EPAPER

Bobbili Assembly Constituency : బొబ్బిలి యుద్ధంలో సింహాసనం దక్కేదెవరికి.. బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Bobbili Assembly Constituency : బొబ్బిలి యుద్ధంలో సింహాసనం దక్కేదెవరికి.. బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
Political news in ap

Bobbili Assembly Constituency(Political news in AP):

ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి బొబ్బిలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఉత్తరాంధ్రలో చదవుల్లో మేటి బొబ్బిలి. బొబ్బిలి యుద్ధానికి దేశ వ్యాప్త ప్రాముఖ్యత ఉంది. బొబ్బిలి చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. వీణల తయారీ కేంద్రంగానూ ఈ ప్రాంతం ప్రాముఖ్యత సాధించింది. బొబ్బిలి వీణ అంటే గుర్తు పట్టని వారుండరు. బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా అధికమే. పార్టీలతో పాటు వ్యక్తుల సొంత ఇమేజ్ తో గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజక వర్గంలో మూడుసార్లు గెలుపొందింది. ఎక్కువ సార్లు కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఈసారి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

వెంకట చిన అప్పల నాయుడు VS సుజయకృష్ణ రంగారావు


YCP 48%
TDP 44%
JSP 2%
OTHERS 6%

2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ మంచి మార్జిన్ తో గెలిచింది. ఇక్కడ వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసిన వెంకట చిన్న అప్పల నాయుడు… రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్ తో 48 శాతం ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుకు 44 శాతం ఓట్లు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి 2 శాతం ఓట్లు రాగా… ఇతరులకు 6 శాతం ఓట్లు లభించాయి. మరి ఈసారి ఎన్నికల్లో బొబ్బిలి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు (YCP)

సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు ప్లస్ పాయింట్స్

  • హాస్పిటల్స్ లో వసతులు పెంచడం
  • జగన్ వేవ్ పైనే నమ్మకం

సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు మైనస్ పాయింట్స్

  • బొబ్బిలి సెగ్మెంట్ లో రోడ్లు అధ్వాన్నం
  • డ్రైనేజ్ సమస్యలు అలాగే ఉండడం
  • లిక్కర్ బ్యాన్ అమలు చేయకపోవడం
  • మజ్జి శ్రీనివాసరావుతో వర్గ విబేధాలు

బేబి నాయన (వెంకట చలపతి రంగారావు) (TDP)

బేబి నాయన (వెంకట చలపతి రంగారావు) ప్లస్ పాయింట్స్

  • బొబ్బిలి రాజ కుటుంబ నేపథ్యం
  • ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకం
  • కరోనా టైంలో చేసిన సేవలపై జనంలో పాజిటివ్ ఒపీనియన్
  • గ్రామాల్లో జోరుగా పర్యటనలు

బేబి నాయన (వెంకట చలపతి రంగారావు) మైనస్ పాయింట్స్

  • లేటుగా రంగంలోకి దిగడం

కుల సమీకరణాలు

కాపు వెలమ 36%
తూర్పు కాపు 18%
ఎస్సీ 14 %
యాదవులు 9%
ఎస్టీ 6%

బొబ్బిలి నియోజకవర్గంలో కాపు వెలమ కమ్యూనిటీ బలంగా కనిపిస్తోంది. వీరిలో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు తూర్పు కాపుల్లో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామంటున్నారు. ఇక ఎస్సీల్లో 50 శాతం జగన్ పార్టీకి జై కొడుతుండగా, 45 శాతం మంది టీడీపీకి, 5 శాతం ఇతరులకు అండగా ఉంటామంటున్నారు. అటు యాదవ కమ్యూనిటీలో 40 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో వెల్లడించారు. ఇక ఎస్టీల్లో 45 శాతం ఫ్యాన్ పార్టీకి, 50 శాతం సైకిల్ పార్టీకి, 5 శాతం ఇతరులకు అండగా ఉంటామని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు VS బేబి నాయన రావు

YCP 42%
TDP 53%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బొబ్బిలిలో టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బేబి నాయన 53 శాతం ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 5 శాతం ఓట్లు రానున్నట్లు సర్వేలో వెల్లడైంది. టీడీపీ ఓట్ షేర్ ఎక్కువగా ఉండడానికి కారణం బేబీ నైనారావు పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ ఒక కారణం. అలాగే టీడీపీ సంప్రదాయ ఓట్లన్నీ పడుతుండడం, పైగా ప్రభుత్వంపై ఉన్న సహజ వ్యతిరేకత అంతా టీడీపీ అభ్యర్థికి ప్లస్ అయ్యే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక వైసీపీకి వచ్చే ఓట్ షేర్ కు ప్రధాన కారణం.. ప్రభుత్వ స్కీంల ద్వారా లబ్దిపొందుతున్న ప్రజలు ఓటు వేయాలని డిసైడ్ అవడమే. ఇదొక పాజిటివ్ ఇంపాక్ట్ గా మారుతోంది.

.

.

Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×