EPAPER

Chilakaluripet Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. చిలకలూరిపేట జనం ఓటు.. ఎటువైపు ?

Chilakaluripet Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. చిలకలూరిపేట జనం ఓటు.. ఎటువైపు ?

Chilakaluripet Assembly Constituency : చిలకలూరి పేట అసెంబ్లీ సెగ్మెంట్ హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. స్థానికంగా రాజకీ సమీకరణాలన్నీ శరవేగంగా మారుతున్నాయి. ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండవీడు ఫోర్ట్ ఈ నియోజకవర్గంలో ఫేమస్. విద్యా, వ్యాపార, రాజకీయంగా ఈ ప్రాంతం చాలా చైతన్యవతం. ఓ దశలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత వైసీపీ బలం పెంచుకుంది. పార్టీలకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ వస్తున్నారు చిలకలూరిపేట జనం. గత ఐదేళ్లలో చిలకలూరి పేట రాజకీయాలు చాలా మారాయి. మరి ఈసారి చిలకలూరి పేట నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

విడదల రజనీ (YCP) VS ప్రత్తిపాటి పుల్లారావు


గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విడదల రజని, టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు బరిలో దిగారు. హోరా హోరీ పోరు జరిగింది. అయితే ఫైనల్ గా వైసీపీ అభ్యర్థి రజిని విజయం సాధించారు. అప్పుడు వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా… టీడీపీకి 46 శాతం లభించాయి. ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉండడం, జనం మార్పు కోరుకోవడం వంటి అంశాలతో ఫ్యాన్ జోరు పెంచుకుంది. మరి ఈసారి ఎన్నికల్లో వైసీపీ విడదల రజినిని మరో నియోజకవర్గానికి మార్చి.. ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడిని బరిలోకి దింపుతోంది. మరి చిలకలూరి పేట సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

మల్లెల రాజేష్ నాయుడు (YCP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో యాక్టివ్ గా ప్రోగ్రామ్స్

పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మద్దతు

క్యాడర్ సపోర్ట్

మల్లెల రాజేష్ నాయుడు మైనస్ పాయింట్స్

టీడీపీ హవాను ఎంత వరకు తట్టుకుంటారన్న డౌట్లు

ప్రత్తిపాటి పుల్లారావు(TDP) ప్లస్ పాయింట్స్

చిలకలూరిపేటతో విడదీయరాని అనుబంధం

నియోజకవర్గంలో మంచి ఇమేజ్

టీడీపీలో పెద్ద నాయకుడిగా జనంలో పేరు

బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీలో గడపగడపకు క్యాంపెయిన్

Caste Politics

చిలకలూరిపేటలో ఎక్కువగా ఎస్సీ సామాజికవర్గం ప్రజలు ఉన్నారు. ఇందులో 55 శాతం మంది అధికార వైసీపీకి సపోర్ట్ గా ఉంటామని ఎలక్షన్ సర్వేలో భాగంగా తమ అభిప్రాయం వెల్లడించారు. అటు టీడీపీకి 40 శాతం, ఇతరులకు 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. మరోవైపు కమ్మ సామాజికవర్గం లో వైసీపీకి 35 శాతం, టీడీపీకి 60 శాతం ఇతరులకు 5 శాతం మద్దతుగా ఉంటామంటున్నారు. ఇక 13 శాతంగా ఉన్న ముస్లింలు వైసీపీకే ఎక్కువ మద్దతు పలుకుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అటు కాపు కమ్యూనిటీలో చెరో 45 శాతం చొప్పున వైసీపీ, టీడీపీకి సపోర్ట్ ఇస్తామంటున్నారు. మరో 10 శాతం మంది మాత్రం ఇతరులకు సపోర్ట్ ప్రకటిస్తున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గంలో 60 శాతం జగన్ పార్టీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. అటు యాదవ వర్గానికి చెందిన వారిలో 35 శాతం జగన్ పార్టీకి, 60 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు VS ప్రత్తిపాటి పుల్లారావు నిలబడితే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

మల్లెల రాజేశ్ నాయుడు VS ప్రత్తిపాటి పుల్లారావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి 43 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఉండగా… టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 49 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలున్నట్లు తేలింది. ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిలకలూరిపేటలో టీడీపీ పుంజుకోవడం, ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చి కొత్త నేతకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వారికి తక్కువ సమయం ఉండడం ఇవన్నీ ఫలితాలపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు పట్ల సానుకూలత పెరగడం టీడీపీ విజయావకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×