EPAPER

Rayachoti Assembly Constituency : రాయచోటిలో రాజెవరు..? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది..?

Rayachoti Assembly Constituency : రాయచోటిలో రాజెవరు..? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది..?

Rayachoti Assembly Constituency : రాయలసీమ రాజకీయాలకు అడ్డా ఉమ్మడి కడప జిల్లా. వై.ఎస్. హవా తర్వత అక్కడ వై.ఎస్. మార్కు రాజకీయంతో ఆ కుటుంబం పట్టు సాధించింది. రాయచోటి అసెంబ్లీ ఈనియోజకవర్గం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది గడికోట శ్రీకాంత్‌ రెడ్డే అని చెప్పాలి. గడికోటకు, వైసీపీకి కంచుకోట రాయచోటి. రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే అని చెప్పాలి. 1955లో ఏర్పడిన రాయచోటి నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్ కాస్త వెనకబడినా.. 2009లో శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. ముందు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది టీడీపీ. బలిజ ఓట్లు ప్రభావం ఈ నియోజకవర్గంలో అధికం. ఇన్నాళ్లు వార్ వన్‌సైడ్‌ అన్నట్లు రాజకీయం నడిచిన రాయచోటిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి? ఎవరేవరు బరిలో నిలిస్తే పరిణామాలు ఎలా ఉండనున్నాయి? శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు? అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్‌ను చూసే ముందు ఓ సారి 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS
గడికోట శ్రీకాంత్‌రెడ్డి(YCP) vs రెడ్డెప్ప గారి రమేష్‌ కుమార్ రెడ్డి(TDP)

YCP 57%
TDP 38%
OTHERS 5%


గత ఎన్నికల్లో రాయచోటిలో వైసీపీ ప్రభంజనమే సృష్టించందని చెప్పాలి. వైసీపీ వేవ్‌కు తోడు నియోజకవర్గంలో గడికోటకు ఉన్న సానుకూలతతో ఆయన బంపర్ మెజారిటీతో విక్టరి సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 57 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి రెడ్డెప్ప గారి రమేష్‌ కుమార్ రెడ్డిపై 18 శాతం ఓట్‌ షేర్‌ తేడాతో ఆయన విజయం సాధించారు. ఆయనకు 38 శాతం ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ నుంచి షేక్‌ అల్లబక్ష్‌ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఒక శాతం ఓట్లను సాధించారు. గడికోటకు ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్, గట్టి పట్టు ఆయన గెలుపుకు కారణమయ్యాయి. మరి ఈ సారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగనున్నారు? ఎవరి గెలుపుకు ఎన్ని చాన్స్‌లు ఉన్నాయి? అనే అంశాలపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఇప్పుడా రిపోర్ట్‌ను పరిశీలిద్దాం.

ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ప్లస్ లు ఏంటి.. మైనస్ లు ఏంటో పరిశీలిస్తే..

గడికోట శ్రీకాంత్ రెడ్డి (YCP)

గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • కలిసి రానున్న రాజకీయ కుటుంబ నేపథ్యం
  • వరుసగా నాలుగు సార్లు గెలుపొందడం
  • నియోజకవర్గ ప్రజల నుంచి బలమైన మద్ధతు
  • పూర్తిగా సహకరించే క్యాడర్
  • జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు
  • నియోజకవర్గంలో మరో బలమైన నేత లేకపోవడం

గడికోట శ్రీకాంత్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • వాలంటీర్లు కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు
  • ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కాస్త వ్యతిరేకత

ఇవి శ్రీకాంత్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ లు. ఇప్పుడు టీడీపీ నేత రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్ లు ఏంటో పరిశీలిస్తే..

రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్ రెడ్డి (TDP)

రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి
  • ఓడినా కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం
  • టీడీపీ క్యాడర్ సపోర్ట్

రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్ రెడ్డి మైనస్‌ పాయింట్స్

-అంతర్గత కుమ్ములాటలు

  • టికెట్ వస్తుందో రాదో అన్న ప్రచారం

ఇవి రమేష్ కుమార్ ప్లస్ అండ్ మైనస్ లు.

ఇప్పుడు మరో టీడీపీ నేత మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ లు ఏంటో పరిశీలిస్తే..

మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి (TDP)

  • మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ప్లస్ పాయింట్స్
  • గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి
  • కలిసి రానున్న తండ్రి వారసత్వ రాజకీయం

మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ప్రజల్లో ఎక్కువగా గుర్తింపు లేకపోవడం
  • పార్టీలు మారుతారన్న ప్రచారం

కుల సమీకరణాలు


ముస్లిం 26 %
రెడ్డి 19 %
ఎస్సీ 13 %
బలిజ 10 %
వడ్డెర 6 %
ఎస్టీ 5 %

రాయచోటి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. 26 శాతం ఉన్న ఈ ప్రజల్లో 60 శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. తమకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చారన్న భావనలో ఉన్నారు ముస్లింలు. మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్సీ లాంటి కీలక పదవులు ముస్లింలకు దక్కడంతో వారు మద్ధతు పలుకుతున్నారు. అయితే టీడీపీకి సాంప్రదాయ ఓటర్లు కూడా ఉన్నారు. 35 శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు. మిగిలిన 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ చేస్తున్నారు.

ముస్లింల తర్వాత రెడ్డి సామాజిక వర్గ ప్రజలు 19 శాతం ఉన్నారు. వీరిలో 50 శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు. వీరంతా మొదటి నుంచి వైసీపీకి మద్ధతు పలుకుతున్నవారే. అయితే టీడీపీ నుంచి కూడా ఈ సామాజిక వర్గ నేతే బరిలోకి దిగుతుండటంతో 45 శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు. మిగిలిన 5 శాతం మంది ఇతర పార్టీలకు మద్ధతు పలుకుతున్నారు.

ఇక ఎస్సీలు 13 శాతం ఉండగా.. వీరిలో 55 శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో వారంతా మద్ధతిస్తున్నారు. అయితే 40 శాతం మంది మాత్రం టీడీపీకి జై కొడుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రాకపోవడంతో చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు.

పది శాతం ఉన్న బలిజ సామాజిక వర్గ ప్రజల్లో 40 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉంటే.. టీడీపీ కూటమికి 55 శాతం మంది మద్ధతిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఇక్కడ ఎక్కువ ప్రభావితం చేస్తోంది. మిగిలిన 5 శాతం మంది ఇతరులకు మద్ధతిస్తున్నారు. ఆరు శాతం ఉన్న వడ్డెరలలో కూడా టీడీపీ కూటమికి అత్యధికంగా మద్ధతిస్తున్నారు. 60 శాతం మంది టీడీపీ కూటమికి మద్ధతిస్తుండగా.. వైసీపీకి 35 శాతం మంది మద్ధతిస్తున్నారు. వడ్డెర సామాజిక వర్గ ప్రజల్లో మొదటి నుంచి టీడీపీకి మద్ధతిస్తు వస్తున్నారు.

ఐదు శాతం ఉన్న ఎస్టీల్లో వైసీపీకి 35 శాతం సపోర్ట్ చేస్తుండగా.. టీడీపీ కూటమికి 55 శాతం మంది మద్ధతిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది ఇతరులకు మద్ధతిస్తున్నారు. అయితే ప్రస్తుత సర్కార్‌పై ఈ సామాజిక వర్గంలో కాస్త ఎక్కువగా అసంతృప్తి ఉన్నట్టు సర్వేలో తేలింది. సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందన్న భావనలో ఉన్నారు ఎస్టీలు.

ఇక వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

గడికోట శ్రీకాంత్ రెడ్డి vs రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్ రెడ్డి

YCP 52 %
TDP 44 %
OTHERS 4 %

ఇప్పటికిప్పుడు రాయచోటిలో ఎన్నికలు జరిగి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రెడ్డెప్పగారి రమేష్‌ కుమార్ రెడ్డి తలపడితే.. గెలుపు అవకాశాలు వైసీపీకే ఉన్నాయని బిగ్ టీవీ ఎలక్షన్‌ సర్వే రిపోర్ట్ చెబుతోంది. వైసీపీ గెలిచేందుకు 52 శాతం అవకాశం ఉండగా.. టీడీపీకి 44 శాతం అవకాశముందని తెలుస్తోంది. గడికోటపై ప్రజల్లో ఉన్న సానుకూలత.. నాలుగుసార్లు గెలవడం.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండటం.. అన్ని సామాజిక వర్గ ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం.. ఇవన్నీ కూడా ఆయన గెలుపుకు దోహదం చేస్తున్నాయి. అయితే నియోజకవర్గ యువతకు సరైన ఉపాధి కల్పించకపోవడం.. రమేష్‌ కుమార్ రెడ్డిపై ఉన్న సానుకూలత.. గడచిన రెండు ఎన్నికల్లో ఓడారన్న సింపతి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. కానీ మొత్తంగా చూస్తే వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌ రెడ్డికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్టు బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వే చెబుతోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×