EPAPER

Benefits of Pumpkin Seeds : గుమ్మడి గింజలతో కలిగే లాభాలు

Benefits of Pumpkin Seeds : గుమ్మడి గింజలతో కలిగే లాభాలు

Benefits of Pumpkin Seeds : పొద్దున్నే ఒక స్పూన్‌ ఈ గుమ్మడి గింజలను తింటే జీవితంలో డాక్టర్ అవసరం ఉండదంటున్నారు నిపుణులు. గుమ్మడి గింజలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఒకప్పుడు మన ఇంట్లో గుమ్మడికాయతో కూర చేసుకుంటే దానిలో గుమ్మడి గింజలను శుభ్రం చేసి ఎండబెట్టి, పైతొక్క తీసి తినేవారు. కానీ ప్రస్తుత కాలంలో డ్రై ఫ్రూట్ షాపుల్లో, ఆన్‌లైన్‌లో ఈ గింజలు విరివిగా లభిస్తున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడి గింజలను పచ్చిగా తినొచ్చు. లేకుంటే వేపుకుని తినవచ్చు. అంతేకాకుండా నానబెట్టి కూడా తినవచ్చు. గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, జింక్‌, భాస్వరం, పొటాషియం వంటి అమైనో ఆమ్లాలు, ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిక్‌తో పాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసి బీపీని అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండడం వల్ల షుగర్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ గుమ్మడి గింజలు, ఆకులు, గుజ్జు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి. ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్, ఫైటోస్టెరాల్స్, ఈ ఉత్పన్నాలు, కెరోటిన్ బాగా ఉన్నాయి. దీంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ గుమ్మడి గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే అధిక బరువు తగ్గించుకోవచ్చు. చాలా సమయం వరకు కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించి మీ జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ముఖంపై నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరిసేలా దోహదపడుతుంది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×