచి అనిల్ ని తప్పించాలని డిమాండ్ చేసిన వేమిరెడ్డి మాట నెగ్గించుకున్నట్లైంది..మొత్తానికి వైసీపీలో వేమిరెడ్డి సత్తా ఏంటో ఈ వ్యవహారంతో స్పష్టమైందని జిల్లా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×