EPAPER

Koreans Hate Indians | ‘డర్టీ ఇండియన్స్’.. గుణం కాదు అందమే ముఖ్యమంటున్న కొరియన్స్!

Koreans Hate Indians | కొరియాలో ఇండియన్స్ వెళితే.. కొరియన్స్ హీనంగా చూస్తారు. ఇండియన్స్ అంటే చెత్త అని అంటారు. ఇండియన్స్ ఎక్కడికైనా షాపింగ్ కోసం వెళ్తే వాళ్లపై అందరూ అదో రకంగా చూస్తుంటారు. అంతెందుకు కొన్ని హోటల్స్.. క్లబ్స్.. పబ్స్.. రెస్టారెంట్స్‌లలో బయట బోర్డులు పెట్టేశారు. Indians, Pakistanis NOT Allowed అని రాసిఉంటుంది.

Koreans Hate Indians | ‘డర్టీ ఇండియన్స్’.. గుణం కాదు అందమే ముఖ్యమంటున్న కొరియన్స్!

Koreans Hate Indians | ఇండియాలో కొరియా సినిమాలు, కొరియా డ్రామా, కొరియన్ మ్యూజిక్ అంటే విపరీతంగా ఇష్టపడేవారుండారు. కొరియన్ సినిమాలు Oldboy, parasite, కొరియన్ పాప్ సాంగ్స్.. Open Gagnam STyle, కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS ఇండియాలో చాలా ఫేమస్.


కానీ అదే కొరియాలో ఇండియన్స్ వెళితే.. కొరియన్స్ హీనంగా చూస్తారు. ఇండియన్స్ అంటే చెత్త అని అంటారు. ఇండియన్స్ ఎక్కడికైనా షాపింగ్ కోసం వెళ్తే వాళ్లపై అందరూ అదో రకంగా చూస్తుంటారు. అంతెందుకు కొన్ని హోటల్స్.. క్లబ్స్.. పబ్స్.. రెస్టారెంట్స్‌లలో బయట బోర్డులు పెట్టేశారు. Indians, Pakistanis NOT Allowed అని రాసిఉంటుంది. ఇక్కడ మనం కొరియా అంటే ముఖ్యంగా సౌత్ కొరియా గురించి మాత్రమే మాట్లాడుకోవాలి.

ఈ South Koreaలో నివసించే భారతీయులు.. ఇలాంటి జాత్యాహంకారంతో కూడిన వివక్ష ప్రతి రోజూ అనుభవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ISLAM and Hindus OUt అని బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి బ్యానర్లు కొరియాలోని Daegu cityలో చాలా కామన్. ఇదే South Korea reality.


South Koreaలో ఇండియన్స్.. ఏ స్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నారనేందుకు కొన్ని ఉదాహరణలు.

South Koreaలోని ఏదైనా షాపింగ్ మాల్‌లో ఒక ఇండియన్ వెళితే.. అక్కడ ఆ ఇండియన్ ఏదైనా షాప్‌లో ఒక వస్తువుని ముట్టుకొని పరిశీలించేందుకు వారు అనుమతించరు. ఒక వేళ ముట్టుకున్నా.. వెంటనే అది dirty అయిపోయిందని కోపంగా చూస్తారు. నిజం చెప్పాలంటే భారతీయల పట్ల ఇలాంటి భావన బ్రిటీషర్ల పాలనలో ఉండేది. ఇండియన్స్ జాతి చాలా తక్కువ జాతి అనే భావనతో బ్రిటీషర్లు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఇప్పుడు South Koreans కూడా అలానే తయారయ్యారు. ఒక్క ఇండియన్స్ పట్ల కాదు మిగతా Asians,Africans పట్ల కూడా కొరియన్స్ వివక్ష చూపిస్తున్నారు. అయితే ఇది ఇండియన్స్ పట్ల కాస్త ఎక్కువని చెప్పాలి.

కొరియాలో నివసించే ఒక ఇండియన్ యువకుడు తన స్నేహితులతో కలిసి మొదటి సారి కొరియాలోని ఒక నైట్ క్లబ్‌కి వెళతాడు. అక్కడ బయట నుంచే ఆ నైట్ క్లబ్ సెక్యూరిటీ.. మీకు ప్రవేశం లేదంటాడు. వారంతా ఎందుకని ప్రశ్నిస్తే ఇండియన్స్ not allowed. వారంతా.. ఇలా చేయడం వివక్ష మీరు జాత్యాహంకారం చూపిస్తున్నారని చెబుతారు. ఆ సెక్యూరిటీ మాత్రం మీరు కావాలంటే పోలీసుల వద్దకు వెళ్లండి. అని చెబుతాడు. ఇలా వారు మరో క్లబ్‌కి వెళ్లినా ఇదే పరిస్థిది ఎదురవుతుంది. అలా మూడో క్లబ్‌కు వెళితే బయట బోర్డు చూపిస్తారు. ఇండియన్స్ అండ్ పాకిస్తానీ not allowed అని రాసిఉంటుంది.

ఇలాంటిదే ఇండియా టుడీ న్యూస్ ఒక case studyలో చెప్పింది. South Koreaలో నివసించే బొనొజీత్ హుస్సేన్ అనే 28 ఏళ్ల ఇండియన్ ప్రొఫెసర్.. కొరియా రాజధాని సియోల్ నగరంలో ఒక మెట్రో ట్రైన్‌లో తన Korean Girlfriendతో వెళతాడు. అక్కడ ఒక కొరియన్ వ్యక్తి అతని Girlfriendని తిడతాడు. ”నీకు ఎవరూ దొరకలేదా? నీ ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ముఖం చూడు.. నల్లగా, చెత్తగా ఉంది,” అని అంటాడు. మధ్యలో బొనొజీత్ కలుగుజేసుకుంటే అతడిని కొందరు పట్టుకొని కొడతారు. ఆ తరువాత బొనొజీత్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ పోలీసులు రివర్స్‌లో బొనొజీత్‌కే ఉచిత సలహా ఇస్తారు. వెళ్లి ఆ కొరియన్ వ్యక్తినే క్షమాపణలు కోరి.. తిరిగి వెళ్లిపోమంటారు. ఇదంతా వింటే మనకు ఏమనిపిస్తుంది. ఏంటి ఇంత అన్యాయమా?

ఇలాంటి సంఘటనలు.. కొరియాలోనే కాదు. ఇండియాలో కూడా జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ అనే korean కార్ల manufacturing unit. ఆ కంపెనీలో పనిచేసే కొరియన్ ఉద్యోగల కోసం అక్కడ చుట్టూ కొన్ని కొరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఇండియన్స్ not allowed. ఇటీవల ఈ విషయం గురించి తెలుసకోవడానికి The Wire అనే వార్తా సంస్థ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. అందులో ఒక కొరియన్ రెస్టారెంట్ మేనేజర్ వారిని లోపలికి అనుమతించలేదు. కారణం ఏంటని ప్రశ్నిస్తే.. చెప్పాల్సిన అవసరం లేదని.. వెళ్లిపోయాడు. అక్కడ మరో విషయం కూడా తెలిసింది. ఆ రెస్టారెంట్‌లో పనిచేయడానికి కూడా ఇండియన్స్ not allowed. అందుకనే నేపాల్ దేశస్తుల చేత పనిచేయించుకుంటున్నారు.

Korea కూడా ఒకప్పుడు ఇండియా లాగానే బానిస దేశంగా ఉండేది. అయితే కొరియాని బానిసగా పాలించింది జపాన్. అయితే భారత్ కంటే చాలా లేటుగా స్వాతంత్ర్యం పొందిన కొరియా చాలా త్వరగానే అభివద్ధి చెందిన దేశాల జాబితాలో చేరింది. ఇప్పుడు South Korea literacy rate అంటే అక్షర రాస్యత రేటుతో ప్రపంచంలోనే టాప్ 5 దేశంగా ఉంది. అయినా అక్కడి ప్రజల ఆలోచనా విధానం చాలా వెనుకబడి ఉంది.

భారత ఎకానమీ.. South Korea economy కంటే చాలా పెద్దది. Indian Economy రూ.3.18 లక్షల కోట్లు ఉంటే.. అదే South Korea economy 1.18 లక్షల కోట్లు. అయినా భారతీయులంటే కొరియన్స్‌కి ఎందుకంత చిన్నచూపు. దీనికి గల కారణం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

కొరియన్ భాషలో చెప్పాలంటే చాలామంది కొరియన్స్‌కు ఒక వింత మానసిక వ్యాధి. ఆ వ్యాధి పేరే OEMU JESANG JUUI(ఒయిమో జిసాంగ్ జూయి) ఇంగ్లీషులో చెప్పాలంటే LOOKISM.

Communism గురించి తెలుసు కానీ ఈ LOOKISM ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. Lookism అంటే అందానికి ఎక్కవ importance ఇవ్వడం. Lookism అనే పదానికి ఇంగ్లీషులో definition చెప్పాలంటే Looks are Supreme అని అర్థం వస్తుంది.

ఇప్పుడు కొరియాలో Lookism అనే వ్యాధి పీక్స్‌లో ఉందని చెప్పొచ్చు. దీని వల్లే వాళ్లు ఇతర దేశాల, ఇతర జాతుల వారిని తమ కంటే తక్కువ అని భావిస్తున్నారు. వాళ్ల భాషలో చెప్పాలంటే కేవలం తెల్లగా ఉంటే సరిపోదు. ముక్కు మొహం, శరీర ఆకారం అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. లేకుంటే ఆ మనిషికి సమాజంలో విలువ ఉండదు.

ఉదాహరణకు మన ఇండియాలో ఒక ఉద్యోగం కోసం ఒక మనిషి దరఖాస్తు చేసుకునేందుకు తన రెజ్యూమె, సివీ, బయో డేటా లాంటివి ఇస్తాడు. కానీ South koreaలో అలా కాదు. చాలా Rules ఉన్నాయి. అమెరికా వార్తా సంస్థ Los Angeles Times దాదాపు 900క పైగా కొరియా కంపెనీలను సర్వే చేసింది. ఈ 900 కంపెనీలలో ప్రభుత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలలో 60 శాతానికి పైగా ఒక Rule ఉంది. ఉద్యోగానికి APPLY చేసుకునే CANDIDATE తప్పనిసరిగా ఫోటో ఇవ్వాలి. ఆ ఫోటోలో అభ్యర్థి అందంగా ఉంటేనే ఇంటర్‌వ్యూ కి పిలుస్తారు.

ఇలాంటివి ఇంకా కండీషన్స్ ఉన్నాయి. యువతులకు ఆఫీసుల్లో జాబ్ కావాలంటే వారు శరీరం ఆకర్షంగా ఉండాలి. ఉదాహరణకు వారి BRA SIZE C ఉండాలి. ముక్కు నేరుగా సూటిగా ఉండాలి. కళ్లు చాలా అందంగా ఉండాలి. యువకులు పొడుగ్గా, అందంగా ఉండి FITNESS కలిగి ఉండాలి.

ఈ రూల్స్ private companies మాత్రమే కాదు… govt companies కూడా పెట్టాయి. ఈ కండిషన్స్ కారణంగానే కొరియాలోని 20 శాతం యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. దీన్ని లిటరల్‌గా చెప్పాలంటే పిచ్చి అనే చెప్పాలి. కొరియా సమాజంలో ఈ Looks అనే పిచ్చి బాగా నాటుకుపోయింది. యువతులు పెళ్లిచేసుకోవాలంటే అబ్బాయిలు ఆరడగులు ఉండాలని షరతులు విధిస్తున్నారు. అందుకే South Koreaలో దశాబ్ద కాలంగా మనిషి పొడువు అయ్యేందుకు కాళ్లకు ఆపరేషన్ చేసుకునే వారి సంఖ్య బాగాపెరిగిపోయింది. ఈ ఆపరేషన్లు వికటించి కొందరు ఏకంగా కాళ్లు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు.

అందంగా ఉండాలి, సెక్సీగా ఉండాలి.. ఫిట్‌గా ఉండాలి.. అలా ఉండేవారికే సమాజంలో విలువ.. అని చెబితే. ఇది వివక్ష కాక మరేమిటి? దీని వలన South KOreaలో చాలా మంది అందంగా లేమని డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఆ దేశంలో ఈ కారణంగా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.

ఈ వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకోవాలని కొన్ని సామాజిక సంస్థలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చాయి. కొంతమంది ఎంపీలు అంగీకరించి వివక్షకు వ్యతిరేకంగా అక్కడి పార్లమెంట్‌లో చట్టం కూడా తీసుకువచ్చారు. కానీ కంపెనీలు, ఉద్యోగ సంఘాలన్నీ మూకుమ్మడిగా నిరసన మొదలుపెట్టారు. అక్కడి రాజకీయ పార్టీలకు వచ్చే ఫండ్స్ ఈ కంపెనీల నుంచే వస్తున్నాయి. అందుకే ఈ చట్టాన్ని వెనక్కు తీసుకున్నారు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.

సమాజంలో ఎక్కువగా ఈ ఆలచనా ధోరణి ఉండడం కారణంగా అక్కడి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అందంగా ఉండాలని.. వాళ్లకు special gift ఇస్తున్నారు. ఏంటో తెలుసా? Plastic surgery.

అవును పిల్లలు అందంగా లేకపోతే వారి జీవితం నరకంగా మారుతుందని కొరియాలో తల్లిదండ్రులు పిల్లలు కాలేజీ పూర్తవగానే plastic surgery చేయిస్తున్నారు. ఈ కారణంగా కొరియాలో ఎక్కడ చూసినా plastic surgery advertisements, బ్యానర్లు, కనిపిస్తుంటాయి. ప్రపంచం మొత్తంలో జరిగే plastic surgery ఆపరేషన్ల లో 25 శాతం South Koreaలోనే జరుగుతున్నాయి.

సౌత్ కొరియా ప్రభుత్వ శాఖ Labour & Employment Ministry ఒక ట్విట్టర్ యాడ్‌లో ఉద్యోగం కావాలంటే plastic surgery చేయించుకోవాలని కండిషన్ పెట్టింది. ఇక Government ఇలా చెబితే .. ఎవరు మాత్రం ఏం చేస్తారు.

ఇక్కడ ఒక కేస్ గురించి చెప్పాలి. నిక్కీ కిమ్ అనే కొరియా యువతి ఇంగ్లాండ్‌లో చదువు పూర్తిచేసుకొని స్వదేశానికి తిరిగివచ్చింది. ఉద్యోగం కోసం ఒక కంపెనీలో apply చేసింది. ఆమె CVలో తన ఫోటో కూడా జత చేసింది. కానీ Interview రోజు నిక్కీ కిమ్ ‌ఆఫీసు వెళితే.. ఆమెను ముందుగా చూసి.. ఫొటోలో ఉన్నంత అందంగా మీరు నిజజీవితంలో లేరని చెప్పి తిరిగి పంపించేశారు. ఉద్యోగం వెళ్లిన ప్రతీ కంపెనీలో ఇలాంటి రూల్స్ చూసి.. నిక్కీ తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి.. అక్కడే ఉద్యోగం చేసుకుంటోంది. ఇలాంటి సంఘటనలు అక్కడ మామూలే.

ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా బ్లూ కాలర్ జాబ్స్ అంటే లేబర్ పని చేస్తున్నారు. కానీ కొరియాలో అలా కాదు. South KOreaలో ముందు చెప్పినట్లు చదువుకన్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 98.8 శాతం Literacy rate ఉండడంతో అక్కడి యువత కేవలం వైట్ కాలర్ అంటే ఆఫీసు జాబ్స్ చేయడానికి మాత్రమే అసక్తిగా ఉన్నారు. బ్లా కాలర్ జాబ్స్ అంటే లేబర్ పని లేదా శారీరక శ్రమ ఉన్న ఉద్యోగం చేయడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే కొరియా ప్రభుత్వం.. manufacturing, poultry, construction, వ్యవసాయరంగాలలో పనిచేయడానికి ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి యువతను ఆహ్వానిస్తోంది.

ఇప్పుడు ఈ కారణంగానే కొరియన్స్.. భారతీయలు అంటే లేబర్ అని చిన్నచూపు చూస్తున్నారు. ఇండియా నుంచి కొరియా వెళ్లే వారిలో సాఫ్టవేర్ జాబ్స్ చేసేవాళ్లు, డాక్టర్స్, ఇంజినీర్స్ కూడా ఉన్నారు. కానీ కొరియన్స్ దృష్టిలో భారతీయులంటే లేబర్ పనిచేసేవాళ్లు. అందుకే Indians are dirty అని కొరియన్స్ పిల్లలు కూడా చెబుతున్నారు. ఇది వారి దిగజారిన మానసిన స్థితి నిదర్శనం.

కొరియాలో అక్కడ తెల్లగా ఉండేవాళ్ల కలర్ fetish. అదే ఇండియన్ తెల్లగా ఉంటే వారి కలర్ wheatish అని అంటారు. ఈ వీటిష్ కలర్ ఉన్నా అది అందంగా ఉన్నట్లు కాదని కొరియన్స్ భావన. అందుకే ఇండియన్స్ పట్ల మిగతా దేశాల వారి కన్నా వివక్ష ఎక్కువగా చూపుతారు ఈ కొరియన్స్.

ఇండియన్స్‌ను ద్వేషంగా కొరియన్స్ చూడడానికి కారణం మరొకటి కూడా ఉంది. Korean Institute of International Economic Policy 2010లో ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో ఇండియా ఒక unsafe, underdeveloped, Old fashioned country అని కొరియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇండియా ప్రజలు పరిశుభ్రంగా ఉండరు. ఇది వాళ్ల దృష్టిలో India Image. అందుకే ఇండియన్స్ అంటే వారు ఇష్టపడరు. ఇక్కడ తప్పు మొత్తం వారిది కాదు. ఎందుకంటే ఇండియా గురించి వాళ్లకు పూర్తిగా తెలియదు.

కొరియాలో recent figures ప్రకారం.. కేవలం 12000 ఇండియన్స్ మాత్రమే నివసిస్తున్నారు. ఇక ఇండియన్ tourists కూడా one lakh fifty thousand ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు. ఇలాంటి situationలో వాళ్లకు ఇండియన్ culture గురించి ఎక్కవగా తెలియదు. Infact South Korea 1973 వరకు ఇండియాని ఒక శత్రువుగా భావించేది. ఎందుకంటే ఇండియా Russiaకు మిత్రదేశం. North Korea, South Korea మధ్య యుద్ధం జరిగినప్పుడు Russia.. North KOreaకు సహాయం చేసింది. అంటే Indirectగా ఇండియా కూడా శత్రు దేశంగానే భావించేవాళ్లు.

ఇప్పుడు ఈ పరిస్థితిని కొంతవరకు సరిచేయవచ్చు. దీనికి రెండు పరిష్కారాలున్నాయి. ఒకటి South Korea productsకి ఇండియా ఒక పెద్ద మార్కెట్. చిన్నా, పెద్దా అన్నీ కలిసి భారత్‌లో 500కు పైగా కొరియన్ కంపెనీలున్నాయి. అలాంటిది భారత ప్రభుత్వం వీటిపై ఆంక్షలు విధించవచ్చు. అంతర్జాతీయంగా Pressure తీసుకురావచ్చు.

మరొకటి ఇండియా కల్చర్‌ని తెలియజేసే విధంగా కొరియాలో కార్యక్రమాలు నిర్వహించడం.

మనం మనుషులం.. సమాజంలో కలిసి మెలిసి జీవించాలని నాగరికత నేర్చుకున్నాం. అలాంటిది పక్క మనిషి తక్కువ జాతివాడు.. అతను అందంగా లేడు.. అని చిన్నచూపు చూడడం ఎంతవరకు కరెక్ట్.. అంటారు. ఈ ప్రశ్న భారతీయులమైన మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే తెల్లగా ఉండేవారినే భారతీయులు కూడా ఇష్టపడతారు. నల్లగా ఉంటే ఇష్టపడరు. మనిషి అందంగా ఉంటే కళ్లకు నచ్చడం.. ఇది కామన్. కానీ అందంగా లేకపోతే ద్వేషించడమనేది ఒక మానసిక సమస్య.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×