EPAPER

Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!

Houti Rebels | ఎర్ర సముద్రంలో బ్రిటన్ నౌక మార్లిన్ లుఆండాపై యెమెన్ దేశానికి చెందిన హౌతీ విద్రోహులు క్షిపణి దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం జనవరి 26 రాత్రి జరిగింది. 23 సిబ్బంది గల ఈ నౌకలో మండే స్వభావం గల 80 వేల టన్నుల ద్రవ్యం కంటెయినర్లు ఉన్నాయి. దీంతో క్షిపణి దాడి జరుగగానే నౌకలో మంటలు చెలరేగాయి. నౌక సిబ్బందిలో మొత్తం 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక పౌరులన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

దాడి జరిగిన తరువాత మార్లిన్ లుఆండా నౌక సిబ్బంది సహాయం కోసం రేడియో కాల్ చేయగా.. వెంటనే ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించింది. నౌకలో రగిలిన మంటలను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ విధానంతో ఆర్పడానికి సహాయం చేసింది.

ఎర్ర్ సముద్రానికి తీరం కలిగిన దేశాలలో బహ్రెయిన్ ఒకటి. బహ్రెయిన్‌లో అమెరికా ఆర్మీ పెద్ద స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికన్ అధికారులు ఈ దాడి గురించి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి జనవరి 26 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు(యెమెన్ దేశ సమయం)జరిగింది.

యెమెన్ దేశంలోని హౌతీ స్థావరాల నుంచి వచ్చిన ఒక డ్రోన్ మిసైల్ బ్రిటన్ చమురు నౌక మార్లిన్ లుఆండాపై దాడి చేసింది. బ్రిటన్ దే శ ప్రభుత్వం ఈ దాడిపై స్పందిస్తూ.. హౌతీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

హౌతీ రెబెల్స్ శుక్రవారం మరో దాడి కూడా చేశారని సమాచారం. హౌతీలను సముద్రంలో దాడుల చేయకుండా కట్టడి చేసేందుకు అమెరికా మోహరించిన యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్నీపై కూడా దాడి జరిగింది. అయితే ఈ దాడిలో పెద్దగా నష్టమేమి జరగలేదు. ఈ దాడికి ప్రతిచర్యగా అమెరికా కూడా శనివారం ఉదయం యోమెన్ లోని హౌతీ స్థావరంపై దాడులు చేసింది.

హౌతీల అధికారిక మీడియా అల్ మసిరహ్ కథనం ప్రకారం అమెరికా క్షిపణులు యెమెన్ పోర్టు నగరమైన హొదేదాపై దాడి చేశాయి. కానీ ఈ దాడి ప్రభావం గురించి పూర్తి వివరాలను ఇరు పక్షాలు వెల్లడించలేదు.

అమెరికా యుద్ద నౌకపై హౌతీలు నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Houti Rebels, attack, Britain oil tanker, cargo ship, Martin Luanda, Red sea, Gulf of Eden, INS Visakhapatnam, US War ship,

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×