EPAPER

Chandrababu : టీడీపీ- జనసేనదే అధికారం.. వైసీపీ జెండా పీకడం ఖాయం..

Chandrababu : ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని ఆయన విమర్శించారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థతి లేదని బాబు ఎద్దేవా చేశారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. ప్రజలు జగన్ పై ఉన్న కోపాన్ని ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలన్నారు. రాబోయే యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్నారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే అవుతుందని బాబు జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలన్నారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అన్నారు. అభివృద్ది చేస్తానని కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. జగన్ అబద్ధాల్లో పీహెచ్‌డీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అన్నారు. అలాంటి జలగ రాష్ట్రానికి అవసరమా? అని చంద్రాబు ప్రజలను ప్రశ్నించారు.

Tags

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×