EPAPER

Mantralayam Assembly Constituency : మంత్రాలయంలో గెలుపు మంత్రం ఎవరిది..? బిగ్ టీవీ సర్వే ఏంచెబుతోంది..?

Mantralayam Assembly Constituency : మంత్రాలయంలో గెలుపు మంత్రం ఎవరిది..? బిగ్ టీవీ సర్వే ఏంచెబుతోంది..?

Mantralayam Assembly Constituency : రాఘవేంద్రస్వామి ఆలయం నెలవై ఉన్న ప్రాంతం మంత్రాలయం. ఇక్కడ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వై.బాలనాగిరెడ్డి. నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి బాలనాగిరెడ్డి హవానే కొనసాగుతోంది. 2009లో టీడీపీ తరపున, 2014, 2019లో వైసీపీ తరపున గెలిచారు. ఈ మంత్రాలయం సెగ్మెంట్ లో 60 శాతం బోయ కమ్యూనిటీకి చెందిన వారే ఉన్నారు. దాదాపు లక్షా 10 వేల మంది ఈ కమ్యూనిటీ వాళ్లున్నారు. అయితే ఈ సామాజికవర్గం నుంచి బలమైన నేత మాత్రం మంత్రాలయంలో లేకుండా పోయారు. దీంతో జనాభాలో డామినెంట్ గా ఉన్నా.. పొలిటికల్ పవర్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంటోంది. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా మంత్రాల‌యం కొత్తగా ఏర్పాటైంది. ఎమ్మిగ‌నూరు నియోజక‌వ‌ర్గం నుంచి మంత్రాల‌యం, పెద్దక‌డుబూరు, కోసిగి మండ‌లాలతో పాటుగా ఆదోని సెగ్మెంట్ నుండి కౌతాళం మండ‌లాన్ని క‌లిసి ఈ మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. గ‌తంలో ఆదోని నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ఈ ప్రాంతం.. 2009 నుంచి మంత్రాలయం ప్రత్యేక సెగ్మెంట్ గా మారింది. ఇప్పుడు మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. మంత్రాలయం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

బాలనాగిరెడ్డి (గెలుపు) VS పాలకుర్తి తిక్కారెడ్డి


YCP 55%
TDP 40%
OTHERS 5%

2019 ఎన్నికల్లో మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 55 శాతం ఓట్ షేర్ సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన పాలకుర్తి తిక్కారెడ్డి 40 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 5 శాతం ఓట్లు లభించాయి. తాను గెలిచినా పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో సరైన అభివృద్ధి చేయలేకపోయానని చెప్పి 2019లో బాలనాగిరెడ్డి ప్రచారం చేసుకున్నారు. దీంతో సింపథీ ఓట్లన్నీ అటువైపే పడ్డాయి. వీటితో పాటే సోదరులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా ఉండడం కూడా బాలనాగిరెడ్డికి బలం బలగం రూపంలో కలిసి వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో మంత్రాలయం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

వై.బాలనాగిరెడ్డి (YCP)

వై.బాలనాగిరెడ్డి ప్లస్ పాయింట్స్

  • సెగ్మెంట్ లో నాడు నేడు కింద స్కూల్స్ అభివృద్ధి
  • అందరికీ అందుబాటులో ఉంటారని టాక్
  • నియోజకవర్గంలోనే స్థిర నివాసం
  • సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం
  • క్యాడర్ ను బాగా చూసుకోవడం ప్లస్ పాయింట్
  • వైఎస్ జగన్ సర్కార్ స్కీం లబ్దిదారుల ఓట్లు

వై.బాలనాగిరెడ్డి మైనస్ పాయింట్స్

  • మంత్రాలయం సెగ్మెంట్లో దారుణ స్థితికి చేరిన రోడ్లు
  • మండలాల నుంచి గ్రామాలకు వెళ్లడానికి అవస్థలు
  • రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లే రోడ్లు డ్యామేజ్
  • హాస్పిటల్స్ లో సరైన మౌలిక వసతులు లేకపోవడం
  • సరైన తాగు, సాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు
  • సెగ్మెంట్ వ్యాప్తంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకపోవడం
  • మంత్రాలయంలో ఉపాధి ఉద్యోగావకాశాలు తగ్గడం
  • యూత్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వలసలు

పాలకుర్తి తిక్కా రెడ్డి (TDP)

పాలకుర్తి తిక్కా రెడ్డి ప్లస్ పాయింట్స్

  • టీడీపీతో, మంత్రాలయంతో విడదీయరాని అనుబంధం
  • గత రెండు ఎన్నికల్లో ఓడిన సానుభూతి
  • టీడీపీ తరపున సెగ్మెంట్ ఇంఛార్జ్ గా బాధ్యతలు
  • ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయాలు

పాలకుర్తి తిక్కా రెడ్డి మైనస్ పాయింట్స్

  • బోయ కమ్యూనిటీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయకపోవడం
  • పబ్లిక్ సపోర్ట్ పెంచుకోకపోవడం

రాఘవేంద్ర రెడ్డి (TDP)

రాఘవేంద్ర రెడ్డి ప్లస్ పాయింట్స్

  • తండ్రి రామారెడ్డి రాజకీయ వారసత్వం
  • 50 శాతం ఉన్న బోయ కమ్యూనిటీ సపోర్ట్

రాఘవేంద్ర రెడ్డి మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో ర్యాలీలు, సభలు పెట్టకపోవడం
  • కేవలం తండ్రి పేరుతోనే గుర్తింపు
  • వ్యక్తిగతంగా ఓటర్లలో ఇమేజ్ పెంచుకోని పరిస్థితి

బి.లక్ష్మణ్ (JSP)

బి.లక్ష్మణ్ ప్లస్ పాయింట్స్

  • జనంలో సీనియర్ నేతగా గుర్తింపు
  • పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్
  • బోయ కమ్యూనిటీ ఫుల్ సపోర్ట్
  • పార్టీల కంటే వ్యక్తిగత ఇమేజ్ తోనే సెగ్మెంట్ లో గుర్తింపు

బి.లక్ష్మణ్ మైనస్ పాయింట్స్

  • పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో మంత్రాలయంలో నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

వై.బాలనాగిరెడ్డి VS రాఘవేంద్ర రెడ్డి

YCP 48%
TDP 44%
OTHERS 8%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంత్రాలయంలో వైసీపీ గెలిచేందుకే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డికి 48 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి 44 శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

బాలనాగిరెడ్డికి మంత్రాలయం సెగ్మెంట్ లో జనం నుంచి బలమైన మద్దతు కనిపిస్తోంది. ఇదే కుటుంబం నుంచి బాలనాగిరెడ్డి సోదరులు ఆదోని, గుంతకల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంతటి స్ట్రాంగ్ సపోర్ట్ కుటుంబం నుంచి ఉంది. వీటికి ప్రజాబలం తోడవుతోంది. పార్టీ సపోర్ట్ ఎలాగూ ఉండనే ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్ లీడర్ గా బాలనాగిరెడ్డి ఉన్నారు. ఆయనకు క్యాడర్ సపోర్ట్ కూడా బలంగా కనిపిస్తోంది. అనుచరులకు కార్యకర్తలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం, వారి యోగక్షేమాలను పట్టించుకోవడం, అవసరమైనప్పుడు ఆర్థిక సహాయాలు అందించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. దీంతో క్యాడర్ లో పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ గా చేస్తూ వస్తున్నారు. గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో బిజీ అవుతున్నారు. మంత్రాలయం మండలంలోని రామాపురం గ్రామం బాలనాగిరెడ్డి సొంతూరు. ఇక్కడ ఆయనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వీటితో పాటే చుట్టుపక్కల గ్రామాల్లో నాగిరెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 8 వేల మంది పూర్తిస్థాయి మద్దతుదారులు ఈ గ్రామాల్లో ఉన్నారు. ప్రత్యర్థులు ప్రచారానికి వచ్చినా ఎఫెక్ట్ చూపించని పరిస్థితి తీసుకొస్తున్నారు.

మరోవైపు ఎన్నికల నాటికి పుంజుకోగలిగితే టీడీపీకి కూడా గెలుపు అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి తిక్కారెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. తిక్కారెడ్డి 2014, 2019లో ఓడిపోయారు. ఈసారి టిక్కెట్ వస్తుందా రాదా అన్నది త్వరలోనే తేలనుంది. అటు మరో టీడీపీ నేత రాఘవేంద్ర బోయ కమ్యూనిటీకి చెందిన వారు. ఆ సామాజికవర్గం మద్దతు పూర్తిస్థాయిలో కూడగట్టుకునే అవకాశం ఉంది. మంత్రాలయంలో ఈ కమ్యూనిటీ జనాభానే ఎక్కువగా ఉంది. దీంతో వారి ఓట్లు కీలకం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే తిక్కారెడ్డి కూడా మంత్రాలయంలో కీలక నేతగా ఉన్నారు. టిక్కెట్ రాఘవేంద్రకు దక్కినా ఆయన మద్దతుదారులు టీడీపీకి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు జనసేనతో పొత్తుతో పోటీ చేస్తే అక్కడి అభ్యర్థి లక్ష్మణ్ కూడా టీడీపీకి సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లక్ష్మణ్ కూడా బోయ కమ్యూనిటీకి చెందిన వారు. దీంతో ఆ సామాజికవర్గం అంతా టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.

Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×