EPAPER

Seven Players Padma Awards : ఏడుగురు క్రీడాకారులకు.. పద్మశ్రీ అవార్డు..

Seven Players Padma Awards : ఏడుగురు క్రీడాకారులకు.. పద్మశ్రీ అవార్డు..
Seven Players Padma Awards

Seven Players Padma Awards : రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఈసారి ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిలో టెన్నీస్ స్టార్ బోపన్న, అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప, సతేంద్ర లోహియా (స్విమ్మింగ్ ),  హర్బీందర్ సింగ్ ( హాకీ), గౌరవ్ ఖన్నా ( బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే ( మల్లఖంబ, జిమ్నాస్టిక్స్ లాంటి ఆట) వీరందరూ పద్మశ్రీ అవార్డులు సాధించారు.


43 ఏళ్ల బోపన్న..

43 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్ లో కెనడా పార్టనర్ గాబ్రియేలా తో కలిసి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఓ డబుల్స్, ఓ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం గెలిచాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 43 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ర్యాంకుకి చేరుకున్న తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు.


 37 ఏళ్ల  స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న

 37 ఏళ్ల  స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లో పలు పతకాలను గెలిచింది. 2022లో స్వర్ణం సాధించింది. అంతేకాదు డబుల్స్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో నాలుగు పతకాలను గెలుచుకుంది.

36 ఏళ్ల సత్యేంద్ర సింగ్ లోహియా…

36 ఏళ్ల సత్యేంద్ర సింగ్ లోహియా వికలాంగ క్రీడాకారుడు. 2018 సంవత్సరంలో స్విమ్మింగ్ రిలే టీమ్‌లో భాగంగా ఇంగ్లీష్ ఛానల్‌ను దాటాడు. భారతదేశం నుండి మొదటిసారి నలుగురు పారా స్విమ్మర్లు ఇంగ్లీష్ ఛానల్‌ను దాటారు. సత్యేంద్ర సింగ్ 12 గంటల 26 నిమిషాల్లో ఛానెల్‌ని పూర్తి చేసి, సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

47 ఏళ్ల పూర్ణిమ మహతో
పూర్ణిమ మహతో భారతీయ ఆర్చర్, ఇంకా  కోచ్ గా కూడా చేసింది.  1998 కామన్వెల్త్ క్రీడలలో రజత పతకాన్ని గెలిచింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ జట్టుకు కోచ్‌గా ఉంది.  2013లో  ద్రోణాచార్య అవార్డు లభించింది.

భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులలో పద్మశ్రీ అవార్డు నాల్గవది. మొదట భారత రత్న, తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మ భూషణ్, ఆ తర్వాత పద్మశీ అవార్డు ప్రత్యేకతను పొందింది. 2024 సంవత్సరంలో 110 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. అందులో ఏడుగురు క్రీడాకారులు ఉన్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×