EPAPER
Kirrak Couples Episode 1

Janga Krishnamurthy : గురజాలలో వైసీపీ ట్విస్ట్.. బీసీ నాయకుడికి హ్యాండిచ్చిన జగన్ పార్టీ..

Janga Krishnamurthy : ఆ ఎమ్మెల్సీ పరిస్థితి విచిత్రంగా తయారైందంట.. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేత ఇప్పుడు సొంత సెగ్మెంట్లో టికెట్ గ్యారెంటీ లేక దిక్కులు చూడాల్సి వస్తోందంట. ఉన్న పార్టీ ఇప్పటికే ఒకసారి టికెట్ విషయంలో హ్యాండిచ్చి.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ సారైనా టికెట్ ఇస్తుందనుకుంటే సారీ చెప్పేసింది. దాంతో పక్కపార్టీలో చేరదామనుకున్నా.. అక్కడా టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదంట. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ నుంచి కదలి లేక .. అలాగని అక్కడే ఉండలేక తనలో తాను మధన పడుపోతున్నారంట ఆయన.. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? .. ఆయన వెతుక్కుంటున్న దారులేంటి?

Janga Krishnamurthy : గురజాలలో వైసీపీ ట్విస్ట్.. బీసీ నాయకుడికి హ్యాండిచ్చిన జగన్ పార్టీ..

Janga Krishnamurthy : ఆ ఎమ్మెల్సీ పరిస్థితి విచిత్రంగా తయారైందంట.. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేత ఇప్పుడు సొంత సెగ్మెంట్లో టికెట్ గ్యారెంటీ లేక దిక్కులు చూడాల్సి వస్తోందంట. ఉన్న పార్టీ ఇప్పటికే ఒకసారి టికెట్ విషయంలో హ్యాండిచ్చి.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ సారైనా టికెట్ ఇస్తుందనుకుంటే సారీ చెప్పేసింది. దాంతో పక్కపార్టీలో చేరదామనుకున్నా.. అక్కడా టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదంట. ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ నుంచి కదలి లేక .. అలాగని అక్కడే ఉండలేక తనలో తాను మధన పడుపోతున్నారంట ఆయన.. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? .. ఆయన వెతుక్కుంటున్న దారులేంటి?


జంగా కృష్ణమూర్తి .. పేరుమోసిన బీసీ నాయ‌కుడు.. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గతంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడన్న ముద్ర కూడా ఉంది .. అలాంటి సీనియర్ నేతకి తిరిగి గురజాల నుంచి పోటీ చేద్దామంటే టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదంట.. తన పార్టీలోనే కాదు ఇంకొక పార్టీలోకి వెళ్ళినా కూడా టికెట్ లభిస్తుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది.. దాంతో పొలిటికల్ ఫ్యూచర్‌పై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారంట జంగా.

సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్న జంగా క‌ృష్ణమూర్తికి .. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బానే నడిచింది .. రెండు సార్లు ఎమ్మెల్యేగా గుర‌జాలలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీకి జై కొట్టిన జంగా..2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు.. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గుర‌జాల వైసీపీ టికెట్‌ తనకు కాకుండా.. ఎవరికి ఇస్తారన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఆయనకు జగన్ షాక్ ఇచ్చారు .. కాసు మ‌హేష్‌రెడ్డిని గురజాల బరిలో దింపడంతో .. జంగా పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది .. ఆ క్రమంలో ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది వైసీపీ.


ఈ సారి మాత్రం త‌నకే గురజాల టికెట్ కేటాయించాల‌ని జంగా కృష్ణమూర్తి ప‌ట్టుబ‌డుతున్నారు .. అయితే అక్కడ ఎమ్మెల్యే కాసుకి, జంగాకు అసలు పొస‌గ‌డం లేదు. గురజాలలో కాసుమహేష్ గెలిచినప్పటి నుంచి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది .. ఈ నేప‌థ్యంలో ఆయన నియోజకవర్గంలో అన్ని బీసీ సంఘాల‌ను ఏకం చేస్తూ .. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సీఎం జ‌గ‌న్‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని .. ఈ సారి టికెట్ తనకేనని అంటున్నారు

కాసు మమేష్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి స్వయానా మనవడు.. మహేష్ తండ్రి కాసు కృష్ణారెడ్డి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. ఆ కుటుంబనేపధ్యం, ఆర్థిక బలం.. పైపెచ్చు సామాజికవర్గం లెక్కలన్నీ మహేష్‌రెడ్డికే అనుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు .. ఆ క్రమంలో జంగాకి జగన్ మళ్లీ హ్యాండ్ ఇస్తే.. ఆయన పార్టీ మారే పరిస్థితి కూడా కనిపించడం లేదంటున్నారు .. టీడీపీలోకి వెళ్లినా అక్కడ గురజాల టికెట్ దక్కడం అసాధ్యమే.. అక్కడ ఇప్పటికే జంగాపై టీడీపీ నుంచి 6 సార్లు పోటీ చేసి.. మూడు సార్లు విజయం సాధించిన యరపతినేని శ్రీనివాసరావులాంటి బలమైన అభ్యర్ధిగా ఉన్నారు.

అందుకే ఎటూ నిర్ణయించుకోలేక వైసీపీలోనే కనీసం వేరే సెగ్మెంట్ టికెట్ అయినా దక్కకపోతుందా? అని ఎదురు చూస్తున్నారంట.. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ నియోజకవర్గం మార్చి జంగాకి అవకాశం ఇస్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే అంటున్నాయి వైసీపీ శ్రేణులు .. జంగా కృష్ణమూర్తి పార్టీ మారతారనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అయినా వైసీపీ పెద్దలెవరూ జంగాని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు.. పార్టీ మార్పునకు సంబంధించి వైసీపీ నేతలు కొందరు జంగాపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధిష్టానం అటువంటి వారిని వారించే ప్రయత్నం కూడా చేయడం లేదు.. ఒకవేళ జంగాకి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆయన పైన విమర్శలు చేసిన వారిని జిల్లా స్థాయి నేతలు కనీసం మందలించే వారు కదా అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే జంగాని జగన్ ఇక పక్కన పెట్టేసినట్లే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.. అదే సమయంలో జంగా సొంతగూడు కాంగ్రెస్‌లో చేరి షర్మిల తో పాటు నడిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి .. ఓవరాల్‌గా చూస్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా కాసు మహేష్‌రెడ్డిపైపే మొగ్గు చూపితే .. ఆ పార్టీకి బీసీ నేత జంగా రూపంలో గండం పొంచి ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×