EPAPER

Shubman Gill : గిల్.. కింకర్తవ్యం?

Shubman Gill : గిల్.. కింకర్తవ్యం?
Shubman Gill

Shubman Gill : ప్రస్తుతం అందరినోటా ఇదే మాట. శుభ్ మన్ గిల్ కి రెండో టెస్ట్ లో స్థానం ఉంటుందా? లేదా? ఇదే అంశంపై నెట్టింట తీవ్ర స్థాయిలో చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. గిల్ ప్రస్తుతం తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడ్డాడు. దాని నుంచి బయటపడాలంటే బ్యాట్ తోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని సీనియర్లు అంటున్నారు.


కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు ఇద్దరికి శుభ్ మన్ గిల్ పై అపారమైన నమ్మకం ఉంది. అందుకే పదే పదే అవకాశాలిస్తున్నారని సీనియర్లు అంటున్నారు. దానిని తను సద్వినియోగం చేసుకోవడం లేదని అంటున్నారు. తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా వైఫల్యానికి ఇద్దరు ప్రధాన బ్యాటర్లు గిల్, శ్రేయాస్ అయ్యర్ ప్రధాన కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు.

సెంచరీలు అక్కర్లేదు, కనీసం వీళ్లిద్దరు కలిసి, ఒక 60 పరుగులు చేసినా, ద్రావిడ్ చెప్పినట్టు మ్యాచ్ మన చేతుల్లోనే ఉండేదని అంటున్నారు. రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడలేదని అంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ అయితే రెండు ఇన్నింగ్స్ లో 35, 13 చేశాడు. అదే గిల్ అయితే తొలి ఇన్నింగ్స్ లో 23 చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. వీరిద్దరే జట్టు ఓటమికి ప్రధాన కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు.


టీమ్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన గిల్ ఫస్ట్ డౌన్ లో వచ్చి 5 టెస్ట్ ఇన్నింగ్స్  ఆడి, ఒక్క ఆఫ్ సెంచరీ కూడా చేయలేదు. మొత్తం టెస్ట్ కెరీర్ చూస్తే 38 టెస్ట్ ఇన్నింగ్స్ లలో 30 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఇక గత 10 టెస్ట్ ఇన్నింగ్స్ లలో గిల్ 19.22 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు.

ఇకపోతే శ్రేయాస్ అయ్యర్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడు కాబట్టి, తన స్థానానికి ఢోకా ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగే అనధికార టెస్ట్ మ్యాచ్ లో రజత్ పాటేదార్ సెంచరీ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అందుకని గిల్ ప్లేస్ లో  రెండో టెస్ట్ కి ఎంపిక చేస్తారని కొందరు అంటున్నారు. కొహ్లీ వచ్చేవరకు గిల్ కి మరొక అవకాశం ఇస్తారని, అది ద్రవిడ్, రోహిత్ చేతుల్లో ఉందని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×