EPAPER

Chirala Politics : చీరాల ఎవరిది?.. పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : ఎన్నికలు దగ్గర పడే కొద్ది చీరాల సెగ్మెంట్ లో రాజకీయం రసకందయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే అక్కడ నుంచే పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క‌ృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Chirala Politics : చీరాల ఎవరిది?..  పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : ఎన్నికలు దగ్గర పడే కొద్ది చీరాల సెగ్మెంట్ లో రాజకీయం రసకందయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే అక్కడ నుంచే పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన నేత. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆమంచి. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా 2014లో సొంతదైన నవోదయం పార్టీ నుంచి రెండో సారి చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలవగానే వైసీపీలో చేరారు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీసీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాపు సామాజికవర్గనికి ఆమంచి 2019 ఎన్నికలో వైసీసీ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం చేతిలో పరాజయం పాలయ్యారు.

అయితే టీడీపీ నుంచి గెలిచిన కరణం బాలరాం , ఆయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీ గూటికి చేరడంతో ఆమంచి కృష్ణమెహన్ కథ అడ్డం తిరిగింది. కరణం చేరికను ఆమంచి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో చీరాలలో ఆమంచి, కరణం వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు నడిచింది. ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడానికి వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో పక్క నియెజకవర్గం అయిన పర్చూరు వైసీసీ భాధ్యతలను ఆమంచికి కట్టబెట్టారు. గత రెండేళ్లుగా పర్చురు నియోజకవర్గంలో వైసీసీ బలోపెతానికి ఆమంచి కృషి చేస్తూ వచ్చారు.


పర్చూరు నియోజకవర్గం కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. వైసీపీ ఆవిర్భవించిన నాటి నుంచి టీడీపీ పర్చూరులో ఆ పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుత పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే షాక్ ఇచ్చిన నేత ఆయన. ఆమంచి ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో పదివేల దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఫామ్- 7తో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వాటిని తొలగించడంలో సక్సెస్ అయ్యారు. అవన్నీ టీడీపీ సానుభూతిపరుల ఓట్లే అని ఆ పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

అంత చేసినా పర్చూరు నియోజకవర్గంలో తాజాగా చేసిన సర్వేల్లో ఆమంచి 10 వేల ఓట్ల మైనస్‌లో ఉన్నట్లు తేలిందంట దాంతో ఆమంచి పర్చూరులో గెలవలేనన్న అభిప్రాయానికి వచ్చారంట. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన కరణం వెంకటేష్‌ చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా తన పనితనంతో దుసుకుతున్నారు. తాజాగా చీరాలలో నిర్వహించిన వైసీపీ ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ లో వెంకటేష్‌తో పాటు ఉన్న చీరాల వైసీపీ నేతలు వెంకటేష్‌ని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రకటించారు.

ఆ క్రమంలో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆమంచి. 10 రోజుల్లో టికెట్‌పై అధిష్టానం క్లారిటీ ఇస్తుందని చెప్పారట ఒక వేళ చీరాల వైసీపీ అభ్యర్ధిగా కరణం వెంకటేష్ పోటి చేస్తే తను చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని అందరూ సిద్దంగా ఉండాలని తన అనుచరగణాన్ని అప్రమత్తం చేశారంట. ఇటీవల తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌తో భేటీ అయిన ఆమంచి చీరాల టికెట్ బీసీలకు ఇస్తే తన మధ్దతు ఉంటుందని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. లేకపోతే పర్చూరుకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం వెంకటేష్ పంపించి చీరాల టికెట్ ఇవ్వాలని కోరారంటున్నారు.

ఇటు కరణం వెంకటేష్ చీరాల వైసిపి నుంచే తాను పోటీ చేస్తానంటున్నారు. చీరాల సామాజిక బస్సు యాత్రలో మాట్లాడిన వెంకటేష్ .చీరాలలో రౌడి రాజ్యం పోయిందని చీరాల ప్రజలు స్వేచ్ఛతో సంతోషంగా ఉన్నారని మళ్లీ రౌడిలు రావాలని చూస్తే తరమి కొడతామని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో ఆమంచి వర్గం రగిలిపోతోంది. ఆమంచి , కరణం వర్గల మధ్య పోలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే చీరాలకు ఆమంచి వస్తారని ఆమంచి సన్నిహితులు అంటున్నారు.

ఆమంచికి చీరాల సొంత నియోజకవర్గం కావడం రెండు సార్లు ఎమ్మెల్యే పోటి చేసి గెలిచిన అనుభవం, సొంత క్యాడర్ ఉండటంతో వైసిపి టికేట్ వచ్చిన రాకున్నా చీరాల ఇండిపెండింట్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగడానికి రంగం సిద్దం చెసుకుంటున్నట్లు తెలుస్తుంది. చీరాల వైసిపి టికేట్ కరణం కుటుంబానికి కేటాయిస్తే ఆమంచి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ నుంచి చీరాలలో పోటీకి రెడీ అవుతున్నారంట. మరి 2019లో చీరాలలో గెలిచిన టీడీపీ ఈ సారి అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తుందో? పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా మారతాయో? చూడాలి.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×