EPAPER

Raviteja Birthday : బలాదూర్ లా కనిపించినా.. ఇడియట్ లా అనిపించినా.. ఈ అబ్బాయ్ చాలా మంచోడు..

Raviteja Birthday : బలాదూర్ లా కనిపించినా.. ఇడియట్ లా అనిపించినా.. ఈ అబ్బాయ్ చాలా మంచోడు..
Raviteja Birthday

Raviteja Birthday : రవితేజ ప్రేక్షకులకు మస్త్ ‘కిక్’ ఇచ్చే నటుడు. ‘ఖతర్నాక్’ ఫైట్స్ తో విలన్స్ ‘బలుపు’ తగ్గిస్తాడు. నటనలో ‘బెంగాల్ టైగర్’ లా విజృంభిస్తాడు. ‘బలాదూర్’ లా కనిపించినా.. ‘ఇడియట్’ లా అనిపించినా.. ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అని ప్రేక్షకుల మనసు దోచిన ‘దొంగోడు’ ఆయన. అంతేకాదు.. తెలుగు సినిమా ‘క్రాక్’ తెప్పించి.. బాక్సాఫీస్ ‘ధమాకా’ ఎలా ఉంటుందో చూపించిన హీరో. ప్రేక్షకుల చేత మాస్ మహరాజా అనిపించుకున్న రవితేజ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం.


తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మందిలో రవితేజ ఒకడు. రవితేజ మొదట అసిస్టెంట్ డైరక్టర్ గా సినీ ప్రస్థానం మొదలు పెట్టి .. ఆపై చిన్న పాత్రలతో తెరంగేట్రం చేసినా తన నటనతో బడా దర్శకులను అట్రాక్ట్ చేసాడు. హీరోగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. రవితేజ పూర్తి పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు.. 1968 జనవరి 26 న తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేటలో జన్మించాడు. తల్లిదండ్రులు రాజ్ గోపాల్ రాజు, రాజ్యలక్మీ భూపతి రాజు. చిన్ననాటి నుండే సినిమాల మీద అమితాసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ ఎన్నో కస్టాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నాడు. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు.

కర్తవ్యం సినిమాతో తెరంగేట్రం చేసిన రవితేజ చైతన్య, అల్లరి ప్రియుడులాంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న రవితేజకి సోలో హీరోగా అవకాశం వచ్చిన చిత్రం నీ కోసం. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకుంది. రవితేజకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టింది. 2012లో వంశీ డైరక్షన్ లో వచ్చిన ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు హిట్టైతే .. ఇడియట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో సుబ్రహ్మణ్యం పాత్రతో ప్రేక్షకులను అలరించాడు. ఇడియట్ లో చంటి పాత్రలో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ప్రదర్శించి తిరుగులేని మాస్ మహరాజాగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత ఖడ్గం మూవీ మరోసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టింది. ఇడియట్ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి లాంటి మరో హిట్ తో రవితేజ కెరీర్ కు ఢోకా లేకుండా చేసింది.


ఆ తర్వాత వరుసగా ఒక రాజు ఒక రాణి , దొంగోడు, వీడే, వెంకీ, నా ఆటోగ్రాఫ్, సినిమాల్లో నటించాడు. హీరోగా సత్తాచాటిన రవితేజ సింగర్ గా కూడా ప్రేక్షకులను అలరించాడు. కాజల్ చెల్లివా.. అనే సాంగ్ తో పాటు, పవర్ సినిమాలో నోటంకి నోటంకి తో ప్రేక్షకులను తన గాత్రంతో ఉర్రూతలూగించాడు. 2005లో భద్ర మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా రవితేజను మళ్లీ రికార్డుల ట్రాక్ ఎక్కించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫి ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఆ తర్వాత ఖతర్నాక్, బలాదూర్, కృష్ణ వంటి సినిమాల్లో నటించాడు. 2008 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అయిన నేనింతే సినిమా.. సినీ నటుల కష్టాలను చూపించింది. ఈ సినిమా రవితేజ కు మరో నంది అవార్డును తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత కిక్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. శంభో శివ శంభో, డాన్ శీను, మిరపకాయ్, వీరా, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చాడు, బలుపు, ఆంజనేయులు వంటి మూవీస్ లో నటించాడు. కొన్ని ఫ్లాప్ అయినా సరే.. తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. వీటిలో బలుపు, మిరపకాయ్ మూవీస్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత పవర్, కిక్ 2, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా, ఖిలాడి, వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించినా.. సోలో హీరోగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం మన మాస్ మహరాజా రవితేజకే సాధ్యమైందనడంలో సందేహం లేదు. కష్టానికి ఓర్పు, సహనం తోడైతే ఎంతవారలైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనటానికి ఉదాహరణ రవితేజ.. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న ఈ ఎనర్జిటిక్ స్టార్ హీరోకి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది బిగ్ టీవి

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×