EPAPER

Kamal Haasan: కమల్‌హాసన్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఆగిపోయిందా?.. నిర్మాణ సంస్థ ట్వీట్ వైరల్

Kamal Haasan: కమల్‌హాసన్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఆగిపోయిందా?.. నిర్మాణ సంస్థ ట్వీట్ వైరల్

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మణిరత్నంతో ‘థగ్ లైఫ్’, శంకర్‌తో ‘ఇండియన్ 2, 3’ వంటి బడా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ఈ క్రమంలోనే మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా గతంలో వచ్చింది. కానీ ఇప్పుడా సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసుకుందాం.


కమల్ హాసన్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో గతేడాది ఓ భారీ ప్రాజెక్ట్ ఓకే అయింది. ‘కమల్‌హాసన్ 233’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. కమల్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు రావడానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. తమ బ్యానర్‌లో రానున్న చిత్రాలను ఉద్దేశించి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘థగ్ లైఫ్’, ‘కమల్ 237’, ‘శివకార్తికేయన్ 21’, ‘శింబు 48’ త్వరలో తమ బ్యానర్ నుంచి రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. ఇక ఇదే లిస్ట్‌లో ‘కమల్ 233’ మూవీ లేకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, అందుకే దాని గురించి ప్రస్తావించలేదని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మూవీ యూనిట్ గానీ, దర్శకుడు వినోద్ గానీ స్పందించలేదు.


Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×