EPAPER

Twitter : ఉద్యోగాలే కాదు.. జీవితాలే తలకిందులు..

Twitter : ఉద్యోగాలే కాదు.. జీవితాలే తలకిందులు..

Twitter : ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సంస్థను కొన్నాక మస్క్ తీసేసిన 50 శాతం మంది ఉద్యోగుల్లో… 300 మందికి పైగా H1-B వీసా హోల్డర్లే ఉన్నారు. దాంతో… 2 నెలల్లో కొత్త జాబ్ వెతుక్కోకపోయినా… అమెరికన్ సంస్థల స్పాన్సర్‌షిప్‌ పొందకపోయినా… అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటంతో… ఆ 300 మందికి పైగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ డేటా ప్రకారం.. అమెరికన్‌ వర్క్‌ వీసాలైన H1-B, L-1 ఉన్నవాళ్లు ట్విటర్‌లో పనిచేస్తున్నారు. వారిలో చాలా మందిని మస్క్ తొలగించాడు. వారి వీసాలకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. కానీ… సాధారణంగా అమెరికాలో H1-B వీసా ఉన్న ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోతే… మరో సంస్థలో ఉద్యోగం పొందేందుకు 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ మాత్రమే ఉంటుంది. ఆలోపు వారికి అమెరికాలో మరో ఉద్యోగం దొరక్కపోతే… అగ్రరాజ్య చట్టాల ప్రకారం ఆ దేశంలో నివసించేందుకు అనర్హులుగా పరిణగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో మరో ఉద్యోగం దొరక్కపోయినా… స్పాన్సర్‌షిప్ రాకపోయినా… అలాంటి వాళ్లంతా అమెరికాను వీడి స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. మళ్లీ స్వస్థలం నుంచి అమెరికాలో జాబ్ కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

ఇక L-1 అంటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. విదేశాల్లో బ్రాంచ్ లు పెట్టిన ఏదైనా అమెరికా కంపెనీ… స్వదేశంలో ఉన్న తమ కంపెనీకి డైరెక్టర్లు లేదా మేనేజర్లను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఈ వీసా జారీ చేస్తారు. దీనిపై ఉద్యోగం చేసేవాళ్లు… జాబ్ కోల్పోతే వెంటనే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్ తొలగించిన ఉద్యోగుల్లో L-1 వీసా మీద పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉండటంతో… వాళ్ల భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×