EPAPER

Dharmavaram Assembly Constituency : ధర్మవరంలో దుమ్ముదులిపేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Dharmavaram Assembly Constituency : ధర్మవరంలో దుమ్ముదులిపేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Dharmavaram Assembly Constituency : ధర్మవరం.. సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌. శ్రమజీవుల కేంద్రం. సిల్క్ చీరల హబ్‌గా ఉన్న ఈ ప్రాంత చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు ఇక్కడి నేత కార్మికులు. ఈ నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయం, చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. 1955 నుంచి జనరల్‌ కేటగిరి కింద ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఆ తరువాత ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డిపై 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ.. కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం.. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ధర్మవరంలో నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు పరిటాల శ్రీరామ్‌ సై అంటున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో విజయం సాధించేది ఎవరు? ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉంది? నేతలకు కలిసి వచ్చే అంశాలేంటి? అన్న అంశాలపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (గెలుపు) vs గోనుగుంట్ల సూర్యనారాయణ


YCP 51%
TDP 44%
JANASENA 3%
OTHERS 2%

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఇక్కడ విక్టరీ సాధించారు. 51 శాతం ఓట్లు సాధించిన ఆయన.. టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15వేల 166 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. వెంకట్రామి రెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు.. ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్‌.. ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటోంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే కనిపించనుంది. అయితే సూర్యానారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరడం.. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్‌ సిద్ధమవడంతో ధర్మవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని బిగ్‌టీవీ సర్వే నిర్వహించింది. ఇప్పుడా వివరాలను చూద్దాం.

ముందుగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి నియోకవర్గంలో అనుకూలించే అంశాలేంటి? ప్రతికూలించే అంశాలేంటో చూద్దాం.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ( YCP)

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉండటం
  • గుడ్‌ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహించిన కార్యక్రమం
  • ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తీసుకునే చొరవ
  • క్యాడర్‌లో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేకపోవడం
  • సొంత నిధులతో చేపట్టిన పలు కార్యక్రమాలు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మైనస్ పాయింట్స్

  • ఇప్పటికీ పలు గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయకపోవడం
  • గ్రామీణ ప్రాంతాలను ఇంకా వెంటాడుతున్న డ్రైనేజి సమస్యలు

ఇవీ కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇప్పుడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ప్లస్‌ అండ్ మైనస్‌ పాయింట్స్‌ పరిశీలిద్దాం.

పరిటాల శ్రీరామ్‌(TDP)

పరిటాల శ్రీరామ్‌ ప్లస్ పాయింట్స్

  • కలిసిరానున్న పరిటాల కుటుంబం రాజకీయ కుటుంబ నేపథ్యం
  • చాలా ఏళ్లుగా నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ ఉండటం
  • సొంతంగా క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోవడంలో విజయం
  • పరిటాల శ్రీరామ్‌కు మద్ధతిచ్చే వారి సంఖ్య పెరగడం

పరిటాల శ్రీరామ్‌ మైనస్‌ పాయింట్స్

  • సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరుతారన్న ప్రచారం
  • సూర్యనారాయణ వర్గం మద్ధతివ్వకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో ధర్మవరం బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి vs పరిటాల శ్రీరామ్

YCP 44 %
TDP 41 %
OTHERS 15 %

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగితే వైసీపీకి గెలిచే అవకాశాలు 44 శాతం ఉందని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గ్రౌండ్‌ లెవల్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండటం.. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధితో ప్రజలు సంతృప్తిగా ఉండటం ఆయనకు బాగా కలిసి వస్తోంది. దీనికి తోడు వైసీపీకి ఈ నియోజకవర్గంలోనే సాంప్రదాయంగా పడే ఓట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్ పాజిటివ్ ఇమేజ్‌ ఆయన గెలుపు అవకాశాలను మరింత పెంచుతున్నాయి.

అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు 41 శాతం ఉన్నాయి. టీడీపీకి ఈ నియోజకవర్గంలో గట్టి క్యాడర్ ఉంది. పరిటాల శ్రీరామ్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచి నిలిచారు. దీనికి తోడు ఇటీవల జరిగిన అంగ్‌న్వాడీల సమ్మె కూడా టీడీపీకి కలిసి రానుంది. అయితే సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన టీడీపీ తరపున ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు వైసీపీకి మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన రెబల్‌గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలు ఉన్నాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

అదే సమయంలో జనసేన నేత చిలకం మధూసూదన్‌ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నా.. ఆయనకు టికెట్ దక్కకపోతే ఎంత వరకు ఆయన సపోర్ట్ చేస్తారన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటిని మధ్య కేతిరెడ్డికి కాస్త ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×