EPAPER

Addanki Politics : వైసీపీ బెదిరింపు పాలిటిక్స్.. చెప్పిన మాట వింటే మైన్స్.. లేదంటే రైడ్స్..!

Addanki Politics : వైసీపీ బెదిరింపు పాలిటిక్స్.. చెప్పిన మాట వింటే మైన్స్.. లేదంటే రైడ్స్..!
Addanki Politics

Addanki Politics(Andhra pradesh political news today):

నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మార్పుతో వచ్చిన గ్యాప్‌.. ఏకంగా వ్యాపార లావాదేవీల్లోకి వెళ్లింది. నయానో.. భయానో.. తమవైపు తిప్పుకోవాలనుకున్న వైసీపీ అధిష్టానం ప్లాన్‌.. వర్కౌట్‌ అవుతుందా.. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోశానని చెబుతున్న నేత.. సొంత పార్టీలో కొనసాగుతారా లేక జంప్ చేస్తారా.. బాలినేని రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతారా. అద్దంకిలో మైన్స్‌పై జరుగుతున్న రైడ్స్‌.. రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి.


నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్య రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ విధేయుడు అంటూ పేరు తెచ్చుకున్న చైతన్యకు ఇటీవల వరుసగా షాక్‌లపై షాకులు తగులుతున్నాయి. అద్దంకి వైసీపీ ఇంఛార్జ్‌గా ఆయన్ను తప్పించి.. ఆ స్థానంలో పాణెం చిన్నహనిమిరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా అధిష్టానం ప్రకటించింది. దీనిపై కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అద్దంకిలో తానే పోటీ చేస్తానని అనుచరులకూ చెప్పారు. ఆ టైమ్‌లో కృష్ణ చైతన్యకు.. CMO నుంచి పిలుపు వచ్చింది. ప్రత్యేకంగా సమావేశాలు వద్దని హెచ్చరించింది. అయినా హనిమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు కృష్ణచైతన్య విముఖత చూపారు. దీంతో సీన్‌ ఒక్కసారిగా మారింది.

నియోజకవర్గంలో మళ్లీ సర్వే చేయించి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే సీటు కేటాయించాలని కృష్ణ చైతన్య అధిష్ఠానాన్ని కోరారు. దీనికి అంగీకరించని వైసీపీ అధిష్టానం.. నూతన ఇన్‌ఛార్జ్‌ హనిమిరెడ్డితో కలసి పనిచేయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో బాచిన వర్గం వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసింది. వైసీపీ కీలక పదవిలో ఉన్న అట్లా చిన్న వెంకటరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటితో కలసి తన మధ్ధతు తెలిపారు.. అట్లా చిన్నవెంకట రెడ్డితో పాటు కొంతమంది సర్పంచులు, ఎంపీటిసీలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు. అట్లా వెంకటరెడ్డి వర్గం టీడీపీ టచ్ లోకి వెళ్లటం అద్దంకిలో వైసీపీకి షాక్ అని చెప్పొచ్చు. దీంతో ఎలాగైనా కృష్ణచైతన్యను తమ బాటలోకి తెచ్చుకోవాలని వైసీపీ అధిష్టానం భావించింది.


కృష్ణచైతన్య పూర్తిగా టీడీపీ టచ్‌లోకి వెళ్లారని.. ఆ పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. వస్తున్న ప్రచారాల నేపథ్యంలో బల్లికురవ మండలం మల్లాయపాలెంలో కృష్ణచైతన్యకు చెందిన ఆర్ణ స్టోన్స్‌ గ్రానైట్‌ క్వారీలో మైనింగ్‌ శాఖ తనీఖీలు చేయడం కలకలం రేపింది. అక్కడ అధికారులు వ్యవహరించిన తీరుతో ఆందోళన చెందుతున్నారు కృష్ణ చైతన్య. ఇన్నాళ్లూ జరగని రైడ్స్ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణ చైతన్య వర్గీయులను భయపెట్టి.. బెదిరించి.. తమ వైపు తిప్పుకునేందుకే తనిఖీల కొరడా తీశారనే అభిప్రాయం బాచిన వర్గంలో వ్యక్తమవుతోంది. బాచిన మద్దతుదారులైన సహకార సొసైటీ ఇన్‌ఛార్జులు.. నూతన ఇన్‌ఛార్జ్‌ హనిమి రెడ్డి మాట వినకపోతే.. సొసైటీల లావాదేవీలపై విచారణ చేయిస్తామని హెచ్చరిక చెసినట్లు బాచిన వర్గం ఆరోపిస్తుంది. 14 నెలలుగా క్వారీలో కనిపించని తప్పులు.. ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయంటూ కృష్ణచైతన్య మద్దతుదారులు నిలదీస్తున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారాలను దెబ్బతీసి బాచిన కృష్ణ చైతన్య వర్గంని దారికి తెచ్చుకోవాలని నూతన ఇన్‌ఛార్జ్‌ కుట్రపడుతున్నరని బాచిన వర్గం ఆరోపిస్తోంది.

కృష్ణ చైతన్యకు సంబందించిన గ్రానెట్ క్వారీలపై దాడులు తరువాత.. క్వారీలో ఎలాంటి అక్రమాలు జరిగాయో.. అధికారులు చెప్పలేదు. ప్రస్తుతానికి రాళ్లు తవ్వాడానికి వీలు లేదంటూ క్వారీకి నోటీసులు అంటించారు. జరుగుతున్న పరిణామాలపై బాచిన చైతన్య.. వైసీపీ కీలకనేతైన బాలినేని శ్రీనివాసరెడ్డిని కలసి.. తన గోడు వెల్లబుచ్చారు. YCP ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మెసిన తమ కుటుంబాన్ని.. రాజకీయాల కోసం ఎవరి కోసమే పక్కన పెట్టడం బాగా లేదంటూ బాలినేని వద్ద కృష్ణచైతన్య ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి పరిస్థితులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని.. బాచినకు.. బాలినేని చెప్పినట్లు సమాచారం. తొలుత వైవీ సుబ్బారెడ్డి వర్గంగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య.. బాలినేని వర్గంలోకి వచ్చారు. కొన్ని నెలలుగా ఆయనకు వైవీతో మాటల్లేవు. బాలినేనికి, వైవీకి మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు ఎఫెక్ట్.. కృష్ణచైతన్యపై పడిందన్న చర్చ అద్దంకిలో జోరుగా జరుగుతోంది.

వైవీ సుబ్బారెడ్డి అదును చూసి తనపై కక్షసాధింపునకు దిగారంటూ కృష్ణ చైతన్య వర్గం ఆరోపిస్తోంది. బాలినేనితో భేటి అనంతరం చైతన్య.. వైవీ సుబ్బారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నుంచి స్పష్టమైన హమీ రాకపోతే… దర్శి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు బాచిన వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. TDPలో వర్కట్ కాకపోతే కాంగ్రెస్ నుంచి అద్దంకి బరిలో దిగేందుకు రంగం సిద్దం చేసుకుంటునట్లు టాక్. కృష్ణచైతన్య ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. YCP కి అది గండంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

అందుకే.. బాచినను కూల్ చేసేందుకు వైసీపీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఆయన ఉంటే అద్దంకిలో తమ జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఆలోచిస్తోంది. ఇప్పుడు బాచిన ఏం చేయబోతున్నారన్న దానిపైనే అద్దంకిలో రిజల్ట్స్‌ను డిసైడ్ చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది. అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని కూడా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి.. చివరకు సక్సెస్ కాలేకపోయిన జగన్‌.. బాచిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గొట్టిపాటితో చెట్టాపట్టాల్ వేసుకుంటున్న కృష్ణచైతన్య పార్టీ మారే అవకాశం ఉందా.. లేదా అనేది త్వరలోనే తేలనుంది.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×