EPAPER

Ben Stokes : ఓలి పోప్ వల్లే గెలిచాం.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంస..

Ben Stokes : ఓలి పోప్ వల్లే గెలిచాం.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంస..

Ben Stokes : ఈ టెస్ట్ మ్యాచ్ విజయం కేవలం ఓలిపోప్ వల్లే వచ్చిందని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ అన్నాడు. నిజానికి పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, డబుల్ సెంచరీ చేసి ఉంటే, టెస్ట్ మ్యాచ్ విజయం రెట్టింపు అయ్యేదని తెలిపాడు. అయినా సరే, మ్యాచ్ విజయం ఒక మరపురాని మధురానుభూతిని మిగిల్చిందని అన్నాడు. పోప్ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకు మరీ, ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడటం అద్భుతమని అన్నాడు.


కెప్టెన్ గా తొలిసారి భారత్ కి వచ్చాను. ఒక మంచి శుభారంభం దక్కిందని అన్నాడు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెటప్ అంతా దగ్గరుండి చూశానని తెలిపాడు. నేను కూడా అవే వ్యూహాలని, ఫీల్డ్ సెటప్ రెండో ఇన్నింగ్స్ లో చేశానని అన్నాడు. టామ్ హార్ట్ లే తొలి మ్యాచ్ లోనే విజృంభించి ఆడాడని కితాబునిచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోయినా రెండో ఇన్నింగ్స్ లో చెలరేగి 7 వికెట్లు తీశాడని అన్నాడు.

మొదటి ఇన్నింగ్స్ లో 25 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 131 పరుగులు ఇచ్చుకున్నాడు. బౌలింగ్ ఎకానమీ రేట్ 5.24 ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో మరొక కెప్టెన్ అయితే పక్కన పెట్టేస్తాడు. కానీ బెన్ స్టోక్ మాత్రం అలా చేయలేదు.  తనపై నమ్మకం ఉండటం వల్లే సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ ఓవర్లు ఇచ్చానని బెన్ స్టోక్ తెలిపాడు.


మొదటి ఇన్నింగ్స్ లో ఎక్కడ తప్పులు చేశాడో వాటిని సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్ లో  బాల్స్ సంధించి వికెట్లు రాబట్టాడు. 26.2 ఓవర్లు వేసి ఈసారి కేవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీయడం విశేషం.

ఈ సందర్భంగా 196 పరుగులు చేసిన ఓలిపోప్ మాట్లాడుతూ ఇంతమంది ఆడలేకపోయిన పిచ్ పై నేను భారీ ఇన్నింగ్ చేయడం చాలా గొప్పగా ఉంది. అంతేకాదు నమ్మశక్యంగా కూడా లేదని అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే నాకు కొన్ని లైఫ్ లు కూడా వచ్చాయని అన్నాడు. దీంతో మరింత జాగ్రత్తగా ఆడానని తెలిపాడు. అలాగే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీసు చేశానని, ఆ టెక్నిక్ ఉపయోగపడిందని అన్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×