EPAPER

Virginity : కన్నెపొర అంటే ఏమిటి..? అమ్మాయి కన్య కాదని గుర్తించొచ్చా..!

Virginity : ఒక అమ్మాయి మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కన్నెపొర (హైమెన్) చిట్లి రక్తస్రావం అవుతుందని. అలా రక్తస్రావం జరగడం వల్ల ఆ అమ్మాయి కన్యత్వం కోల్పోయినట్లని మనలో చాలా మంది భావిస్తుంటారు. శోభనపు రాత్రి అమ్మాయి ధరించిన చీరకు లేదా మంచంపై వేసిన వైట్‌బెడ్ షీట్‌కు రక్తపు మరకలు ఉంటే ఆ స్త్రీ కన్యగా నమ్ముతారు.

Virginity : కన్నెపొర అంటే ఏమిటి..? అమ్మాయి కన్య కాదని గుర్తించొచ్చా..!

Virginity : ఒక అమ్మాయి మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కన్నెపొర (హైమెన్) చిట్లి రక్తస్రావం అవుతుందని. అలా రక్తస్రావం జరగడం వల్ల ఆ అమ్మాయి కన్యత్వం కోల్పోయినట్లని మనలో చాలా మంది భావిస్తుంటారు. శోభనపు రాత్రి అమ్మాయి ధరించిన చీరకు లేదా మంచంపై వేసిన వైట్‌బెడ్ షీట్‌కు రక్తపు మరకలు ఉంటే ఆ స్త్రీ కన్యగా నమ్ముతారు.


కానీ చాలా మంది అమ్మాయిలకు మొదటి సెక్స్ తర్వాత రక్తస్రావం జరగదు. ఇలా జరగకపోవడం చాలా మంది అవమానంగా భావిస్తారు.శృంగారం తరువాత హైమెన్ (కన్నెపొర)లో మార్పులు రావని వైద్యశాస్త్రం వందేళ్ల కిందటే గుర్తంచింది. అయితే ఈ కన్నెపొర చుట్టూ ఉన్న అపోహల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేటికి కూడా టీవీలు, పుస్తకాలలో అమ్మాయి తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కన్నెపొర చిట్లుతుందని, అమ్మాయి కన్యత్వాన్ని దీని ద్వారా నిర్ధారించొచ్చని చాలా మంది చెబుతున్నారు. అమ్మాయికి కన్నెపొర ఉందో లేదో తెలుసుకునే యోనొ టెస్ట్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి నిషేధించాయి.


కన్నెపొర అంటే..?

యోని ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొరనే హైమెన్ (కన్నెపొర) అంటారు. దీని ఆకారం రబ్బరు బాండ్‌ను లేదా నెలవంకను పోలి ఉంటుంది. మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది. ఇది ఒక హైపర్‌లాస్టిక్ నిర్మాణం. ఈ నిర్మాణం పురుషాంగం దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఇది మూసి ఉన్న పొరకాదు. అవసరం అయినప్పుడు విడిపోతుంది. శృంగారం సమయంలో హైమెన్ (కన్నెపొర) ఓపెన్‌గా ఉంటుంది. ఒకవేళ సాధారణంగా ఉంటే రుతుస్రావం జరగదు. అంగప్రవేశం కూడా జరగదు.

కన్నెపొరలో శృంగారం ముందు, శృంగారం తర్వాత ఎలాంటి మార్పులు ఉండవు. అమ్మాయి శృంగారంలో పాల్గొన్నదా లేదని కన్నెపొర మార్పులు ద్వారా చెప్పలేము. 1906 జరిపిన టోరాన్ అనే శాస్త్రవేత్త సెక్స్ వర్కర్ల యోనిలను పరిశీలించారు.శృంగారంలో పాల్గోని వారిలో హైమెన్ (కన్నెపొర) ఏ రూపంలో ఉందో.. సెక్స్ వర్కర్ల హైమన్ అదే రూపంలో కనిపించింది. అలానే 2004లో నిర్వహించిన మరో పరిశోధనలో 36 మంది గర్భిణులను పరిశీలించగా హైమెన్ (కన్నెపొర)లో ఎటువంటి మార్పులేదు.

సెక్స్ వల్ల యోని లోపలి చర్మానికి రక్తస్రావం అవుతుంది. అంతేతప్ప కన్నెపొర చిరగడం వల్ల కాదు. హైమెన్ ( కన్నెపొర) అనేది తక్కువ వాస్కులరైజేషన్ ఉన్న కణజాలం. దీనికి గాయమైనా త్వరగా కోలుకుంటుంది. సైకిల్ తొక్కడం వల్ల కన్నెపొరలు చిరిగిపోతాయనే దానిలో వాస్తవం లేదు. ఎందుకంటే కన్నెపొర అనేది యోని లోపల ఉంటుంది.

కన్నెపొర గురించి అపోహలు తొలగించడం చాలా ముఖ్యమని టోరాన్ చెబుతున్నారు. ఒక మహిళ.. తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, తనపై బలవంతంగా శృంగారం జరిగిందని వస్తే ముందు ఆ అమ్మాయి యోనని పరీక్షిస్తున్నారు. కన్నెపొరలో ఎటువంటి మార్పులు లేకుంటే అమ్మాయి శృంగారంకు గురైనట్లు కాదా అని టోరాన్ ప్రశ్నిస్తున్నారు. మనం ఒక అమ్మాయి కన్యా కాదా అన్న దాని గురించి అలోచించన చేయకుండా ఉండటం మన ముందున్న ముఖ్య లక్ష్యమని టొరాన్ అంటున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×