EPAPER
Kirrak Couples Episode 1

Rajahmundry Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజమండ్రి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు ?

Rajahmundry Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజమండ్రి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు ?
Political news in ap

Rajahmundry Assembly Constituency(Political news in AP):

రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ రాజకీయాలు వేడెక్కాయి. 2008 డీ లిమిటేషన్ తర్వాత రాజమహేంద్రవరం రూరల్, సిటీ రెండు సెగ్మెంట్లుగా విభజించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ టీడీపీ కంటిన్యూగా గెలుస్తూ వస్తోంది. 2009, 2014, 2019 ఇలా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది తెలుగుదేశం పార్టీ. ఒకరకంగా చెప్పాలంటే ఈ సెగ్మెంట్ టీడీపీ కంచుకోటగా మారిపోయింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి కూడా జనసేన పొత్తులతో టిక్కెట్ దక్కించుకుంటే మరోసారి తన అదృష్టం పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


గోరంట్ల బుచ్చయ్య చౌదరి (గెలుపు టీడీపీ) VS ఆకుల వీర్రాజు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ లో వైసీపీ 34 శాతం ఓట్లు రాబట్టింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 39 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ కూడా 23 శాతం ఓట్లు సాధించింది. 2019లో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ హవా ఉన్నా ఇక్కడ మాత్రం వర్కవుట్ కాలేదు. జనసేన నుంచి ఫస్ట్ టైం పోటీ చేసిన కందుల దుర్గేష్ మాత్రం కాపు సామాజికవర్గం సపోర్ట్ తో మంచి ఓట్ షేర్ సాధించారు. ఇతరులకు 4 శాతం ఓట్లు లభించాయి. మరి ఈసారి ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (YCP) ప్లస్ పాయింట్స్

శెట్టి బలిజ వర్గానికి చెందిన నేత కావడం

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మైనస్ పాయింట్స్

నాన్ లోకల్ అభ్యర్థిగా జనంలో చర్చ

టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారా లేదా అన్న డౌట్లు

క్యాడర్ సహకరిస్తారా లేదా అన్న సందేహాలు

ఇవి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు సంబంధించిన వివరాలు.. ఇప్పుడు కందుల లక్షీమ దుర్గేష్ వివరాలను పరిశీలిద్దాం.

కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ (JSP) ప్లస్ పాయింట్స్

తూర్పుగోదావరి జిల్లాలో బలమైన నేతగా పేరు

రాజమహేంద్రవరంలో కాపు సామాజికవర్గం సపోర్ట్

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

కందుల లక్షీ దుర్గేష్ ప్రసాద్ ప్లస్, మైనస్ పాయింట్స్ ఇలా ఉంటే.. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అనుకూలించే, ప్రతికూలించే విషయాలేంటో చూద్దాం.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ లీడర్ గా జనంలో గుర్తింపు

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేత

మొదటి నుంచి జగన్ మీద పోరాటం చేస్తున్న నేత

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మైనస్ పాయింట్స్

సెగ్మెంట్ అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోవడం

గోరంట్ల వయసు 77 ఏళ్లకు చేరడం

Caste Politics

రాజమహేంద్రవరం రూరల్ లో షెట్టి బలిజ సామాజికవర్గం బలంగా కనిపిస్తోంది. ఇందులో వైసీపీకి 40 శాతం మంది, టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థికి 55 శాతం మంది, ఇతరులకు ఐదు శాతం మంది సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు ఎస్సీ సామాజికవర్గంలో 50 శాతం జగన్ పార్టీకి, 45 శాతం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. కాపుల్లో 30 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీ జనసేన అభ్యర్థికి 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామన్నారు. అటు దేవాంగ కమ్యూనిటీకి చెందిన వారిలో 45 శాతం వైసీపీకి, 50 శాతం టీడీపీ జనసేనకు 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. యాదవ కమ్యూనిటీలో 40 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీ జనసేనకు, ఐదు శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. వెలమలో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం టీడీపీ జనసేనకు, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ VS కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజమహేంద్రవరం రూరల్ లో జనసేన నుంచి బరిలో దిగే అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ బరిలో దిగితే ఏకంగా 59 శాతం ఓట్ షేర్ రాబట్టే అవకాశాలున్నాయని తేలింది. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు 36 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ VS గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అటు రాజమహేంద్రవరం రూరల్ లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్సెస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తే 52 శాతం ఓట్లతో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 52 శాతం ఓట్లు రాబట్టే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇతరులకు 12 శాతం ఓట్లు రానున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే… రాజమహేంద్రవరం రూరల్ లో టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి టిక్కెట్ దక్కుతుందన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అయితే ఒకవేళ జనసేనకు టిక్కెట్ ఇస్తే మద్దతు ఇచ్చేందుకు టీడీపీ లీడర్ షిప్, క్యాడర్ రెడీగా ఉన్నట్లు గ్రౌండ్ లో క్లారిటీ ఉంది. అదే సమయంలో టీడీపీకి టిక్కెట్ దక్కితే మాత్రం జనసేన లీడర్, క్యాడర్ సహకరించే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఇదేమైనా ఓట్ షేర్ పై ఎఫెక్ట్ చూపించవచ్చు. ఏ పరిణామం జరిగినా రాజమహేంద్రవరం రూరల్ లో మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు లేవని సర్వేలో జన అభిప్రాయంగా తేలింది.

.

.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×