EPAPER

Meaning of Republic : గణతంత్రం అంటే ఏమిటి?

Meaning of Republic : గణతంత్రం అంటే ఏమిటి?

Meaning of Republic : ‘గణం’ అంటే ప్రజలు. ‘తంత్రం’ అంటే పాలన. వారసత్వ అధికారాలు లేని ప్రజాపాలన అన్నమాట. భారత రాష్ర్టపతి తదితరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ప్రజలే ఎన్నుకుంటారు. మనదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా.. నాటికి మనకు ఎలాంటి రాజ్యాంగం లేదు. కనుక మన నాయకులంతా కలిసి రాజ్యాంగ సభను ఏర్పరచి, దానికి ఎన్నికలు నిర్వహించారు. అలా ఎన్నికైన సభ్యులను ఆయా కమిటీల్లో నియమించి, భారత రాజ్యాంగ రచనకు ఉపక్రమించారు.


రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ అంబేడ్కర్‌ పనిచేయగా, మరెందరో మేధావులు, నేతలు పలు బాధ్యతలను స్వీకరించారు. వీరంతా పలు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఒక నమూనా రాజ్యాంగాన్ని తయారుచేసి, దానిపై బాగా చర్చలు చేసి, అనేక సవరణలు చేశాక.. అంతిమ ప్రతిని రూపొందించారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ దానిని ఆమోదించింది. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టగా, దీనికి అయిన ఖర్చు.. రూ. 64 లక్షలు. నిజానికి 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ.. రాజ్యాంగాన్ని ఆమోదించినా.. దాని అమలుకు రెండు నెలల సమయం పట్టింది. దాని వెనక ఒక చారిత్రక కారణం ఉంది.

1930 జనవరి 26న లాహోర్‌లో కాంగ్రెస్ జాతీయ సమావేశం జరిగింది. నాడు కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో నెహ్రూ రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పటివరకు పాక్షికంగానైనా స్వాతంత్ర్యం వస్తే చాలనుకున్న పాతతరం కాంగ్రెస్ నేతల మాటను పక్కన బెట్టిన నెహ్రూ, నేతాజీ వంటి నేతలంతా పట్టుబట్టి పూర్త స్వరాజ్య తీర్మానాన్ని నెగ్గించి ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకం ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఆ చారిత్రక దినం నాడే రాజ్యాంగం అమల్లోకి వస్తే బాగుంటుందని భావించి, 1956 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా.. 1950 వరకు భారత ప్రభుత్వ చట్టం -1935 ప్రకారమే పాలన కొనసాగింది. రాజ్యాంగం అమల్లోకి రావటంతో ఆ చట్టం రద్దయిపోయి..భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రోజున భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×