EPAPER

 KL Rahul : పరిస్థితులను బట్టి ఆడాలి.. గిల్‌ను వెనకేసుకొచ్చిన కేఎల్ రాహుల్..!

 KL Rahul : పరిస్థితులను బట్టి ఆడాలి.. గిల్‌ను వెనకేసుకొచ్చిన కేఎల్ రాహుల్..!
KL Rahul

KL Rahul : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో శుభ్ మన్ గిల్ అవుట్ అయిన తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లు కూడా సీరియస్ అయ్యారు. వైట్ బాల్ కి రెడ్ బాల్ కి మధ్య తేడాని గిల్ గమనించాలని  పలు సూచనలు చేశారు. ఈ విషయంపై కేఎల్ రాహుల్ స్పందించాడు. గిల్ కి మద్దతుగా నిలిచాడు.


ప్రతీ క్రికెటర్ కి ఒక గడ్డు కాలం ఉంటుంది. ఫామ్ అందుకోవడానికి చాలా తంటాలు పడుతుంటారని తెలిపాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయని అందరూ గమనించాలని అన్నాడు. తను మొదటిరోజు చివరి సెషన్ లో బ్యాటింగ్ కి వచ్చాడు. అప్పుడు వికెట్టు పడకుండా ఆడాల్సి ఉంటుంది. అలాగే రెండోరోజు ఉదయం బ్యాటింగ్ చేశాడు. ఈ రెండు సమయాలు టెస్ట్ మ్యాచ్ ల్లో చాలా క్లిష్టమైనవని అన్నాడు.

అలాగే ఉదయమే పిచ్ పై తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకని బాల్ బాగా స్వింగ్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో డిఫెన్స్ చేసుకుంటూ ఆటని ముందుకు నడిపించాల్సి ఉంటుందని అన్నాడు. తను వైట్ బాల్ తో ఎంత గొప్పగా ఆడాడో అందరికీ తెలిసిందేనని అన్నాడు.


అంతసేపు డిఫెన్స్ ఆడి, ఇక స్ట్రయిక్ రేట్ రొటేట్ చేద్దామనుకునే సమయంలో గిల్ అవుట్ అయ్యాడని తెలిపాడు. ముఖ్యంగా డిఫెండ్ సంకెళ్లను తెంచుకోవడానికి గిల్ షాట్‌కు యత్నించాడు, కానీ సరైన ఫలితం రాలేదని అన్నాడు.   గిల్ టాప్ క్లాస్ క్రికెటర్. అతడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆడాలనే అంశంపై తను స్పష్టంగా ఉన్నాడని తెలిపాడు.

సీనియర్స్ కూడా ఒకప్పటి క్రికెటర్లే కాబట్టి, ఒక గొప్ప ఆటగాడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే సపోర్టుగా నిలవాలికానీ, సీరియస్ కాకూడదని కొందరు సూచిస్తున్నారు. గిల్ ఒక్కడే కాదు, ఏ క్రికెటర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టేలా కామెంట్లు చేయకూడదని అంటున్నారు.

ఇప్పుడెలా ఆడాలి? ఎలా తిరిగి ఫామ్ లోకి రావాలి? అనే కోణంలో గిల్ ఆలోచిస్తా ఉంటాడు. ఈ సమయంలో నెటిజన్ల దగ్గర నుంచి  అందరూ దాడిచేస్తే, మరింత ఆత్మనూన్యతా భావంలోకి వెళ్లిపోతాడని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×