EPAPER

Team India : 69 ఏళ్లలో తొలిసారి హైదరాబాద్ లో ఓటమి..!

Team India : 69 ఏళ్లలో తొలిసారి హైదరాబాద్ లో ఓటమి..!
Team India

Team India : హైదరాబాద్ వేదిక గా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇదే తొలి ఓటమి కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్ లను గెలిచిన టీమ్ ఇండియా తొలిసారి ఓటమి పాలైంది. ఇప్పటివరకు 69 ఏళ్లలో హైదరాబాద్ లో అంతర్జాతయ టెస్ట్ మ్యాచ్ లు 9 జరిగాయి. వాటిలో 5 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మూడు డ్రా అయ్యాయి. 9 మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.


గతచరిత్ర చూస్తే హైదరాబాద్ లో జరిగిన అన్ని మ్యాచ్ ల్లోనూ టీమ్ ఇండియా ఘనవిజయాలే సాధించింది.

1988 న్యూజిలాండ్, 2018 వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2012లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఘన విజయం
2017లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 208 పరుగుల తేడాతో విజయం సాధించింది.


రెండు మ్యాచ్ లు  10 వికెట్ల తేడాతో విజయం సాధిస్తే, రెండింట్లో ఇన్నింగ్స్ 100 పరుగులు పైనే తేడాతో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో మాత్రం 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ లో ఇంతటి ఘన చరిత్ర కలిగి కూడా 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ తో ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో చెత్త రికార్డు ఏమిటంటే తొలి ఇన్నింగ్స్ లో 100 ప్లస్ రన్స్ లీడ్ వచ్చిన తర్వాత టీమ్ ఇండియా స్వదేశంలో ఓడిపోవడం ఇదే తొలిసారి.

టాప్ ఆర్డర్ దగ్గర నుంచి మొదలుపెడితే 8 నెంబర్ వరకు ఆల్ రౌండర్లు, బ్యాటర్లతో నిండిన టీమ్ ఇండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం సిగ్గు చేటని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×