EPAPER

Tadepalligudem Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. తాడేపల్లిగూడెంలో తడాఖా చూపేదెవరు ?

Tadepalligudem Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. తాడేపల్లిగూడెంలో తడాఖా చూపేదెవరు ?

Tadepalligudem Assembly Constituency : ఏపీ రాజకీయాల్లో కూల్ అండ్ సైలెంట్ ఓటింగ్ తో కనిపించే నియోజకవర్గం తాడేపల్లిగూడెం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే పాలిటిక్స్ అంత హాట్ హాట్ గా లేకపోయినా.. పోటా పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏపీలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఇదే తాడేపల్లిగూడెంలో ఉంది. మరోవైపు అక్షరాభ్యాసాలకు బాసర తరువాత తాడేపల్లిగూడెంలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రసిద్ధి పొందినదిగా చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా 2 కిలోమీటర్ల పొడవున్న రన్ వే నిర్మించారు. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి కూడా తాడేపల్లి గూడెం ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మరో ఎన్నికల పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోటీ దాదాపు ఖరారైంది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

కొట్టు సత్యనారాయణ (గెలుపు) VS వెంకట మధుసూధన రావు


గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పోటీ చేసి 42 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి మధుసూధన రావు పోటీ చేసి 32 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 22 శాతం ఓట్లు సాధించారు. నిజానికి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే… ఆ పార్టీల విజయం సునాయాసమై ఉండేది. ఓట్లు చీలడంతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఈజీ అయిందన్నది ఒక అభిప్రాయం. మరి ఈసారి ఎన్నికల్లో తాడేపల్లి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కొట్టు సత్యనారాయణ (YCP) ప్లస్ పాయింట్స్

డీఎస్పీ డివిజన్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

కొట్టు సత్యనారాయణ మైనస్ పాయింట్స్

తాడేపల్లిగూడెంలో రోడ్లు సరిగా లేక జనం ఇబ్బందులు

సరైన సంఖ్యలో తాగునీటి స్టోరేజ్ ట్యాంకులు లేక ఇక్కట్లు

వాటర్ ట్యాంకులు కడుతానన్న హామీలు నెరవేరకపోవడం

గ్రౌండ్ లో యాక్టివ్ గా లేకపోవడం

బొలిశెట్టి శ్రీనివాస్ (JSP) ప్లస్ పాయింట్స్

గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలను సమర్థంగా ఢీకొనడం
టీడీపీ జనసేన పొత్తుతో మరింత బలోపేతం
సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉండడం
పార్టీలో చేరికలను ప్రోత్సహించడం
జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుస్తాడని జనం అభిప్రాయం
సామాజిక సేవా కార్యక్రమాలు అదనపు బలం

Caste Politics

తాడేపల్లిగూడెంలో కాపు సామాజికవర్గం ప్రజలు బలంగా ఉన్నారు. ఇక్కడ కాపుల్లో 35 శాతం మంది వైసీపీకి, 55 శాతం మంది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి, 10 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా వెల్లడించారు. కాపునేస్తం వంటి పథకాన్ని వైసీపీ సర్కారు అమలు చేస్తున్నా… ఈసారి ఎన్నికల్లో తమ ఓటు జనసేన, టీడీపీకే అన్నది మెజార్టీ కాపులు చెబుతున్న మాట. అటు ఎస్సీల్లో 45 శాతం మంది వైసీపీకి, 45 శాతం మంది టీడీపీకి, 10 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. గౌడ సామాజికవర్గంలో వైసీపీకి 40 శాతం, టీడీపీకి 50 శాతం, ఇతరులకు పది శాతం సపోర్ట్ గా ఉంటామంటున్నారు. ఇక యాదవుల్లో 35 శాతం జగన్ పార్టీకి, 55 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. వైశ్యుల్లో 35 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు మద్దతుగా నిలుస్తామంటున్నారు. వడ్డెర సామాజికవర్గంలో 50 శాతం వైసీపీకి, 40 శాతం జనసేన-టీడీపీకి, 10 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెలం నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

కొట్టు సత్యనారాయణ VS బొలిశెట్టి శ్రీనివాస్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ 42 శాతం ఓట్లు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయని తేలింది. అదే సమయంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగితే… 49 శాతం ఓట్లు రాబట్టి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. బొలిశెట్టికి జనంలో ఉన్న మంచి ఇమేజ్, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, జనసేన, టీడీపీ పొత్తులు ఇవన్నీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపును సునాయాసం చేస్తున్నట్లు జనం అభిప్రాయంగా తేలింది. ఇతరులు 9 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×