EPAPER

Magha Masam : మహిమగల మాసం.. మాఘం..!

Magha Masam : ‘మఘం’ అంటే యజ్ఞం. అందుకే యజ్ఞయాగాదులకు ఈ మాసం మంచిదని చెబుతారు. ఈ నెలలో చేసే మాఘ స్నానం అత్యంత ఉత్తమ ఫలితాన్నిస్తుందనేది పెద్దల మాట. ఇక మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉంటాయి. దీంతో ఈ నెలంతా పెళ్లిళ్ల సందడి, గృహప్రవేశాలతో హడావుడితో నడుస్తుంది. ఈ ఏడాది మాఘమాసం జనవరి 26 నుంచి ఫిబ్రవరి 24 వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో ఈ మాఘమాసంలో పాటించే విధి విధానాలు, జరుపుకునే పండుగల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

Magha Masam : మహిమగల మాసం.. మాఘం..!

Magha Masam : ‘మఘం’ అంటే యజ్ఞం. అందుకే యజ్ఞయాగాదులకు ఈ మాసం మంచిదని చెబుతారు. ఈ నెలలో చేసే మాఘ స్నానం అత్యంత ఉత్తమ ఫలితాన్నిస్తుందనేది పెద్దల మాట. ఇక మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉంటాయి. దీంతో ఈ నెలంతా పెళ్లిళ్ల సందడి, గృహప్రవేశాలతో హడావుడితో నడుస్తుంది. ఈ ఏడాది మాఘమాసం జనవరి 26 నుంచి ఫిబ్రవరి 24 వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో ఈ మాఘమాసంలో పాటించే విధి విధానాలు, జరుపుకునే పండుగల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.


మాఘమాసంలో ఉదయకాలంలో నది, చెరువు, మడుగు, కొలనులో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే ఒక పుణ్యస్నానం ఆరు సంవత్సరాల పుణ్యస్నానానికి సమానమని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం అత్యుత్తమ ఫలితాన్నిస్తుంది. ఈ మాసాన్ని కుంభమాసం అనీ అంటారు. చాలామంది ఈ నెలలో ముల్లంగి దుంపను తినరు. అలాగే.. ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినటం, నువ్వుల దానం చేయటం మంచిదనీ, ఈ మాసంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.

మాఘమాసపు శుక్ల పక్షంలో చవితి రోజును ‘తిల చతుర్థి’ అనీ, ‘కుంద చతుర్థి’ అనీ అంటారు. ఈ రోజున ఆహారంలో నువ్వులను తినటం, నువ్వుల లడ్లు చేసి పంచటం చేస్తారు. ఈ రోజున ‘డుంఢిరాజు’ కోసం వ్రతము పూజ చేస్తారు. ఈరోజున డుంఢిని పూజిస్తే.. దేవతలనందరినీ పూజించిన ఫలితం దక్కుతుందని కాశీ ఖండం చెబుతోంది. ఈరోజు పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగరణ చేస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని కాలదర్శనం చెబుతోంది.


ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని ‘శ్రీ పంచమి’ అంటారు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువుల నుంచి వాగ్దేవి అవతరించిన రోజు ఇదేనని పురాణ కథనం. విద్యార్థులు నేడు సరస్వతీ ఆరాధన చేయటం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అక్షరాభ్యాసాలకు ఇది అత్యత్తుమమైన రోజు.

ఇక మాఘశుద్ద సప్తమిని రథ సప్తమి, ‘సూర్య సప్తమి’ పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున సూర్యోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను, వాటిలో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు రకాల శాపాలు నశిస్తాయని చెబుతారు. సూర్యుడు శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చిన రోజుగా, హనుమంతుడు వ్యాకరణ శాస్త్రాన్ని యాజ్ఞవల్క్యునికి భోధించినదీ ఈ రోజే. ఈ రోజు స్నానానికి ముందు స్నానపు నీటిని చెరకుగడతో కదిలిస్తారు. నేడు చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో వండిన పాయసాన్ని చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేస్తే సంపద, మంచి ఆరోగ్యం చేకూరుతాయని చెబుతారు.

మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి రోజు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజు ఆయన నోటి నుంచి వెలువడిన విష్ణు సహస్ర నామాలను పారాయణ చేయటంతో బాటు పిడకల పొయ్యి మీద వండిన పాయసాన్ని ఆయనకు నివేదిస్తారు.

మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని ఉత్తరాది వారు ‘మహామాఘి’ అంటారు. ఈ రోజున చేసే సముద్ర లేదా నదీ స్నానం, చేసే మంత్రజపం, పొందే గురువు ఉపదేశం విశేష ఫలితాన్నిస్తాయి. రోజూ సూర్యోదయానికి ముందు స్నానం చెయ్యలేని వారు ఈ రోజునైనా చేయాలని చెబుతారు.

మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే పాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం, సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, అష్టమినాడు మంగళా వ్రతం చేస్తారు. ఈ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని, ఆ రోజే రామసేతు నిర్మాణం పూర్తి అయిందని చెబుతారు. మాఘ కృష్ణ చతుర్దశిని మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం నిర్వహిస్తారు.

Tags

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×