EPAPER

 Rohan Bopanna : ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించాడు.. బోపన్న మరో చరిత్ర..!

 Rohan Bopanna : ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించాడు.. బోపన్న మరో చరిత్ర..!
Rohan Bopanna

Rohan Bopanna : ప్రతిభకు వయసు అడ్డంకి కాదని మరోసారి రోహన్ బోపన్న నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన అతనికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.


విజయానికి వయసెప్పుడు కొలబద్ధ కాదు. చాలామంది వీడి వయసైపోయింది. ఎందుకూ పనికిరాడని అంటూ ఉంటారు. కానీ కష్టపడితే విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుందని భారత టెన్నీస్ దిగ్గజం రోహన్ బోపన్న నిరూపించాడు. వయసు అనేది ఒక నంబర్ మాత్రమేనని 43 ఏళ్ల వయసులో చాటి చెప్పాడు. మరోచరిత్ర సృష్టించాడు.

రోహన్ బోపన్న కెరీర్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. డబుల్స్ విభాగంలో తన సహచర ఆటగాడు ఎబ్డెన్‌తో కలిసి టైటిల్ సాధించాడు. ఫైనల్‌ మ్యాచ్ లో ఇటలీకి చెందిన ఆటగాళ్లు సిమోన్, వావాసోరిపై 7-6, 7-5తో విజయం సాధించారు. దీంతో లేటు వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన ప్లేయర్‌గా బోపన్న సరికొత్త రికార్డు నెలకొల్పాడు.  


43 ఏళ్ల బోపన్నది కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా. తండ్రి ఎంజీ బోపన్న, కాఫీ ప్లాంటర్. తల్లి గృహిణి. అక్క ముంబయిలో ఉంటుంది. బెంగళూరుకి ఇక్కడ నుంచి ఆరుగంటల ప్రయాణం. బోపన్నకి టెన్నిస్ మీద ఉన్న అభిమానం చూసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఖరీదైన ఆటను నేర్పించారు. ఎంతో కష్టపడి బెంగళూరులో బోపన్న కోచింగ్ తీసుకున్నాడు. అలా అంచెలంచెలుగా భారత టెన్నిస్ లో ఎదిగాడు.  అలా 2002 సెప్టెంబరులో భారత ఆస్ట్రేలియాల మధ్య జరిగిన డేవిస్ కప్‌ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. నేడు ఆస్ట్రేలియా ఫైనల్ లో అద్భుతం సృష్టించాడు.

అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్ పేరిట ఉన్న రికార్డును బోపన్న బ్రేక్ చేశాడు. బ్రియాన్ 41 ఏళ్ల  76 రోజుల వయసు ఉన్నప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. అయితే రోహన్ బోపన్న మాత్రం.. 43 ఏళ్ల 329 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించి రికార్డు సృష్టించాడు.

ఈ సందర్భంగా బోపన్న మాట్లాడుతూ ఐదు నెలలు ఏ మ్యాచ్ లోనూ గెలవలేదు. ఇక నా పనైపోయింది, రిటైర్మెంట్ తప్పదని అనుకున్నాను. కానీ నాలో పట్టుదల ఆటలో కొనసాగేలా చేసింది. ఇప్పుడున్న జనరేషన్ తో పోటీ పడేందుకు తీవ్రంగా కష్టపడ్డాను. నా ఆటలో, జోడీలో ఎన్నో మార్పులు జరిగాయి. నాకొక అద్భుతమైన ఆస్ట్రేలియా భాగస్వామి దొరికాడు. తను లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు, థ్యాంక్యూ మ్యాటీ అని తెలిపాడు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×