EPAPER

Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది.. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు.. అందుకు సీఎం జగన్ నో చెప్పేశారు .. దాంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తపడినట్టు కనిపిస్తున్నారు.. ఆ క్రమంలో మాగుంట తనదారి తాను చూసుకుంటానని అంటుండటంతో .. ఆయన అడుగులు ఎటు పడతాయనేది ఉత్కంఠ రేపుతోంది.

Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది.. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు.. అందుకు సీఎం జగన్ నో చెప్పేశారు .. దాంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తపడినట్టు కనిపిస్తున్నారు.. ఆ క్రమంలో మాగుంట తనదారి తాను చూసుకుంటానని అంటుండటంతో .. ఆయన అడుగులు ఎటు పడతాయనేది ఉత్కంఠ రేపుతోంది.


ప్రకాశం జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో.. పొలిటికల్ హిట్ పీక్ స్టేజ్‌కి చేరుతోంది .. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాగుంట కుటుంబంనికి వైసీసీ అధినేత జగన్ ఈ సారి భారీ షాక్ ఇచ్చారు .. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.. వైసీపీ టికెట్ దక్కదని తెలిసినాటి నుంచే మాగుంట.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారంట..

ప్రకాశం జిల్లాలోని వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి, జగన్‌కు స్వయానా బంధువైన బాలినేని శ్రీనివాసులరెడ్డి .. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంటనే అభ్యర్ధిగా ఉంచాలని పట్టుబడుతూ వచ్చారు .. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని.. తనది మాగుంట శ్రీనివాసులురెడ్డిది హిట్ కాంబినేషన్ అని.. ఇద్దరం బరిలో ఉంటే సునాయాసంగా గెలుస్తామని వాదించారు.. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయడం వల్లే.. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయానన్న అభిప్రాయం బాలినేనిలో ఉంది.


దానికి తగ్గట్లే తిరిగి 2019 ఎన్నికల నాటికి మాగుంట ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా రావడంతో వారి కాంబినేషన్ హిట్ కొట్టింది.. అందుకే ఈ సారి మాగుంట విషయంలో ఆయన అంత పట్టుబట్టి.. అనుకున్నది సాధించుకోవడానికి దాదాపు నెలరోజులకే పైగా హైదరాబాద్ వెళ్లిపోయారు .. అయితే తర్వాత పరిణామాలతో ఆయన మాగుంట విషయంలో మెత్తపడి.. పట్టువీడినట్లు కనిపిస్తున్నారు .. ఇప్పుడు మాగుంట విషయంలో బాలినేని వాయిస్ మారింది. దేవుడి ఆశీస్సులు ఉండి .. పరిస్థితులు సహకరిస్తే మళ్లీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి మాగుంట పోటీ చేస్తారంటున్నారు బాలినేని .. అంటే మాగుంట విషయంలో జగన్ అనుకులంగా లేరని చెప్పకనే చెప్పేశారు .

మొత్తానికి మాగుంట వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇటీవల ఒంగోలు పార్టమెంట్ పరిధిలోని కొండపి అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీవిస్తృతస్థాయి సమావేశం జరిగింది .. ఒంగోలులో ఉన్న ఎంపీ మాగుంటకు ఆ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వనం కూడా అందలేదంట.. మాగుంట స్థానంలోలో ఈ సారి ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా కొత్త ముఖాన్ని బరిలో దించే పనిలో ఉన్నారంట వైసీపీ పెద్దలు … గతంలో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఇక్కడకు తీసుకొస్తే.. బాలినేని సహకరించే పరిస్థితి లేకపోవడంతో .. కొత్త కేండెట్ కోసం వెతుకుతున్నారంట.

మాగుంట కుటుంబానికి సుధీర్ఘ రాజకీయ చరిత్రతో పాటు.. పార్లమెంట్ పరిధిలో మంచి పట్టు ఉంది.. అలాంటి మాగుంటను పక్కన పెట్టడం వెనుక.. జగన్ లెక్కలు జగన్‌కి ఉన్నాయంటున్నారు.. మాగుంటకు సీటు నిరాకరించడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు.. మాగుంట లిక్కర్ వ్యాపారంలో.. జగన్ వాటా అడిగారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను చెప్పినట్లు వినలేదని మాగుంటపై జగన్ అగ్రహంగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.. ఢీల్లి బీజేపీ నేతలు మాగుంటకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.. ఆ లెక్కలన్నీ తెలిసే .. మాగుంటకు టికెట్ కోసం పోరాడిన బాలినేని సైలెంట్ అయ్యారంట..

తాజాగా మాగుంట ఇంటికి వచ్చిన బాలినేని ఆయనతో రెండు గంటలపాటు భేటీ అయ్యారు.. ఈ భేటిలో ఆనేక ఆంశలు ప్రస్తవనకు వచ్చాయంట .. మాగుంటకు బాలినేని పరిస్థితి వివరించాలని చూసినా.. జగన్‌కు టికెట్ ఇవ్వడం ఇష్టం లేనప్పుడు.. మీరు ఏం చెయగల్గుతారు.. ఏం జరగాలో కాలమే నిర్ణయిందని మాగుంట అన్నారంట .. అందుకే మాగుంట ఇంటి నుంచి బయటకి వచ్చిన బాలినేని.. భోజనం చేయడానికి వచ్చానంటూ.. ఏం మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు.

మొత్తానికి మాగుంట..టీడీపీలోకి వెళ్లడానికి ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది .. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఒంగోలులో టీడీపీకి కూడా సరైన పార్లమెంట్ అభ్యర్ధి లేరు.. మాగుంట అయితే.. ఆర్ధికంగా సపర్ట్ తో పాటు పలు ఆంశాలు కలసి వస్తాయని టీడీపీ ఆలోచిస్తుందట .. 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాగుంట.. వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.. మళ్లీ ఇప్పుడు సైకిల్ ఎక్కటానికి అయ్యారు..

ఇటు వైసీపీ కూడా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్ధి కోసం వెతుకుతోందంట .. కాపు సామాజికవర్గం సమీకరణలపై కూడా సర్వేలు చేయిస్తున్నారంట .. ఈ సారి బాలినేని తన తనయుడు ప్రణిత్‌రెడ్డి ని రంగంలోకి దింపటానికి ప్లాన్ చేస్తునట్టు సమాచారం.. రెడ్డి వర్గంవైపే జగన్ మొగ్గుచూపితే బాలినేని , వైవీ కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే కనిగిరికి చెందిన పారిశ్రామికవేత్త చింతలచెరువు సత్యనాయరణ రెడ్డి కూడా టికెట్ రేసులో కనిపిస్తున్నారు ..

కాపుల వైపు మొగ్గుచూపితే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ బరిలోకి దిగే అవకాశం ఉందంటుననారు .. మద్దిశెట్టికి ఈ సారి సిట్టింగ్ స్థానం గల్లంతైంది… అందుకే ఆయన్ని కాపు కోటాలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తునట్లు టాక్ వినపడుతోంది .. మొత్తానికి మాగుంటను కాదనుకున్న వైసీపీ అధినేత .. అంతటి ధీటైన అభ్యర్ధి కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారిప్పుడు

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×