Fighter: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’. ‘పఠాన్’, ‘వార్’ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాకు.. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా రిలీజ్‌కు ముందు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా హృతిక్, దీపికాపై ట్రైలర్లో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పఠాన్ మూవీలోని బేషారమ్ సాంగ్‌లో దీపికా బికినీతో చేసిన డ్యాన్స్ ఎలా అయితే ఆకర్షించిందో. అలాంటి బికినీ సాంగ్‌ను ఫైటర్ సినిమాలో కూడా దీపికా చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సాంగ్స్‌లో కొన్ని సీన్స్ కట్ అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఇందులో అసభ్యకరంగా ఉన్న కొన్ని షాట్స్‌ను కట్ చేసిందని సమాచారం. అలా కట్ చేయడంతోనే ఫైటర్‌కి యూ/ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి కొంతమంది సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.