EPAPER

Srikalahasti Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. శ్రీకాళహస్తిలో అతని అడ్డానేనా..?

Srikalahasti Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. శ్రీకాళహస్తిలో అతని అడ్డానేనా..?
Srikalahasti Assembly Constituency

Srikalahasti Assembly Constituency : ఏపీ రాజకీయాల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడి పురాతన శివాలయంలో వాయులింగం కొలువై ఉంది. పక్కనే స్వర్ణముఖి నది, పంచభూత లింగాల్లో ఒకటిగా ఉన్న వాయులింగం ఉన్న చారిత్రక దివ్య ప్రాంతమిది. ఈ ఆలయం దక్షణ కైలాసంగా, రాహు కేతు క్షేత్రంగా ప్రాధాన్యతం సంతరించుకుంది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం టీడీపీ అడ్డాగా మారింది. బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి వరుస విజయాలను సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో సమరానికి సై అంటోంది. ఈసారి ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

బియ్యపు మధుసూదన్ రెడ్డి VS బొజ్జల సుధీర్ రెడ్డి


YCP 56%
TDP 36%
JSP 3%
OTHERS 5%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో వైసీపీకి 56 శాతం ఓట్లు లభించాయి. టీడీపీకి 36 శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 3 శాతం ఓట్లు లభించాయి. ఇతరులు 5 శాతం ఓట్లు రాబట్టుకున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

బియ్యపు మధుసూదన్ రెడ్డి (YCP)

బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • నవరత్నాల స్కీంపై గెలుపు ఆశలు
  • నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం
  • సహాయం కోసం వచ్చిన వారికి ఆర్థిక సహాయాలు
  • స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్

బియ్యపు మధుసూదన్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • గ్రామీణ ప్రాంతాల్లో దారుణ స్థితిలో రోడ్లు
  • డ్రైనేజ్ వ్యవస్థ సరిగా మెయింటేన్ చేయకపోవడం
  • అభివృద్ధి పనుల్లో జాప్యం
  • ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం

బొజ్జల సుధీర్ రెడ్డి (TDP)

బొజ్జల సుధీర్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • తండ్రి రాజకీయ వారసత్వం
  • ప్రభుత్వ విధానాలపై అలుపెరగని పోరాటం

బొజ్జల సుధీర్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోవడం
  • కేసులు పెట్టి వేధిస్తుండడంతో చాలా మంది దూరం
  • గత ఏడాదిన్నర నుంచే యాక్టివేట్

వినీత నాగారం (JSP)

వినీత నాగారం ప్లస్ పాయింట్స్

  • శ్రీకాళహస్తి సెగ్మెంట్ క్రియాశీల పాత్ర
  • గత ఎన్నికల్లో ఓడినా అందరికీ అందుబాటులో ఉండడం
  • ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టుదల
  • క్యాడర్ మద్దతు బలంగా ఉండడం

వినీత నాగారం మైనస్ పాయింట్స్

  • టీడీపీతో పొత్తులో భాగంగా టిక్కెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడం

కుల సమీకరణాలు

వన్నెకుల క్షత్రియ 30%
ఎస్సీ 23%
బలిజ 15%
యాదవ్ 13 %
కమ్మ 11%

శ్రీకాళహస్తిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం డామినెంట్ గా ఉంది. ఈ వర్గానికి చెందిన వారిలో 50 శాతం మంది వైఎస్ఆర్ సీపీకి, 45 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు ఎస్సీల్లో 60 శాతం మంది జగన్ పార్టీకి, 35 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. బలిజ వర్గంలో 35 శాతం మంది వైసీపీకి, 60 శాతం మంది టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతిస్తామని చెబుతున్నారు. అటు యాదవుల్లో 45 శాతం వైసీపీకి, 45 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. కమ్మ కమ్యూనిటీలో 35 శాతం వైసీపీకి, 60 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

బియ్యపు మధుసూదన్ రెడ్డి VS బొజ్జల సుధీర్ రెడ్డి

YCP 47%
TDP 46%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాళ హస్తిలో వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 47 శాతం ఓట్లు, టీడీపీకి 46 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయం వ్యవస్థ, స్కీమ్స్ అమలు ఈ సెగ్మెంట్ లో వైసీపీ వైపు జనం ఆకర్షితులయ్యేలా చేస్తున్నట్లు సర్వేలో తేలింది. బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో పాటు స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా పని చేస్తున్నాయి.

బియ్యపు మధుసూదన్ రెడ్డి VS వినీత నాగారం

YCP 46%
JSP 45%
OTHERS 9%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిపై జనసేన నుంచి వినీత పోటీలో ఉన్నా… వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ 46 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలున్నాయి. జనసేన అభ్యర్థి వినీతకు 45 శాతం ఓట్ షేర్ రావడానికి ఆమె గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉండడమే అని వెల్లడైంది. ఒకవేళ పక్కనే ఉండే తిరుపతి సెగ్మెంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తే… ఆ ప్రభావం శ్రీకాళహస్తి సెగ్మెంట్ లో జనసేనకు ప్లస్ అవుతుందన్న అంచనాలున్నాయి.

.

.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×