EPAPER

Vijayawada : టీడీపీలో రచ్చ.. విజయవాడ సెంట్రల్ సీటుపై చర్చ..

Vijayawada : ఎమ్మెల్యే టికెట్ కోసం నాయకుల మద్య పోటీ సర్వసాధారణం.. కాని ఫలానా నియోజకవర్గం మాత్రమే కావాలనే విషయంలో పోటీ జరిగితే మాత్రం. అది నేతల మధ్య పోటిలా కాదు పొట్టెళ్ల మధ్య పోరులా ఉంటుంది.. విజయవాడలో రెండు బలమైన పొట్టేళ్ల మధ్య యుద్దానికి ఓ నియోజకవర్గ వేదిక కాబోతోంది .. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది?. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలెవరు?

Vijayawada : టీడీపీలో రచ్చ.. విజయవాడ సెంట్రల్ సీటుపై చర్చ..

Vijayawada : ఎమ్మెల్యే టికెట్ కోసం నాయకుల మద్య పోటీ సర్వసాధారణం.. కాని ఫలానా నియోజకవర్గం మాత్రమే కావాలనే విషయంలో పోటీ జరిగితే మాత్రం. అది నేతల మధ్య పోటిలా కాదు పొట్టెళ్ల మధ్య పోరులా ఉంటుంది.. విజయవాడలో రెండు బలమైన పొట్టేళ్ల మధ్య యుద్దానికి ఓ నియోజకవర్గ వేదిక కాబోతోంది .. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది?. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలెవరు?


విజయవాడలో పొలిటికల్‌గా ఏం జరిగినా అది హాట్ టాపిక్ అయిపోతుంటుంది. ముఖ్యంగా సెంట్రల్ సీటు విషయంలో అయితే మరీనూ.. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, విష్ణు మధ్య అంటుకున్న సెంట్రల్ టికెట్ నిప్పు ఇంకా చల్లారలేదు.. ఇప్పుడదే సీన్ టీడీపీలో కూడా రిపీట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీలో సెంట్రల్ సీటు అగ్గిలా కాదు కార్చిచ్చులా మారే అవకాశం ఉంది.. విజయవాడ సెంట్రల్ సీటు నాదే, గెలిచేది కూడా నేనే అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా రెండున్నరేళ్లుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో‌ కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి‌న ఉమా రెండేళ్లు పాటు ఓటమి నుండి తేరుకోలేకపోయారు. ఇంతలో కార్పొరేషన్ ఎన్నికల్లో సెంట్రల్‌లో మరోసారి టీడీపీకి చావు దెబ్బ పడింది. 21 డివిజన్లలో కేవలం 5 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. దీంతో ఉమా సీన్ అయిపోయిందని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది.. ఇంతలో టీడీపీ నేతల కన్ను వంగవీటి రాధా మీద పడింది . గత ఎన్నికల‌ ముందు ఇదే సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ అధినాకత్వంతో గొడవపడి మరీ బయటకి వచ్చి.. టీడీపీలో చేరారు వంగవీటి రాధా.. అప్పట్లో సెంట్రల్ లో సీటు దక్కకపోయినా.. బొండా ఉమాకి సపోర్ట్ ఇచ్చి విష్ణుని ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేశారు.


ఉమా ఓడిపోవడంతో కొన్నాళ్లు ఆయనతో పాటురాధా కూడా సైలైంట్ అయ్యారు. కరొనా ఎఫెక్ట్ తగ్గి రెండేళ్ల తరువాత ఉమా యాక్టీవ్ అయినా.. రాధా మాత్రం అంతంతమాత్రంగానే టీడీపీ యాక్డివిటీస్ లో పాల్గొంటూ వచ్చారు. రాధా పేరుకి టీడిపిలో ఉన్నా ఏనాడు టీడీపీ సభ్యుడిగా జగన్ పైన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు .. దీంతో రాధాకు సెంట్రల్ సీటుపై ఇంట్రస్ట్ లేదని, ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారన్న సంకేతాలను ఉమా వర్గీయులు నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపి క్యాడర్ , రాధా వర్గం మొత్తం ఉమాకి జై కొట్టాల్సిన పరిస్దితి వచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాధా.. చాప కింద నీరులా టీడీపిని వీడిపోయిన ఒక్కొక్కరిని మళ్లీ పార్టీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఆ పనిలో అనేక జిల్లాలు తిరుగుతూ అనేకమందిని కలుస్తూ బిజీబిజీగా మారిపోయారు రాధా.. అయితే రాధా ఇంత యాక్టీవ్ అవడానికి కారణం రాధా అడిగిన సెంట్రల్ సీటే అని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సీటుపై కన్ఫర్మెషన్ వచ్చాకే రాధా తన పరిచయాలను పార్టికి ఉపయోగపడేలా చేస్తున్నారని, అది పార్టీ గుర్తించిందని రాధా వర్గీయులు చెబుతున్నారు. సెంట్రల్‌లొ బొండా ఉమా కన్నా రాధాకు టికెట్ ఇవ్వడం వల్ల కాపుల్లో టీడీపీ పట్ల సానుకూలత మరింత పెరుగుతుందని టీడీపి పెద్దలు భావిస్తున్నట్టు రాధా వర్గీయులు చెబుతూ వచ్చారు.

దీంతో గత ఎన్నికల్లో తమకు సహకరించిన రాధాపై నెగిటివ్ ప్రచారం మొదలెట్టింది బొండా వర్గం.. అసలు రాధా ఇంతవరుకు పార్టీ కండువానే వేసుకోలేదని.. చంద్రబాబును తిడుతున్నా నోరు మెదపడంలేదని.. జైల్లో పెట్టినా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలేదని.. ఇవన్ని కాక నిరంతరం చంద్రబాబును తిట్టే వంశీ, కొడాలితో స్నేహం ఉంది కాబట్టి … రాధాకు టికెట్ రాదంటూ ఉమా వర్గీయులు బహిరంగ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో రాధా వర్గీయులు కౌంటర్స్ సిద్దం చేసినా .. వారిని వారిస్తున్నరాధా వెయిట్ అండ్ సీ అంటున్నారంట.

ఉమాకు సీటు ఇవ్వకుండా రాధా వైపు టీడిపీ అధిష్టానం వెళ్లడానికి కారణాలను చూస్తే రాధా, ఉమా ఇద్దరూ ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. రాధా బలం , బలహీనత రెండూ వంగవీటి అభిమానులే.. రాధా లాంటి నేత ప్రత్యక్షరాజకీయాల్లో ఉంటే ఆ పార్టీకి అదనపు మైలేజ్ వస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.. రాధా గతంలో తూర్పులో గెలిచినప్పటికి నియోజకవర్గాల పునర్విభజనలో తూర్పులో కీలక ఓటింగ్ సెంట్రల్‌కి వెళ్లిపోయింది. దీంతో 2009 లో సెంట్రల్ నుండే పోటి చేసి ఓడిపోయారాయన.. 2014 లో జగన్ బలవంతం మీద తూర్పులో పోటి చేసి మరోసారి ఓడిపోయారు .. దీంతో 2019 లో అసలు పోటి చేయకుండా సెంట్రల్ లో ఉమాకి మద్దతు తెలిపారు.

దీంతో మరొకసారి తన అదృష్డాన్ని సెంట్రల్ నుండే పరిక్షించుకోవాలని రాధా చూస్తున్నారట.. వంగవీటి ఫ్యామిలి ఇమేజ్.. గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా పార్టీకి ప్రచారం చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో పట్టు ఉండడం..పార్టీ కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ వైసీపీ వ్యతిరేక నాయకులతో, టీడీపి అసమ్మతినేతలతో సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని.. టీడిపి అధిష్టానం రాధావైపు మొగ్గు చూపుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఉమా విషయానికొస్తే 2014 లో టీడీపీ సెంట్రల్ నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు.. 2019 లో మళ్లీ సెంట్రల్ నుండే పోటి చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.. తరువాత పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం , మూడేళ్ల వరుకు పార్టీ కార్యక్రమాలలో నామమాత్రంగానైనా పాల్గొనడం.. స్దానిక సంస్దల ఎన్నికల్లో ఓటమి.. లాంటివి ఉమాపై నెగిటివ్ రిపోర్ట్స్‌కు కారణమయ్యారంటున్నారు.. అయితే గత రెండేళ్లుగా టీడీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఉమా యాక్టీవ్ గా ఉన్నప్పటికి .. స్దానిక పరిస్దితులు , విష్ణు బదులు వెల్లంపల్లికి వైసీసీ సెంట్రల్ సీటు ఇవ్వడం.. వెల్లంపల్లిని డీ కొట్టాలంటే ఉమా కన్నా రాధానే కరెక్ట్ అని పార్టీ భావించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×