EPAPER

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Parenting Tips : మనలో ఎవరైనా మన పిల్లలు పెద్దయ్యాక జెంటిల్‌మెన్‌లా ఉండాలని అనుకుంటాం. మరి మీకు తెలుసుగా జెంటిల్‌మెన్ అంటే వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తారు. ఇతరులను ముందుకు నడిపిస్తూ తాను కూడా ఎదుగుతారు. ఇతరులు ఇబ్బందిపడేలా ప్రవర్తించరు. లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉండేవారికి విలువనిస్తారు. పిల్లలు ఇలానే ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మీ పిల్లాడు పెద్దయ్యాక జెంటిల్మెన్‌లా మారాలంటే కొన్ని పనులు చేయాలి.


తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్‌గా నిలవాలి. మీరు ఇంట్లో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో మీ పిల్లలు కూడా అలానే ఉంటారు. మీరు చేసే పనులే పెద్దయ్యాక మీ పిల్లలు చేస్తారు. కాబట్టి మీ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉండాలని అనుకుంటున్నారో మీరు పిల్లలు ముందు అలానే ఉండండి. గౌరవం, మర్యాద, దయ కలిగి ఉండండి. ప్రతి ఒక్కరిని గౌరవించండి. ముఖ్యంగా మర్యాదకపూర్వమైన బాషను కలిగి ఉండండి. మీ పిల్లలు వీటిని నేర్చుకుంటారు.పెద్దయ్యాక కచ్చితంగా వీటిని ఫాలో అవుతారు.

మీ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించేలా అలవాటు చేయండి. డబ్బు గురంచి వారి ముందు మాట్లాడాకండి. పేద, ధనిక వంటి అభిప్రాయాలు వారిలో నాటకండి. మాట్లాడుతున్నప్పుడు వినడం అనేది వారికి నేర్పండి. ప్రతి పనిలోనూ క్లీన్‌గా ఉండాలి. ఇతరులకు మర్యాదనివ్వాలి.సమయపాలన పాటించాలి. మీరు ఇటువంటివి పాటించండి. ఎవరైనా ఇంటికి వస్తే నవ్వుతూ పలకరించండి. ఇది మీ పిల్లలకు కూడా నేర్పించండి.


చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పనిచెప్పడం ఇష్టపడరు. ఇదే ప్రేమ అంటారు. మీ ప్రేమతో వారిని చేతకాని వారిగా మార్చకండి. మీ పిల్లలకు వయసుకు తగ్గా పనులు చెప్పండి. చిన్నప్పుడు పిల్లలు ఎంత బాధ్యతగా ఉంటారో.. పెద్దయ్యాక అదేవిధంగా ఉంటారు.ఇంట్లో వస్తువులను, పుస్తకాలను సద్దడం,తల్లిదండ్రులకు సహాయం చేయడం వారికి నేర్పించండి. ఇది వారికి జీవిత నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఇతరులకు సహాయపడటం వారికి నేర్పించండి.

పిల్లలను భావోద్వేగాల పరంగా ధృడంగా మార్చండి. పిల్లల ముందు తప్పుగా మాట్లాడటం, ఏడవటం చేయకండి. వారు మానసికంగా బలంగా ఉండేలా చేయడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. జీవితంలో నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించండి. ఇతరులను కష్టపెట్టకూడదని చెప్పండి. ఈ లక్షణాలను మీ పిల్లలకు చిన్నప్పుడే అలవాటు చేస్తే పెద్దయ్యాక కచ్చితంగా జెంటిల్‌మెన్ అవుతారు.

Tags

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×