EPAPER

 Rohit Sharma : కోహ్లీ నేటి యువతకు ఆదర్శం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

 Rohit Sharma : కోహ్లీ నేటి యువతకు ఆదర్శం.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rohit Sharma

Rohit Sharma : విరాట్ కొహ్లీ పై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రశంసల జల్లు కురిపించాడు.  కొహ్లీ ఫిట్ నెస్ అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నాడు. తను ఇంతవరకు నేషనల్ క్రికెట్ అకాడమీ కి వెళ్లలేదని అన్నాడు. అందరూ గాయపడి, అక్కడ చేరి చికిత్స చేయించుకుని, ఫిట్ నెస్ నిరూపించుకుని మళ్లీ జాతీయ జట్టులోకి వస్తుంటారు.


కొహ్లీకి ఇప్పటివరకు ఆ అవసరం రాలేదని తెలిపాడు. ఇది చాలా గొప్ప విషయమని అన్నాడు. వికెట్ల మధ్య ఎంతో చురుకుగా పరుగెడతాడని, అవతల బ్యాటర్లతో ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తాడని తెలిపాడు. ఎన్ని మ్యాచ్ లు ఆడినా సరే, మరుసటి రోజు మ్యాచ్ కి ఫ్రెష్ గా ఉంటాడు. అసలు అలసటనేది ఉండదని తెలిపాడు.

క్రికెట్ పట్ల కోహ్లి అభిరుచి, అంకితభావం అద్భుతమని, అతడు ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని రోహిత్ అన్నాడు. ప్రతి మ్యాచ్ లో జట్టు కోసం గొప్పగా పోరాడుతుంటాడు. ఏ సందర్భమైనా సరే, సింహంలా చివరి వరకు పోరాడతాడు. పరాజయం కోరల్లో నుంచి ఎన్నో సార్లు మ్యాచ్ లని కాపాడాడని తెలిపాడు. ఎటాకింగ్ ప్లే లో కొహ్లీని మించినవారు సమకాలీన క్రికెట్ లో లేరని అన్నాడు. నిజానికి అతడిని దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టం. కోహ్లిని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలని తెలిపాడు.


ఇంతవరకు ఎప్పుడు కూడా విరాట్ కొహ్లీ సెలవు పెట్టలేదని, విశ్రాంతి కోరలేదని అన్నాడు. చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ ఇలా మాట్లాడటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. తొలిటెస్ట్ లో కొహ్లీ ఎంత అవసరమనేది అందరికీ బాగా అర్థమైందని అంటున్నారు. నిజానికి తనేగానీ ఉండుంటే, ఫలితం వేరేలా ఉండేదని చెబుతున్నారు. అందుకే ఎలాగైనా కొహ్లీని తిరిగి జట్టులోకి తీసుకురావడానికి టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుందని, అందుకు రోహిత్ కామెంట్లే ఉదాహరణ అంటున్నారు.

రోహిత్ శర్మ ఇలా మాట్లాడటంపై కొంపదీసి కొహ్లీ ఏమైనా అలిగి వెళ్లాడా? అని కూడా అంటున్నారు. అందుకనే ఇలా దువ్వుతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జట్టులో సమతుల్యత లోపించింది. సీనియర్ల అవసరం చాలా ఉందనేది హైదరాబాద్ టెస్ట్ నిరూపించింది.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×